ఈ బ్లాగును సెర్చ్ చేయండి

30, సెప్టెంబర్ 2020, బుధవారం

GK TEST-72

1. 'కొవిడ్-19' (COVID-19 ⇒ Corona Virus Disease-2019) వ్యాధి కారక వైరస్ ?
(ఎ) సార్స్ - కొవ్ - 1 (SARS CoV - 1)
(బి) సార్స్ - కొవ్ - 2 (SARS CoV - 2)
(సి) హెచ్ 1 ఎన్ 1 (H1N1)
(డి) హంటా వైరస్ (Hanta Virus)

2. 'కరోనా' వైరస్ వ్యాప్తి ఆందోళనల నేపథ్యంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 2020 సెప్టెంబర్ 23న నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాలలో లోక్ సభ స్పీకర్ 'ఓం బిర్లా' ప్రకటన ప్రకారం "లోక్ సభ ఉత్పాదకత" ? 
(ఎ) 167%
(బి) 168%
(సి) 169%
(డి) 170%

3. కేంద్ర మంత్రి పదవిని నిర్వర్తిస్తూ 'కొవిడ్-19' వ్యాధితో మరణించిన "సురేష్ అంగడి" స్వరాష్ట్రం ? 
(ఎ) తమిళనాడు
(బి) కేరళ
(సి) కర్ణాటక
(డి) మహారాష్ట్ర



4. నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ చైర్మన్ ? 
(ఎ) శ్రీరామ్ వెదిరె
(బి) సుబ్రహ్మణ్యం శ్రీరామ్
(సి) చంద్రశేఖర్ అయ్యర్
(డి) విపిన్ నాయర్

5. మనదేశంలో 'ఫిట్ ఇండియా' (FIT INDIA) ఉద్యమం మొదలైన తేదీ ? 
(ఎ) 2018 సెప్టెంబర్ 24 
(బి) 2017 సెప్టెంబర్ 24 
(సి) 2020 సెప్టెంబర్ 24 
(డి) 2019 సెప్టెంబర్ 24

6. ప్రస్తుత 'కరోనా' నేపథ్యంలో ఆదాయం పడిపోయి ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాలకు ఆర్ధిక వెసులుబాటు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం "ఆత్మ నిర్భర్ భారత్" ప్యాకేజీ కింద, ప్రస్తుతం బహిరంగ మార్కెట్ల నుంచి 'జీ ఎస్ డీ పీ' (GSDP) లో 3% వరకు రుణాలు తీసుకోవడానికి ఉన్న పరిమితిని ఎంత శాతానికి పెంచింది ?
(ఎ) 3.5%
(బి) 4.0%
(సి) 4.5% 
(డి) 5%



7. మనదేశంలో 'తొలి మహిళా రఫెల్ ఫైటర్ పైలట్' (First Woman Pilot to fly Rafale) గా చరిత్ర సృష్టించబోతున్న ఫ్లైట్ లెఫ్టినెంట్ ?
(ఎ) అవని చతుర్వేది
(బి) శివాంగీ సింగ్
(సి) భావనా కాంత్
(డి) గుంజన్ సక్సేనా

8. విమానం లోపల (In-flight) మొబైల్ సేవలను మొదలు పెట్టిన తొలి భారత మొబైల్ సేవల కంపెనీ ? (టాటా గ్రూప్ నకు చెందిన 'నెల్కో' (NELCO) - అమెరికా తర్వాత ఈ సేవలందిస్తున్న భారత టెలికాం కంపెనీ కూడా ఇదే. అంతర్జాతీయంగా 22 మార్గాల్లో మొబైల్ సేవలు అందించడం కోసం ఈ కంపెనీ 'ఏరో మొబైల్' (AeroMobile) - యూకే తో భాగస్వామ్యం కుదుర్చుకుంది)  
(ఎ) రిలయన్స్ జియో
(బి) ఎయిర్ టెల్
(సి) వోడాఫోన్ ఐడియా
(డి) టాటా డొకోమో

9. 2020 సెప్టెంబర్ 25 నుంచి అమల్లోకి వచ్చిన "జాతీయ వైద్య కమిషన్" (NMC ⇒ National Medical Council) చైర్మన్ ? (మనదేశంలోని వైద్య విద్యను ఇప్పటివరకూ పర్యవేక్షిస్తున్న 'భారత వైద్య మండలి' (MCI ⇒ Medical Council of India) స్థానంలో 'ఎన్ ఎం సీ' (NMC) అమల్లోకి వచ్చింది)
(ఎ) డాక్టర్ అరుణ వి. వాణీకర్
(బి) డాక్టర్ సురేష్ చంద్ర శర్మ
(సి) డాక్టర్ ఎం.కె.రమేష్
(డి) డాక్టర్ అచల్ గులాటి



10. 'కరోనా' వైరస్ వ్యాధి (COVID-19) కి ముక్కు ద్వారా ఇచ్చే సింగిల్ డోస్ టీకా తయారీ కోసం 'భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్' ఏ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది ? (ఈ ఒప్పందం ప్రకారం అమెరికా, జపాన్, ఐరోపా దేశాలను మినహాయించి మిగిలిన దేశాల్లో ఈ టీకాను విక్రయించే హక్కులు 'భారత్ బయోటెక్' కు ఉంటాయి) 
(ఎ) జార్జియా టెక్ యూనివర్సిటీ
(బి) వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్
(సి) ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ 
(డి) క్వీన్ మేరీ యూనివర్సిటీ             

కీ (GK TEST-72 DATE : 2020 SEPTEMBER 30)
1) బి 2) ఎ 3) సి 4) ఎ 5) డి 6) డి 7) బి 8) ఎ 9) బి 10) బి 

All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి