జగనన్న అమ్మ ఒడి (JAGANANNA AMMA VODI)
పథకం ప్రారంభం :
- 2020 జనవరి 9న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' చిత్తూరు లోని 'పీవీకేఎన్' డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ లో "జగనన్న అమ్మ ఒడి" పథకాన్ని ప్రారంభించారు.
పథకం వివరాలు :
- పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా రూ. 15,000 అందిస్తారు.
- ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు అన్ని ప్రభుత్వ, ప్రయివేట్, ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు అందజేస్తారు.
- దాదాపుగా 43 లక్షల మంది తల్లులకు తద్వారా దాదాపుగా 82 లక్షల మంది పిల్లలకు లబ్ధి కలుగుతుంది.
- ఈ పథకం అమలుకు రూ. 6,456 కోట్లు కేటాయించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి