ఈ బ్లాగును సెర్చ్ చేయండి

13, సెప్టెంబర్ 2020, ఆదివారం

YSR ASARA

 "వైఎస్సార్ ఆసరా" పథకం ("YSR ASARA" SCHEME)


పథకం ప్రారంభం :

  • 2020 సెప్టెంబర్ 11 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో "వైఎస్సార్ ఆసరా" పథకాన్ని మీట నొక్కి ప్రారంభించారు.

పథకం ఉద్దేశ్యం :

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 8.71 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని సుమారు 87 లక్షల మంది మహిళలకు వారి ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా 4 వాయిదాల్లో మొత్తం రూ. 27,168 కోట్లు జమ చేయనున్నారు.
  • తొలి విడతగా 2020 సెప్టెంబర్ 11న రూ. 6,792 కోట్లు మహిళల పొదుపు సంఘాలకు ఆసరాగా వారి సంఘం ఖాతాల్లో జమ చేశారు.

పథకానికి అర్హులు :

  • 'ఎన్నికల నాటికి (2019 ఏప్రిల్ 11) వాణిజ్య, సహకార బ్యాంకులలో నిల్వ అప్పు ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలు' ఈ పథకానికి అర్హులు.

లబ్ధిదారుల జాబితా :

  • 'సెర్ప్' (SERP ⇒ Society for Elimination of Rural Poverty), 'మెప్మా' (MEPMA ⇒ The Mission for Elimination of Poverty in Municipal Areas) వెబ్ సైట్లతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను ప్రదర్శిస్తారు.
  • ఒకవేళ అర్హత ఉండి పొరపాటున జాబితాలో పేరులేని సంఘాలుంటే, వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి వెంటనే పరిష్కరిస్తారు.


మహిళా సంక్షేమం, స్వావలంబన, సాధికారతల కోసం ... :

  • మహిళా సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ పథకాల (వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ సున్నా వడ్డీ, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఆసరా ... మొదలగునవి) ద్వారా అందే డబ్బులు ఏవిధంగా ఉపయోగించుకోవాలనే దానిమీద ఎటువంటి షరతులూ లేవు.
  • మహిళలు వారి వ్యక్తిగత, కుటుంబ అవసరాలకు, జీవనోపాధికి వాడుకోవచ్చు లేదా వ్యాపారాలకు ఉపయోగించుకోవచ్చు.
  • వ్యాపారాలకు ఉపయోగించుకుంటే ప్రభుత్వం ద్వారా మరింత ప్రోత్సాహం అందించి మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు, వ్యాపారవేత్తలుగా మారి స్వావలంబన సాధించేందుకు ప్రభుత్వం ఇప్పటికే P & G, ITC, HUL, AMUL, ALLANA లాంటి దిగ్గజ సంస్థలతో, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకుంది.
  • మహిళలకు ఇందుకు సంబంధించి ఏమైనా సలహాలు, సహకారం, సూచనలు కావాలంటే 'మెప్మా' (MEPMA), సెర్ప్ (SERP)' అధికారులను సంప్రదించవచ్చు.

టోల్ ఫ్రీ :

  • సూచనలు, సలహాలు, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1902 లో సంప్రదించవచ్చు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి