ఈ బ్లాగును సెర్చ్ చేయండి

12, సెప్టెంబర్ 2020, శనివారం

GK TEST-65

1. 'పోషకాలతో కూడిన బలవర్ధక బియ్యం' పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏ జిల్లాను పైలట్ ప్రాజెక్ట్ (Pilot Project) గా ఎంపిక చేశారు ? (ప్రజా పంపిణీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది)
(ఎ) శ్రీకాకుళం
(బి) విజయనగరం
(సి) విశాఖపట్నం
(డి) పశ్చిమగోదావరి

2. 'గామా-కొవిడ్-వ్యాక్' (Gam-Covid-Vac) పేరుతో తొలి బ్యాచ్ కొవిడ్-19 టీకాను 'రష్యా' ప్రభుత్వం ఆ దేశ పౌరుల కోసం ఏ తేదీన విడుదల చేసింది ? (మాస్కో లోని 'గమాలేయా ఎడిమాలజీ, మైక్రోబయాలజీ పరిశోధన సంస్థ' అభివృద్ధి చేసిన 'స్పుత్నిక్-వి' టీకాను మూడోదశ ప్రయోగ పరీక్షలు పూర్తి కాకుండానే సాధారణ పౌరులకు అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది)
(ఎ) 2020 సెప్టెంబర్ 8
(బి) 2020 సెప్టెంబర్ 9
(సి) 2020 సెప్టెంబర్ 10
(డి) 2020 సెప్టెంబర్ 11

3. మన దేశానికి సంబంధించి 'కొవిడ్-19' వ్యాక్సిన్ నిపుణుల గ్రూపునకు అధ్యక్షత వహిస్తున్నది ?
(ఎ) అమితాబ్ కాంత్
(బి) రాజీవ్ కుమార్
(సి) వీకే పాల్
(డి) సునీల్ అరోరా

4. మూడు దశాబ్దాల చరిత్ర ఉన్న 'నాస్కామ్' (NASSCOM ⇒ National Association of Software and Service Companies) తొలి మహిళా అధ్యక్షురాలు ?
(ఎ) సంగీతా రెడ్డి
(బి) కిరణ్ మజుందార్ షా
(సి) దేవయాని ఘోష్
(డి) నీతా అంబాని



5. భారత్-చైనా సరిహద్దుల్లో తుపాకులు వాడకూడదనే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ చైనా సైన్యం (PLA ⇒ People's Liberation Army) ఇటీవల తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపిన తేదీ ? (చివరిసారిగా 1975లో 'పీఎల్ఏ' (PLA) కు చెందిన కొంతమంది 'తులుంగ్ లా' వద్ద భారత్ ఆధీనంలోని భూభాగంలోకి చొరబడి అక్కడ గస్తీ కాస్తున్న అస్సాం రైఫిల్స్ జవాన్లపై కాల్పులు జరిపి నలుగురు ప్రాణాలు కోల్పోవడానికి కారణమైంది)
(ఎ) 2020 సెప్టెంబర్ 4
(బి) 2020 సెప్టెంబర్ 5
(సి) 2020 సెప్టెంబర్ 6
(డి) 2020 సెప్టెంబర్ 7

6. 2020 సెప్టెంబర్ 8 న భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' ప్రారంభించిన "పత్రికా గేట్" (Patrika Gate) ఏ రాష్ట్రంలో ఉంది ? (ఈ సందర్భంగా 'పత్రికా గ్రూప్' చైర్మన్ గులాబ్ కొఠారి రచించిన 'సంవాద్ ఉపనిషత్' మరియు 'అక్షర యాత్ర' పుస్తకాలను కూడా ప్రధాని ఆవిష్కరించారు)
(ఎ) పంజాబ్
(బి) రాజస్థాన్
(సి) గుజరాత్
(డి) ఒడిశా

7. చేపల అమ్మకం, మార్కెటింగ్ పెంచే లక్ష్యంతో మత్స్యమిత్ర మహిళా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ (Revolving Fund) గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంత మొత్తం అందజేయనుంది ? (ఆర్నమెంటల్ ఫిషరీ, క్రాబ్ కల్చర్, ఆక్వా ఉత్పత్తుల అమ్మకాలతో పాటు గత ఆర్ధిక సంవత్సరంలో ఆడిట్ పూర్తి చేసుకున్న సంఘాలకు ఎంపికలో ప్రాధాన్యం ఇస్తారు)
(ఎ) రూ. 2,00,000
(బి) రూ. 1,50,000
(సి) రూ. 1,00,000
(డి) రూ. 50,000

8. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నూతన కమిషనర్ గా నియమితులైన వ్యక్తి ? (అతను మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు)
(ఎ) కె. విజయానంద్
(బి) సోమేశ్ కుమార్
(సి) సి. పార్థసారథి
(డి) వి. నాగిరెడ్డి

9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ ప్రస్తుత ఉపాధ్యక్షుడు ? (అధ్యక్షునిగా రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' వ్యవహరిస్తున్నారు)
(ఎ) ఎంవీఎస్ నాగిరెడ్డి
(బి) బొత్స సత్యనారాయణ
(సి) పీవీ రమేష్
(డి) చిరంజీవి చౌదరి



10. ఫ్రాన్స్ (France) దేశం నుంచి కొనుగోలు చేసిన 'రఫేల్' యుద్ధ విమానాలు ఏ తేదీన మన వాయుసేనలో లాంఛనంగా ప్రవేశించాయి ? ('రఫేల్' అంటే గాలి దుమారం లేదా జ్వాలా విస్ఫోటం అని అర్థం)
(ఎ) 2020 సెప్టెంబర్ 9
(బి) 2020 సెప్టెంబర్ 10
(సి) 2020 సెప్టెంబర్ 11
(డి) 2020 సెప్టెంబర్ 12

            
కీ (GK TEST-65 DATE : 2020 SEPTEMBER 12)
1) బి 2) ఎ 3) సి 4) సి 5) డి 6) బి 7) డి 8) సి 9) ఎ 10) బి
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి