ఈ బ్లాగును సెర్చ్ చేయండి

26, అక్టోబర్ 2020, సోమవారం

YSR BIMA

 వైఎస్సార్ బీమా (YSR BIMA)


  • కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ఆలంబనగా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ పథకమే "వైఎస్సార్ బీమా" (YSR BIMA).
  • గతంలో ఉన్నట్లుగా ప్రతి పాలసీకి PMJJBY (Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana), PMSBY (Pradhan Mantri Suraksha Bima Yojana) కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 50 శాతం వాటా ఇప్పుడు లేనప్పటికీ, మానవతా దృక్పథంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా పూర్తి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ ఉచిత బీమా అమలు చేస్తుంది.

పథకం ప్రారంభం :

  • 2020 అక్టోబర్ 21న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో "వైఎస్సార్ బీమా" (YSR BIMA) పథకాన్ని ప్రారంభించారు.



పథకం - ప్రయోజనాలు :

  1. బియ్యం కార్డు అర్హత ఉన్న 1.41 కోట్ల (1,41,00,000) కుటుంబాలకు ఉచిత బీమా రక్షణ లభిస్తుంది.
  2. 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు 'సహజ మరణం' చెందితే "వైఎస్సార్ బీమా" (YSR BIMA) ద్వారా రూ. 2,00,000 సహాయం అందుతుంది.
  3. 18 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు 'ప్రమాదం వల్ల మరణం లేదా శాశ్వత అంగ వైకల్యం' చెందితే "వైఎస్సార్ బీమా" (YSR BIMA) ద్వారా రూ. 5,00,000 సహాయం అందుతుంది.
  4. 51 నుంచి 70 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు 'ప్రమాదం వల్ల మరణం లేదా శాశ్వత అంగ వైకల్యం' చెందితే "వైఎస్సార్ బీమా" (YSR BIMA) ద్వారా రూ. 3,00,000 సహాయం అందుతుంది.
  5. 18 నుంచి 70 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు 'పాక్షిక శాశ్వత అంగ వైకల్యం' చెందితే "వైఎస్సార్ బీమా" (YSR BIMA) ద్వారా రూ. 1,50,000 సహాయం అందుతుంది.



పథకానికి అర్హులు, లబ్ధిదారుల గుర్తింపు, క్లెయిమ్ చెల్లింపు :

  • బియ్యం కార్డు పొందేందుకు అర్హత ఉన్న కుటుంబాలన్నీ 'వైఎస్సార్ బీమా' (YSR BIMA) పథకానికి అర్హులు అవుతారు.
  • బియ్యం కార్డు లేనివారు, కార్డు కొరకు దరఖాస్తు చేసి ఇంకా రానివారు, వారి పేర్లను 'వైఎస్సార్ బీమా' (YSR BIMA)లో నమోదు చేసుకోవడం కోసం గ్రామ/వార్డు వాలంటీర్లను సంప్రదించాలి.
  • వాలంటీర్లు 'డోర్ టు డోర్ సర్వే' (Door-To-Door Survey) ద్వారా అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తిస్తారు.
  • లబ్ధిదారులకు బ్యాంకు ఖాతా ఏర్పాటు నుండి బీమా నమోదు, బీమా ప్రాసెసింగ్, క్లెయిమ్ చెల్లింపు వరకు సహాయ కేంద్రాలుగా గ్రామ/వార్డు సచివాలయాలు ... సహాయం కోసం అక్కడ ఉన్న 'వెల్ఫేర్ అసిస్టెంట్ / వాలంటీర్' (Welfare Assistant / Volunteer) లను సంప్రదించాలి.
  • ఒక వారంలో వాలంటీర్ ద్వారా 'వైఎస్సార్ బీమా' (YSR BIMA) కార్డు అందజేయబడుతుంది.
  • క్లెయిమ్ చేసిన 15 రోజుల్లో బీమా చెల్లింపు జరుగుతుంది.
  • బీమా మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది.

పథకం - బడ్జెట్ :

  • 'వైఎస్సార్ బీమా' (YSR BIMA) పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 510 కోట్లు ఖర్చు చేయనుంది.

పథకం - టోల్ ఫ్రీ నంబర్ :

  • బీమా నమోదు, క్లెయిమ్ చెల్లింపుల్లో ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్ (Toll free number) 155214 లో సంప్రదించవలెను.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి