ఈ బ్లాగును సెర్చ్ చేయండి

22, సెప్టెంబర్ 2020, మంగళవారం

GK TEST-69

1. రోమ్ లో జరుగుతున్న 'గోల్డెన్ గాలా అథ్లెటిక్ మీట్' లో పురుషుల పోల్ వాల్ట్ ఔట్ డోర్ పోటీల్లో రెండో ప్రయత్నంలో 6 మీటర్ల 15 సెంటీమీటర్లు ఎగిరి ... 1994లో ఉక్రెయిన్ స్టార్ 'సెర్గీ బుబ్కా' (SERGEY BUBKA) నెలకొల్పిన రికార్డ్ (6.14 మీటర్లు) ను "ఆర్మాండ్ డుప్లాంటిస్" (ARMAND DUPLANTIS) బద్దలు కొట్టాడు. ఆర్మాండ్ డుప్లాంటిస్ ఏ దేశం తరపున ఈ పోటీల్లో పాల్గొన్నాడు ? (ఇండోర్ ప్రపంచ రికార్డ్ (6.18 మీటర్లు) కూడా ఆర్మాండ్ డుప్లాంటిస్ పేరు మీదే ఉంది)
(ఎ) స్వీడన్
(బి) అమెరికా
(సి) రష్యా
(డి) నెదర్లాండ్స్

2. యూఏఈ (UAE ⇒ United Arab Emirates) లో జరుగుతున్న ఐపీఎల్ 13వ సీజన్ లో 'కొవిడ్-19' మహమ్మారిపై యుద్ధంలో ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు తదితర యోధులకు ధన్యవాదాలు చెబుతూ "థ్యాంక్యూ కొవిడ్ వారియర్స్" (Thank You COVID Warriors) అనే సందేశంతో కూడిన జెర్సీ లను ధరిస్తున్న ఐపీఎల్ జట్టు ?
(ఎ) ముంబై ఇండియన్స్
(బి) చెన్నై సూపర్ కింగ్స్
(సి) దిల్లీ క్యాపిటల్స్
(డి) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

3. ఆరోగ్యశ్రీ అనుబంధ ఆసుపత్రుల్లో జరిగే కాన్పులకు 'ఆరోగ్య ఆసరా' కింద ప్రస్తుతం ఇస్తున్న మొత్తానికి అదనంగా ఎంత పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' 2020 సెప్టెంబర్ 18న ప్రకటించారు ? (ఈ పెంపు తర్వాత సాధారణ కాన్పులకు రూ. 5,000, సిజేరియన్ కు రూ. 3,000 అందజేస్తారు)
(ఎ) రూ. 1,000
(బి) రూ. 2,000
(సి) రూ. 3,000
(డి) రూ. 4,000



4. మహిళల టెన్నిస్ లో ఎన్నో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన అమెరికా మాజీ దిగ్గజ క్రీడాకారిణి గౌరవ సూచకంగా అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య 'ఫెడ్ కప్' (FED CUP) పేరును ఆ క్రీడాకారిణి పేరిట మార్చింది. పేరు మార్చిన తర్వాత 'ఫెడ్ కప్' (FED CUP) ను ఏ పేరుతో పిలవనున్నారు ? (ఒక మహిళ పేరుతో జరగబోతున్న తొలి అంతర్జాతీయ టోర్నీ ఇదే)
(ఎ) మార్గరెట్ కోర్ట్ కప్
(బి) బిల్లీ జీన్ కింగ్ కప్
(సి) మార్టీనా నవ్రతిలోవా కప్
(డి) స్టెఫీగ్రాఫ్ కప్

5. 'వైఎస్సార్ చేయూత' (YSR CHEYUTHA) పథకం కింద 45-60 ఏళ్ల మధ్య వయసున్న 'ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ' మహిళలకు మొదటి విడతగా రూ. 18,750 చొప్పున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాయం అందించింది. ఈ మొత్తంతోపాటు రిటైల్ వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకునే ఒక్కో మహిళకు ఎంత మొత్తాన్ని రుణంగా అందేలా చూస్తారు ? (కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారికి కనీసం నెలకు రూ. 13,500 ఆదాయం వచ్చేలా ప్రణాళిక తయారు చేసారు)
(ఎ) రూ. 18,750
(బి) రూ. 37,500
(సి) రూ. 56,250
(డి) రూ. 75,000

6. 'కరోనా' వైరస్ వ్యాధి (COVID-19) కి 'రష్యా' ఆవిష్కరించిన "స్పుత్నిక్-వి" (SPUTNIK-V) టీకాను మన దేశానికి తీసుకురానున్న ప్రముఖ ఔషధ తయారీ సంస్థ ? ('స్పుత్నిక్-వి' టీకాపై మనదేశంలో క్లినికల్ పరీక్షల నిర్వహణ, ఆ తర్వాత పంపిణీ నిమిత్తం రష్యా దేశానికి చెందిన 'రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్' (RDIF) తో ఈ ఔషధ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది)
(ఎ) సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
(బి) డా. రెడ్డీస్ లేబొరేటరీస్
(సి) అరబిందో ఫార్మా లిమిటెడ్
(డి) దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్



7. 'ఐ ఆర్ డీ ఏ ఐ' (IRDAI ⇒ Insurance Regulatory and Development Authority of India) ప్రస్తుత చైర్మన్ ?
(ఎ) సురేశ్ మాథుర్
(బి) గిరీశ్ కృష్ణమూర్తి
(సి) అజయ్ త్యాగి
(డి) సుభాష్ చంద్ర ఖుంతియా

8. ఒక మోస్తరు నుంచి మధ్యస్థాయి 'కొవిడ్-19' బాధితులకు చికిత్సలో వినియోగిస్తున్న మందు ?
(ఎ) ఫావిపిరవిర్
(బి) రెమ్ డెసివిర్
(సి) రెవ్లీమిడ్
(డి) పటాడైన్

9. ఏ రాష్ట్రంలో "మెగా ఈ-లోక్ అదాలత్" ద్వారా ఒక్క రోజులో 1,15,000 కేసులను పరిష్కరించారు ? (2020 సెప్టెంబర్ 19న సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ 'మెగా ఈ-లోక్ అదాలత్' ను ప్రారంభించారు. సుదూరంలో ఉన్నవారికీ 'ఈ-లోక్ అదాలత్' ద్వారా న్యాయం చేయగలిగే వీలు కలుగుతుంది)
(ఎ) ఆంధ్రప్రదేశ్
(బి) తెలంగాణ
(సి) కర్ణాటక
(డి) మహారాష్ట్ర



10. 'గ్రాండ్ ఓల్డ్ లేడీ' (Grand Old Lady) గా కూడా పిలుచుకునే యుద్ధ నౌక "విరాట్" (INS VIRAAT) ను భారత నౌకాదళం నుంచి ఎప్పుడు ఉపసంహరించారు ? (30 ఏళ్లపాటు భారత నౌకాదళానికి సేవలు అందించి విశ్రాంతి తీసుకుంటున్న 'విరాట్' ను విడగొట్టి, తుక్కు కింద విక్రయించనున్నారు)
(ఎ) 2015 మార్చ్
(బి) 2016 మార్చ్
(సి) 2017 మార్చ్
(డి) 2018 మార్చ్       

కీ (GK TEST-69 DATE : 2020 SEPTEMBER 22)
1) ఎ 2) సి 3) బి 4) బి 5) సి 6) బి 7) డి 8) ఎ 9) సి 10) సి
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి