వైఎస్సార్ బీమా (YSR BIMA)
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బియ్యం కార్డు కలిగిన కుటుంబాలకు "వైఎస్సార్ బీమా" (YSR BIMA) పథకాన్ని అమలు చేయనున్నారు.
- కుటుంబానికి ఆధారమైన వ్యక్తి మరణిస్తే ఈ పథకం (YSR BIMA) కింద ఆర్ధిక సహాయం అందుతుంది.
- 18 - 50 ఏళ్ల మధ్య వ్యక్తి సహజ మరణం పొందితే రూ. 2 లక్షలు, ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం సంభవించినా రూ. 5 లక్షలు ఇస్తారు.
- 51 - 70 ఏళ్ల వయసు వ్యక్తి ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం సంభవించినా రూ. 3 లక్షలు పరిహారం అందుతుంది.
- ఈ పథకం (YSR BIMA) పై ప్రభుత్వం రూ. 583.5 కోట్లు ఖర్చు చేస్తుంది.
- గతంలో కేంద్ర ప్రభుత్వం 'పీఎంజేజేవై' (PMJJY) పథకం కింద సగం మొత్తం (రూ.396 కోట్లు) అందజేసేది.
- కేంద్రం ఆ పథకాన్ని (PMJJY) రద్దు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వమే సొంత ఖర్చులతో ఈ పథకాన్ని (YSR BIMA) అమలు చేయాలని నిర్ణయించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి