ఈ బ్లాగును సెర్చ్ చేయండి

4, ఆగస్టు 2020, మంగళవారం

GK TEST-56

1. "ప్రవాసీ రోజ్ గార్" (PRAVASI ROJGAR) పోర్టల్ ద్వారా వలస కూలీలకు 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని ప్రకటించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు ? (2020 జూలై 30 న తన 47వ పుట్టినరోజు సందర్భంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు)
(ఎ) అక్షయ్ కుమార్
(బి) సోనూ సూద్
(సి) రణ్ బీర్ కపూర్
(డి) వివేక్ ఒబెరాయ్

2. అయోధ్యలో నిర్మితం కానున్న 'రామ మందిరం' ఆకృతిని ఏ శైలిలో రూపొందించారు ?
(ఎ) నాగర
(బి) ద్రావిడ
(సి) ఇండోనేషియన్
(డి) కళింగ

3. భారతదేశంలో 'కరోనా' తొలి కేసు కేరళలో నమోదైన తేదీ ?
(ఎ) 2020 జనవరి 25
(బి) 2020 జనవరి 30
(సి) 2020 ఫిబ్రవరి 5
(డి) 2020 ఫిబ్రవరి 10

4. "పోర్ట్ లూయిస్" లో నిర్మించిన మారిషస్ దేశ సుప్రీంకోర్ట్ భవనాన్ని ఆ దేశ ప్రధాని 'ప్రవింద్ కుమార్ జగన్నాధ్' తో కలిసి భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' ప్రారంభించిన తేదీ ?
(ఎ) 2020 జూలై 28
(బి) 2020 జూలై 29
(సి) 2020 జూలై 30
(డి) 2020 జూలై 31



5. రాష్ట్రాలకు వస్తు, సేవల పన్ను (GST ⇒ Goods and Services Tax) ఆదాయం తగ్గినా, పరిహారం చెల్లించాల్సిన 'చట్టబద్ధ బాధ్యత' కేంద్ర ప్రభుత్వానికి లేదని తెలియజేసిన భారత ప్రస్తుత 'అటార్నీ జనరల్' ?
(ఎ) కె.కె. వేణుగోపాల్
(బి) ముకుల్ రోహత్గీ
(సి) గులాం ఈ వాహనవతి
(డి) సోలీ సొరాబ్జీ

6. అమెరికా ఆర్ధిక వ్యవస్థ 'ఏప్రిల్-జూన్' (2020) త్రైమాసికంలో ఎంత శాతం వార్షిక రేటుతో క్షీణించింది ? (ఒక త్రైమాసికంలో ఇంత గణనీయంగా ఆర్ధిక వ్యవస్థ క్షీణించడం అమెరికా చరిత్రలో ఇదే మొదటిసారి)
(ఎ) 31%
(బి) 32%
(సి) 33%
(డి) 34%

7. మహిళల టెన్నిస్ సింగిల్స్ ప్రస్తుత ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి ?
(ఎ) ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా)
(బి) నవోమీ ఒసాకా (జపాన్)
(సి) సిమోనా హలెప్ (రొమేనియా)
(డి) కరోలిన్ వొజనైక్ (డెన్మార్క్)

8. అంగారకుడి (అరుణ గ్రహం) గుట్టుమట్లు తెలుసుకోవడానికి అమెరికా అంతరిక్ష సంస్థ "నాసా" (NASA) 2020 జూలై 30 న ప్రయోగించిన అత్యంత అధునాతనమైన 'రోవర్' పేరు ? (ఈ రోవర్ 2021 ఫిబ్రవరి 18 న అంగారక ఉపరితలంపై కాలుమోపుతుంది)
(ఎ) ఇన్ జెన్యూటీ
(బి) అట్లాస్ - 5
(సి) జెజెరో
(డి) పర్ సెవరెన్స్

9. 'పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ' ప్రస్తుత 'సీ ఈ ఓ' (CEO ⇒ Chief Executive Officer) ? (ప్రస్తుతం 'గోదావరి నదీ యాజమాన్య మండలి' చైర్మన్ గా ఉన్న ఇతను 'పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ' సీ ఈ ఓ గా మరో ఆరు నెలలు అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు)
(ఎ) చంద్రశేఖర్ అయ్యర్
(బి) హరికేష్ మీనా
(సి) యూసీ సింగ్
(డి) అలీం బాషా

10. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బియ్యంకార్డు ను 'ఆదాయ ధ్రువపత్రం' గా గుర్తించాలని 2020 జూలై 25 న ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ తేదీన రద్దు చేసుకుంది ? (బియ్యం కార్డు లేకుంటే 'ఆదాయ ధ్రువపత్రం' తీసుకోవాలని, అది నాలుగేళ్లపాటు మనుగడలో ఉంటుందనే ఉత్తర్వులు ఇకమీదట చెల్లుబాటు కావు. "స్వయంచాలిత" (AUTOMATIC) విధానంలో వీటిని జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది)
(ఎ) 2020 జూలై 31
(బి) 2020 జూలై 30
(సి) 2020 జూలై 29
(డి) 2020 జూలై 28 



కీ (GK TEST-56 DATE : 2020 AUGUST 4)
1) బి 2) ఎ 3) బి 4) సి 5) ఎ 6) సి 7) ఎ 8) డి 9) ఎ 10) బి

All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి