అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన (ATAL BIMIT VYAKTI KALYAN YOJANA)
- 'కరోనా' కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన 'ఈ ఎస్ ఐ' (ESI ⇒ Employees' State Insurance) చందాదారులకు నిరుద్యోగ భృతి కల్పించడానికి కేంద్ర కార్మిక శాఖ 'అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన' (ABVKY) పథకాన్ని ప్రకటించింది.
పథకం కాలపరిమితి :
- 2020 జూలై 1వ తేదీ నుండి 2021 జూన్ 30వ తేదీ వరకు ఈ పథకం (ABVKY) కొనసాగుతుంది.
పథకం - కొన్ని విశేషతలు :
- చందాదారులకు జీతంలో 50% సొమ్మును భృతిగా చెల్లిస్తారు. గతంలో వేతనంలో 25% నిరుద్యోగ భృతి కింద లభించగా, ప్రస్తుతం దాన్ని 50 శాతానికి పెంచారు.
- ఉద్యోగాలు కోల్పోయిన కార్మికులు సమీపంలోని 'ఈ ఎస్ ఐ' (ESI) కార్యాలయంలో సంప్రదించాలి.
- స్వయంగా గానీ, ఆన్ లైన్ ద్వారా గానీ, పోస్ట్ లో గానీ నిరుద్యోగ భృతికి సంబంధించిన దరఖాస్తును పంపించవచ్చు.
- దరఖాస్తుతో 'ఆధార్ కాపీ, బ్యాంక్ ఖాతా వివరాలు, అఫిడవిట్' లను సమర్పించాలి.
- ఇంతకుముందు సంస్థ యజమాని ద్వారా మాత్రమే దరఖాస్తులు పంపించాల్సి ఉండేది. కానీ ఇప్పుడు స్వయంగా కార్మికులే సమర్పించుకునే వీలు కలిగించారు.
- నిరుద్యోగ భృతి తాలూకూ సొమ్ము నేరుగా కార్మికుల బ్యాంక్ ఖాతాలోనే పడుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి