ఈ బ్లాగును సెర్చ్ చేయండి

18, సెప్టెంబర్ 2020, శుక్రవారం

JAGANANNA VIDYA DEEVENA

 జగనన్న విద్యా దీవెన (JAGANANNA VIDYA DEEVENA)


  • పాలిటెక్నిక్, ఐటిఐ, డిగ్రీ ఆపై కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, దివ్యాంగ, మైనార్టీ మరియు పేద విదార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం "జగనన్న విద్యా దీవెన" పథకం ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ (FEE REIMBURSEMENT) ను అందిస్తుంది.

పథకం లక్ష్యం :

  • పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా 'వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ' (YSR CONGRESS PARTY) ప్రవేశపెట్టిన పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ... ఈ "జగనన్న విద్యా దీవెన" (JAGANANNA VIDYA DEEVENA) పథకం.

పథకం ప్రారంభం :

  • 2020 ఏప్రిల్ 28న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో 'జగనన్న విద్యా దీవెన" పథకాన్ని ప్రారంభించారు.


పథకానికి అర్హులు :

  • విద్యార్థుల కుటుంబ సభ్యుల మొత్తం వార్షికాదాయం రూ. 2,50,000 లోపు ఉండాలి.
  • విద్యార్థుల కుటుంబ సభ్యులు అందరికీ కలిపి మొత్తమ్మీద 'పదెకరాల్లోపు మాగాణి లేదా 25 ఎకరాల్లోపు మెట్ట లేదా రెండూ కలిపి 25 ఎకరాల్లోపు' ఉండాలి.
  • పారిశుధ్య కార్మిక ఉద్యోగులున్న కుటుంబాల్లోని విద్యార్థులు.
  • విద్యార్థుల కుటుంబ సభ్యులకు ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్ ఉన్నా ఫర్వాలేదు కానీ కారు ఉండకూడదు.
  • విద్యార్థుల కుటుంబ సభ్యులకు పట్టణాల్లో స్థిరాస్తి ఉంటే, అది 1500 చదరపు అడుగులలోపు ఉండాలి.

గమనిక :

  • ఆదాయ పన్ను కట్టే కుటుంబ సభ్యులున్న విద్యార్థులు ఈ పథకానికి అనర్హులు.

పథకం ప్రయోజనాలు మరియు వివరాలు :

  • 12 లక్షల మంది తల్లులకు తద్వారా వారి పిల్లలకు లబ్ది.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అన్ని త్రైమాసికాలకు సంబంధించి చెల్లించవలసిన ఫీజులు బకాయిలు లేకుండా ఒకే ఆర్ధిక సంవత్సరంలో చెల్లింపు.
  • ఫీజు రీయింబర్స్ మెంట్ క్రింద మొత్తం రూ. 4,000 కోట్లకు పైగా విడుదల.
  • గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 1,880 కోట్ల బకాయిలు కూడా చెల్లింపు.
  • వచ్చే విద్యా సంవత్సరం నుండి ఫీజు రీయింబర్స్ మెంట్ మొత్తం, త్రైమాసికానికొకసారి చొప్పున నాలుగు త్రైమాసికాల్లో తల్లుల ఖాతాల్లో జమ ...
  • నాలుగు విడతల ఫీజు తల్లులు చెల్లించడం వల్ల కాలేజీల్లో జవాబుదారీతనం ... కాలేజీల స్థితిగతులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ...
  • 2018-19, 2019-2020 సంవత్సరములకు సంబంధించి, ఏ రకం ఫీజులైనా, ఎంత మొత్తమైనా కాలేజీలకు ఒకవేళ ముందే కట్టి ఉంటే ... కాలేజీలు తల్లిదండ్రులకు తిరిగి ఆ మొత్తం చెల్లించాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికే ఆ కాలేజీలకు ఆయా మొత్తాలను చెల్లించింది. 
  • ఫీజు రీయింబర్స్ మెంట్ లో ఏ రకమైన ఇబ్బందులున్నా టోల్ ఫ్రీ నంబర్ 1902 ను సంప్రదించగలరు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి