జగనన్న వసతి దీవెన (JAGANANNA VASATHI DEEVENA)
- ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, దివ్యాంగ, మైనార్టీ మరియు పేద విదార్థులకు వసతి మరియు భోజన ఖర్చుల కొరకు ప్రతి ఏటా రూ. 20,000 మొత్తాన్ని రెండు దఫాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం "జగనన్న వసతి దీవెన" పథకం ద్వారా చెల్లిస్తుంది.
- మొదటి దఫా రూ. 10,000 జనవరి - ఫిబ్రవరి నెలల మధ్య, రెండవ దఫా రూ. 10,000 జూలై - ఆగస్ట్ నెలల మధ్య చెల్లిస్తారు.
- ఈ పథకం ద్వారా దాదాపు 12 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది.
పథకం ప్రారంభం :
- 2020 ఫిబ్రవరి 24న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' విజయనగరంలో 'జగనన్న వసతి దీవెన" పథకాన్ని ప్రారంభించారు.
పథకానికి అర్హులు :
- విద్యార్థుల కుటుంబ సభ్యుల మొత్తం వార్షికాదాయం రూ. 2,50,000 లోపు ఉండాలి.
- విద్యార్థుల కుటుంబ సభ్యులు అందరికీ కలిపి మొత్తమ్మీద 'పదెకరాల్లోపు మాగాణి లేదా 25 ఎకరాల్లోపు మెట్ట లేదా రెండూ కలిపి 25 ఎకరాల్లోపు' ఉండాలి.
- పారిశుధ్య కార్మిక ఉద్యోగులున్న కుటుంబాల్లోని విద్యార్థులు.
- విద్యార్థుల కుటుంబ సభ్యులకు ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్ ఉన్నా ఫర్వాలేదు కానీ కారు ఉండకూడదు.
- విద్యార్థుల కుటుంబ సభ్యులకు పట్టణాల్లో స్థిరాస్తి ఉంటే, అది 1500 చదరపు అడుగులలోపు ఉండాలి.
గమనిక :
- ఆదాయ పన్ను కట్టే కుటుంబ సభ్యులున్న విద్యార్థులు ఈ పథకానికి అనర్హులు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి