1. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (CIC ⇒ Chief Information Commissioner) గా 2020 నవంబర్ 7న బాధ్యతలు చేపట్టినది ? (ఈ పదవిలో మూడేళ్లు ఉంటారు)
All the best by www.gkbitsintelugu.blogspot.com
(ఎ) ఉదయ్ మహుర్కర్
(బి) హీరాలాల్ సమారియా
(సి) యశ్వర్ధన్ కుమార్ సిన్హా
(డి) సరోజ్ పున్హానీ
2. కొవిడ్ (COVID) సంక్షోభ సమయంలో పాటించిన బాధ్యతాయుతమైన పాత్రకుగాను ఏ రాష్ట్ర పర్యాటక రంగానికి అత్యంత ప్రశంసాత్మక అవార్డును 'లండన్ వరల్డ్ ట్రావెల్ మార్ట్' (London World Travel Mart) ప్రకటించింది ?
(ఎ) ఆంధ్రప్రదేశ్
(బి) కేరళ
(సి) తమిళనాడు
(డి) హిమాచల్ ప్రదేశ్
3. జాతీయస్థాయిలోనే తొలి తేలియాడే సౌర ప్రాజెక్ట్ ను శ్రీకారం చుట్టిన నగరం ?
(ఎ) విశాఖపట్నం
(బి) విజయవాడ
(సి) కాకినాడ
(డి) అనంతపురం
4. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి కుదిరిన "ప్యారిస్ ఒప్పందం" (The Paris Agreement) నుంచి అమెరికా లాంఛనంగా వైదొలగిన తేదీ ? (భూతాపాన్ని తగ్గించే ఒప్పందం నుంచి వైదొలగిన ఏకైక దేశంగా 'అమెరికా' నిలిచిపోనుంది)
(ఎ) 2020 నవంబర్ 1
(బి) 2020 నవంబర్ 2
(సి) 2020 నవంబర్ 3
(డి) 2020 నవంబర్ 4
5. ప్రజాప్రతినిధుల కేసుల విచారణ కోసం ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై అభ్యంతరాలను వ్యక్తం చేసిన ఏకైక హైకోర్టు ? (ప్రత్యేక కోర్టుల అంశంలో సమాధానమిచ్చేందుకు ఈ హైకోర్టుకు రెండు వారాల గడువు ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది)
(ఎ) మద్రాస్ హైకోర్టు
(బి) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
(సి) తెలంగాణ హైకోర్టు
(డి) మహారాష్ట్ర హైకోర్టు
6. "రజనీష్ వర్సెస్ నేహ" (RAJNESH Vs NEHA) కేసులో 'జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి' లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2020 నవంబర్ 4న వెలువరించిన తీర్పు ప్రకారం, దాంపత్య జీవితం నుంచి విడిపోయిన భార్య (బాధితురాలు) పోషణ కోసం జీవనభృతి మంజూరు చేసే విషయంలో న్యాయస్థానాలు ఏ రోజును పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది ?
(ఎ) పోషణ కోసం దరఖాస్తు చేసుకున్న రోజు
(బి) దాంపత్య జీవితం నుంచి విడిపోయిన రోజు
(సి) న్యాయస్థానం తీర్పు వెలువరించిన రోజు
(డి) దాంపత్య జీవితం నుంచి విడిపోయిన రోజు నుంచి సంవత్సరం పూర్తి అయిన రోజు
7. ప్రముఖ సినీ దర్శకురాలు మీరానాయర్ కుమారుడు (ఇండియన్-ఉగాండియన్) 'జోహ్రాన్ క్వామే మమ్ దాని' ఇటీవల అమెరికాలో జరిగిన ఎన్నికల్లో ఏ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు ?
(ఎ) టెక్సాస్
(బి) వర్జీనియా
(సి) న్యూయార్క్
(డి) మిషిగన్
8. 2020 నవంబర్ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోలింగ్ నమోదైన శాతం ? (గత 120 ఏళ్లలో ఇదే అత్యధికం. చివరగా 1900వ సంవత్సరంలో అమెరికాలో 70 శాతానికి పైగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు)
(ఎ) 64.9 %
(బి) 65.9 %
(సి) 66.9 %
(డి) 67.9 %
9. 'సమోసా కాకస్' (Samosa Caucus) గా వ్యవహరించే భారతీయ అమెరికన్ లలో చేరిన తెలుగు మహిళ ? (ఈమె 'అరిజోనా' రాష్ట్రంలోని ఆరో కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు)
(ఎ) డాక్టర్ హిరల్ తిపిర్నేని
(బి) ప్రమీలా జయపాల్
(సి) డాక్టర్ అమీ బేరా
(డి) జెనిఫర్ రాజకుమార్
10. తుంగభద్ర నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రాంతం ?
(ఎ) మేళిగనూరు
(బి) సంగమేశ్వరం
(సి) సిద్ధేశ్వరం
(డి) నాగాయలంక
కీ (GK TEST-77 DATE : 2020 NOVEMBER 7)
1) సి 2) బి 3) ఎ 4) డి 5) ఎ 6) ఎ 7) సి 8) సి 9) ఎ 10) ఎ All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి