1. 'యుఎస్ ఓపెన్' - 2020 (US OPEN - 2020) టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ? ('యుఎస్ ఓపెన్' ఫైనల్లో తొలి రెండు సెట్లు కోల్పోయి కూడా ఓ ఆటగాడు విజేతగా నిలవడం 71 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1949లో గొంజాలెజ్ (Gonzalez) ఇలాగే టైటిల్ నెగ్గాడు)
(ఎ) డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)
(బి) డానియెల్ మెద్వేదేవ్ (రష్యా)
(సి) అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)
(డి) పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్)
2. 'యుఎస్ ఓపెన్' - 2020 (US OPEN - 2020) టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ టైటిల్ విజేత ? (విజేత ఈ టోర్నీలో మ్యాచ్ కు ఒకటి చొప్పున అమెరికాలో జాతి వివక్ష కారణంగా మరణించినవారి పేర్లుండే ఏడు మాస్కులు ధరించి, తద్వారా జాతి వివక్ష గురించి అందరూ చర్చించుకునేలా చేసింది)
(ఎ) విక్టోరియా అజరెంక (బెలారస్)
(బి) జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా)
(సి) సెరెనా విలియమ్స్ (అమెరికా)
(డి) నవోమి ఒసాకా (జపాన్)
3. మహిళా టెన్నిస్ లో ఆల్ టైమ్ అత్యధిక టైటిళ్ల (24) రికార్డ్ ప్రస్తుతం ఎవరి పేరుమీద కొనసాగుతోంది ?
(ఎ) స్టెఫీగ్రాఫ్
(బి) మార్గరెట్ కోర్ట్
(సి) సెరెనా విలియమ్స్
(డి) మార్టీనా నవ్రతిలోవా
4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'ఇసుకను ప్రకటించిన ధరలకు మించి అమ్మినా, అక్రమ రవాణా చేసినా (నల్ల బజారుకు తరలించినా), పరిమితికి మించి కలిగివున్నా, అనధికారికంగా అమ్మినా విధించే జరిమానా మరియు జైలు శిక్ష ?
(ఎ) రూ. 1,00,000 వరకు జరిమానా మరియు ఒక సంవత్సరం జైలు శిక్ష
(బి) రూ. 1,50,000 వరకు జరిమానా మరియు ఒకటిన్నర సంవత్సరాల జైలు శిక్ష
(సి) రూ. 2,00,000 వరకు జరిమానా మరియు రెండు సంవత్సరాల జైలు శిక్ష
(డి) రూ. 2,50,000 వరకు జరిమానా మరియు రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష
5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలలో ఎన్ని ఇళ్లకు ఒక వాలంటీర్ (VOLUNTEER) ను నియమించడం జరిగింది ?
(ఎ) ప్రతి 50 ఇళ్లకు
(బి) 50 నుండి 100 ఇళ్లకు
(సి) ప్రతి 100 ఇళ్లకు
(డి) 50 నుండి 75 ఇళ్లకు
6. ప్రభుత్వ అధికారిక ప్రకటన ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా పూర్తి స్థాయి సేవలు ఏ తేదీ నుండి లభ్యం అవుతున్నాయి ?
(ఎ) 2019 అక్టోబర్ 2
(బి) 2020 జనవరి 1
(సి) 2020 జనవరి 26
(డి) 2020 ఫిబ్రవరి 1
7. అమెరికాలో 'టిక్ టాక్' (TikTok) కార్యకలాపాల కోసం టెక్నాలజీ భాగస్వామిగా ఎంపికైన సంస్థ ? ('టిక్ టాక్' మాతృ సంస్థ పేరు "బైట్ డాన్స్" (ByteDance))
(ఎ) మైక్రోసాఫ్ట్
(బి) ఒరాకిల్
(సి) గూగుల్
(డి) ఐబీఎం
8. 2020 సెప్టెంబర్ 14న జరిగిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో మూజువాణి ఓటింగ్ ద్వారా 'ఎన్డీయే' (NDA) అభ్యర్థిగా పోటీ చేసిన 'హరివంశ్ నారాయణ్ సింగ్' విపక్షాల తరపున బరిలో నిలిచిన 'మనోజ్ ఝా' పై విజయం సాధించారు. హరివంశ్ నారాయణ్ సింగ్ ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి ?
(ఎ) రాష్ట్రీయ జనతాదళ్ (RJD)
(బి) లోక్ జనశక్తి పార్టీ (LJP)
(సి) జనతాదళ్ యునైటెడ్ (JDU)
(డి) రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (RLSP)
9. అనేక అరుదైన దృశ్యాలతో కూడిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఏ తేదీన ప్రారంభమయ్యాయి ? ('కరోనా' నేపథ్యంలో రాజ్యసభ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, లోక్ సభ మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు నిర్వహించనున్నారు)
(ఎ) 2020 సెప్టెంబర్ 11
(బి) 2020 సెప్టెంబర్ 12
(సి) 2020 సెప్టెంబర్ 13
(డి) 2020 సెప్టెంబర్ 14
10. రూ. 1,08,000 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన దేశంలోనే తొలి బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ ?
(ఎ) ముంబయి - నాగ్ పూర్ (753 కి.మీ.)
(బి) ముంబయి - అహ్మదాబాద్ (508.17 కి.మీ.)
(సి) దిల్లీ - అమృత్ సర్ (459 కి.మీ.)
(డి) చెన్నై - మైసూరు (435 కి.మీ.)
కీ (GK TEST-66 DATE : 2020 SEPTEMBER 16)
1) ఎ 2) డి 3) బి 4) సి 5) బి 6) సి 7) బి 8) సి 9) డి 10) బి
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి