మన బడి "నాడు - నేడు" (MANA BADI "NAADU - NEDU")
పథకం ఉద్దేశ్యం :
- '45 వేల ప్రభుత్వ పాఠశాలలు, 471 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 151 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, 3287 ప్రభుత్వ హాస్టళ్ల రూపు రేఖలను మూడు దశలలో సమూలంగా మార్చడం' ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
ఈ పథకం ద్వారా ప్రతి పాఠశాలలో కనీసంగా ఏర్పాటు చేసే సదుపాయాలు :
- విద్యార్థులకు రక్షిత త్రాగు నీరు
- మరుగు దొడ్లు
- ఫర్నిచర్, ప్రహరీ గోడలు
- తరగతి గదులకు పెయింటింగ్, మరమ్మత్తులు, ఫినిషింగ్
- బ్లాక్ బోర్డ్స్
- ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు
పథకం ద్వారా కలిగే అదనపు ప్రయోజనాలు :
- ఆంగ్ల భాషా నైపుణ్యాలను పెంపొందించేలా ప్రతి పాఠశాలలో 'ఇంగ్లీష్ ల్యాబ్' (ENGLISH LAB)లను ఏర్పాటు చేస్తారు.
- పాఠశాలలు తెరిచే నాటికి 3 జతల యూనిఫామ్ లు, పుస్తకాలు, నోట్ పుస్తకాలు, జత బూట్లు, సాక్స్, బెల్ట్, బ్యాగ్ లతో కూడిన కిట్ ను విద్యార్థులకు అందిస్తారు.
- పాఠశాలల్లో బోధనా ప్రమాణాలు పెంచడంతో పాటు టీచర్లకు అవసరమైన శిక్షణ, విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు ఏర్పాటు చేస్తారు.
బడ్జెట్ :
- ఈ పథకం అమలుకు రూ. 14 వేల కోట్లు కేటాయించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి