1. 'వైఎస్సార్ పల్నాడు కరవు నివారణ పథకం' లో భాగంగా అనుసంధానం చేయనున్న నదులు ?
(ఎ) గోదావరి - కృష్ణా
(బి) గోదావరి - పెన్నా
(సి) గోదావరి - కావేరి
(డి) వంశధార - నాగావళి
2. రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న వ్యవసాయ సంస్కరణల బిల్లులపై కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా 'భాజపా' (BJP) నేతృత్వంలోని 'జాతీయ ప్రజాస్వామ్య కూటమి' (NDA ⇒ National Democratic Alliance) నుంచి ఇటీవల వైదొలగిన పార్టీ ?
(ఎ) తెదేపా
(బి) ఆర్ ఎల్ ఎస్ పీ
(సి) శిరోమణి అకాలీదళ్
(డి) శివసేన
3. మనదేశంలో వివిధ రకాల క్షిపణుల సామర్థ్యాన్ని పరిశీలించే క్రమంలో ... ఆ అస్త్రాలకు లక్ష్యంగా ఉపయోగించే గగనతల వాహనం పేరు ? (ఈ వాహనాన్ని 'హీట్' (HEAT ⇒ High-speed Expendable Aerial Target) అని కూడా పిలుస్తారు. DRDO లోని 'ఏడీఈ' (ADE ⇒ Aeronautical Development Establishment) ఈ వాహనాన్ని రూపొందించింది)
(ఎ) అభ్యాస్
(బి) టార్గెట్
(సి) గోల్
(డి) రేంజ్
4. 'యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్' (UGC) ప్రకటన ప్రకారం, 2020-21 విద్యాసంవత్సరానికి 'అండర్ గ్రాడ్యుయేట్, పీజీ' తొలి సంవత్సర తరగతులు ఏ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి ? (కొత్త అకడమిక్ క్యాలెండర్ ప్రకారం వారానికి ఆరు రోజులు పాఠాలు బోధిస్తారు)
(ఎ) 2020 అక్టోబర్ 1
(బి) 2020 నవంబర్ 1
(సి) 2020 డిసెంబర్ 1
(డి) 2021 జనవరి 1
5. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కనిపించే 'డీఎంఈ' (DME ⇒ Diabetic Macular Edema) వ్యాధికి చికిత్సలో వినియోగించే "ఆఫ్లిబెర్సెప్ట్" (AFLIBERCEPT) ఇంజెక్షన్ ను 'ఐలియా' (EYLEA) బ్రాండ్ పేరుతో మనదేశంలో విక్రయించే సంస్థ ? (రక్తంలో చక్కెర శాతం ఎక్కువైనప్పుడు కంటిలో రెటీనా వెనుక ఉండే 'క్యాపిల్లరీస్' (Capillaries) చిట్లిపోయి వాటి నుంచి ద్రవాలు స్రవిస్తాయి. ఆ ద్రవాలు రెటీనా వెనుక ముద్దగా ఉండిపోయి, కంటి చూపునకు అడ్డం పడుతుంది. దీనివల్ల కంటి చూపు తగ్గిపోతుంది. ఇటువంటి వారికి కంట్లో "ఆఫ్లిబెర్సెప్ట్" (AFLIBERCEPT) ఇంజెక్షన్ ఇచ్చినపుడు ద్రవాల లీకేజీని అరికట్టడమే కాకుండా కొత్త రక్తనాళాలు పెరగకుండా ఈ ఇంజెక్షన్ నియంత్రిస్తుంది)
(ఎ) ర్యాన్ బ్యాక్సీ
(బి) ల్యుపిన్
(సి) బేయర్
(డి) క్యాడిలా
6. 'టైమ్' (TIME) మ్యాగజైన్ రూపొందించిన 'ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులు' జాబితాలో స్థానం దక్కించుకున్న భారతీయులలో పిన్న వయస్కుడు ?
(ఎ) డా. రవీంద్ర గుప్తా
(బి) సుందర్ పిచాయ్
(సి) ఆయుష్మాన్ ఖురానా
(డి) రణ్ వీర్ సింగ్
7. "ఆయుష్మాన్ భారత్" (PMJAY ⇒ Pradhan Mantri Jan Arogya Yojana) పథకం ప్రారంభ తేదీ ?
(ఎ) 2018 సెప్టెంబర్ 25
(బి) 2018 సెప్టెంబర్ 26
(సి) 2018 సెప్టెంబర్ 27
(డి) 2018 సెప్టెంబర్ 28
8. 'కరోనా' నివారణలో భాగంగా మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వాలు తమ 'రాష్ట్ర విపత్తు ఉపశమన నిధి' (SDRF ⇒ State Disaster Response Force) నుంచి ఖర్చు చేసే మొత్తం పరిమితిని 35% నుంచి ఎంత శాతానికి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది ?
(ఎ) 40%
(బి) 45%
(సి) 50%
(డి) 55%
9. 'గ్రాండ్ ఓల్డ్ లేడీ' గా కూడా పిలుచుకునే యుద్ధ నౌక "విరాట్" (INS VIRAAT) ను భారత నౌకాదళం నుంచి ఎప్పుడు ఉపసంహరించారు ? (30 ఏళ్లపాటు భారత నౌకాదళానికి సేవలు అందించి విశ్రాంతి తీసుకుంటున్న 'విరాట్' ను విడగొట్టి, తుక్కు కింద విక్రయించనున్నారు)
(ఎ) 2015 మార్చ్
(బి) 2016 మార్చ్
(సి) 2017 మార్చ్
(డి) 2018 మార్చ్
10. మనదేశంలో తొలిసారిగా "సీ ఆర్ ఐ ఎస్ పీ ఆర్" (CRISPR) సాంకేతికత ఆధారిత 'కొవిడ్-19' (COVID-19) పరీక్షా విధానాన్ని ప్రారంభించేందుకు 'డీసీజీఐ' (DCGI ⇒ Drug Controller General of India) నుంచి అనుమతులు పొందిన సంస్థ ? (ఇటువంటి పరీక్షా విధానం ప్రపంచంలోనే మొట్టమొదటిది)
(ఎ) అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్
(బి) జీఎంఆర్ గ్రూప్
(సి) బిర్లా గ్రూప్
(డి) టాటా గ్రూప్
కీ (GK TEST-71 DATE : 2020 SEPTEMBER 30)
1) బి 2) సి 3) ఎ 4) ఎ 5) సి 6) సి 7) ఎ 8) సి 9) సి 10) డి All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి