1. కొవిడ్-19 (COVID-19) మహమ్మారి నివారణకు మొట్టమొదటిసారిగా "స్పుత్నిక్-వి" (SPUTNIK-V) టీకాను పూర్తిస్థాయిలో సిద్ధం చేసిన దేశం ? (ఈ టీకా ను 2020 ఆగస్టు 11 న రిజిస్టర్ చేసారు. ఈ టీకా తో 2 సంవత్సరాల పాటు రక్షణ లభిస్తుంది)
(ఎ) అమెరికా
(బి) రష్యా
(సి) బ్రిటన్
(డి) భారత్
2. శ్రీలంక నూతన ప్రధాని ?
(ఎ) గొటబాయ రాజపక్స
(బి) మహింద రాజపక్స
(సి) బసిల్ రాజపక్స
(డి) మైత్రిపాల సిరిసేన
3. ఈ సంవత్సరంలో విడుదల చేసిన "ఫార్చూన్ గ్లోబల్ 500" (FORTUNE GLOBAL 500) జాబితాలో అగ్రగామి 100 కంపెనీల్లోకి చేరిన ఏకైక భారతీయ కంపెనీ 'రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్' స్థానం ?
(ఎ) 93
(బి) 94
(సి) 95
(డి) 96
4. కేంద్ర గణాంక విభాగం తాజాగా విడుదల చేసిన '2018 సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం గణాంకాలు' ప్రకారం 90%కి పైగా జననాలు, మరణాలు నమోదు చేస్తున్న రాష్ట్రాలు ? (ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి)
(ఎ) 6
(బి) 7
(సి) 8
(డి) 9
5. కేంద్ర గణాంక విభాగం తాజాగా విడుదల చేసిన '2018 సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం గణాంకాలు' ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకంటే పురుషుల మరణాలు ఎంతశాతం అధికంగా ఉన్నాయి ?
(ఎ) 39%
(బి) 49%
(సి) 59%
(డి) 69%
6. పునరుత్పాదక విద్యుత్తును ప్రోత్సహించడానికి సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ట్రాన్స్ కో కు చెల్లించాల్సిన పంపిణీ చార్జీలు మినహాయిస్తూ కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులిచ్చింది. ఏ తేదీలోగా ఏర్పాటు చేసిన 'సౌర, పవన, హైబ్రిడ్' సంస్థలు రెన్యూవబుల్ పర్చేజ్ ఆబ్లిగేషన్ (RPO) పరిధిలో ఉన్నా, లేకున్నా ఈ మినహాయింపు వర్తిస్తుంది ?
(ఎ) 2021 జూన్ 30
(బి) 2022 జూన్ 30
(సి) 2023 జూన్ 30
(డి) 2024 జూన్ 30
7. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయస్థాయిలో ఏటా ఇచ్చే 'ఇ-పంచాయత్ పురస్కార్' విభాగంలో 2020 ఏడాదికి ఆంధ్రప్రదేశ్ స్థానం ?
(ఎ) 1
(బి) 2
(సి) 3
(డి) 4
8. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ జాతీయస్థాయిలో ఏటా ఇచ్చే పురస్కారాలలో 2020 ఏడాదికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి "నానాజీ దేశ్ ముఖ్ రాష్ట్రీయ గౌరవ గ్రామసభ పురస్కారం" పొందిన గ్రామం ?
(ఎ) చెల్లూరు (తూర్పుగోదావరి జిల్లా)
(బి) బొండపల్లి (విజయనగరం జిల్లా)
(సి) మూలస్థానం (తూర్పుగోదావరి జిల్లా)
(డి) కరప (తూర్పుగోదావరి జిల్లా)
9. 2020 ఏడాదికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన "దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తికరణ్ పురస్కారాలు ?
(ఎ) 9
(బి) 10
(సి) 11
(డి) 12
10. భారత ఒలింపిక్స్ చరిత్రలో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం గెలిచిన ఏకైక ప్లేయర్ ?
(ఎ) కరణం మల్లీశ్వరి
(బి) రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్
(సి) పీ.వీ.సింధు
(డి) అభినవ్ బింద్రా
కీ (GK TEST-58 DATE : 2020 AUGUST 16)
1) బి 2) బి 3) డి 4) డి 5) సి 6) సి 7) బి 8) ఎ 9) సి 10) డి
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి