ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, సెప్టెంబర్ 2020, బుధవారం

GK TEST-62

1. 'జాతీయ డిజిటల్ ఆరోగ్య పథకం' (NDHM) ను ప్రస్తుతం ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టారు ?
(ఎ) 2
(బి) 4
(సి) 6
(డి) 8

2. 'జాతీయ డిజిటల్ ఆరోగ్య పథకం' (NDHM) లో భాగంగా ప్రతి భారతీయ పౌరుడికీ ఎన్ని అంకెల జాతీయ డిజిటల్ ఆరోగ్య గుర్తింపు సంఖ్య (ID) ను అందించనున్నారు ?
(ఎ) 10
(బి) 12
(సి) 14
(డి) 16

3. ఏ తేదీలోపు దేశంలోని విశ్వవిద్యాలయాలన్నీ తుది సంవత్సరం పరీక్షలు ముగించాలంటూ 2020 జూలై 6 న 'యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్' (UGC) మార్గదర్శకాలను జారీ చేసింది ? (విపత్తు నిర్వహణ చట్టం కింద పరీక్షలను రాష్ట్రాలు వాయిదా వేసుకోవచ్చు. కానీ 'యూజీసీ' (UGC) ని సంప్రదించి కొత్త తేదీలను నిర్ణయించుకోవాలి అని సుప్రీంకోర్ట్ తెలియజేసింది)
(ఎ) 2020 సెప్టెంబర్ 30
(బి) 2020 అక్టోబర్ 31
(సి) 2020 నవంబర్ 30
(డి) 2020 డిసెంబర్ 31

4. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయినప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేందుకు 'ఎగిరే కార్లు' ను తయారుచేస్తున్న "స్కై డ్రైవ్" (SKY DRIVE) సంస్థది ఏ దేశం ? (2023 నాటికి ఇది వాస్తవరూపం దాల్చనుంది)
(ఎ) దక్షిణ కొరియా
(బి) చైనా
(సి) జపాన్
(డి) అమెరికా

5. 'వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకం' ను ఎప్పటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' పేర్కొన్నారు ? (2020 ఆగస్ట్ 28 న సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో లింక్ ద్వారా శంకుస్థాపన చేసారు. కృష్ణా జిల్లా "వేదాద్రి" లో రూ. 490 కోట్ల వ్యయంతో ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు)
(ఎ) 2021 జనవరి
(బి) 2021 ఫిబ్రవరి
(సి) 2021 మార్చి
(డి) 2021 ఏప్రిల్



6. మహమ్మద్ ప్రవక్త మనవడు 'హజ్రత్ ఇమామ్ హుస్సేన్' బలిదానాన్ని గుర్తుచేసే పవిత్ర కార్యక్రమం ?
(ఎ) బక్రీద్
(బి) మొహర్రం
(సి) రంజాన్
(డి) ఈద్-ఉల్-ఫితర్

7. జాతీయ వన్యమొక్కల పరిశోధనా కేంద్రం ఏ నగరంలో ఉంది ?
(ఎ) తిరువనంతపురం
(బి) కోచి
(సి) కోజికోడ్
(డి) కొల్లామ్

8. ఏ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 200 'కొవిడ్' ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు ?
(ఎ) 2020 మే 1
(బి) 2020 జూన్ 1
(సి) 2020 జూలై 1
(డి) 2020 ఆగస్ట్ 1

9. ఉత్తరప్రదేశ్ లోని 'ఝాన్సీ'లో నూతనంగా నిర్మించిన రాణీ లక్ష్మీబాయి వ్యవసాయ విశ్వవిద్యాలయ భవనాన్ని భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' ప్రారంభించిన తేదీ ?
(ఎ) 2020 ఆగస్ట్ 27
(బి) 2020 ఆగస్ట్ 28
(సి) 2020 ఆగస్ట్ 29
(డి) 2020 ఆగస్ట్ 30

10. ఈ ఏడాది 'ద్రోణాచార్య జీవితకాల పురస్కారం' నకు ఎంపికై 2020 ఆగస్ట్ 28 న గుండెపోటుతో మరణించిన వెటరన్ కోచ్ 'పురుషోత్తం రాయ్' ఏ క్రీడావిభాగానికి చెందినవారు ?
(ఎ) బాక్సింగ్
(బి) అథ్లెటిక్స్
(సి) రెజ్లింగ్
(డి) టేబుల్ టెన్నిస్

         
కీ (GK TEST-62 DATE : 2020 SEPTEMBER 2)
1) సి 2) సి 3) ఎ 4) సి 5) బి 6) బి 7) సి 8) బి 9) సి 10) బి 
All the best by www.gkbitsintelugu.blogspot.com 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి