1. 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' (SBI) నూతన చైర్మన్ ? (2020 అక్టోబర్ 7న నూతన చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు)
All the best by www.gkbitsintelugu.blogspot.com
(ఎ) ఎం.రాజేశ్వరరావు
(బి) దినేష్ కుమార్ ఖారా
(సి) శశాంక్ భీడే
(డి) ఆశీమా గోయల్
2. ఐపీల్ ఫ్రాంచైజీతో ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా తొలి క్రికెటర్ గా నిలిచిన "అలీఖాన్" (ALI KHAN) ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ?
(ఎ) కోల్ కతా నైట్ రైడర్స్
(బి) సన్ రైజర్స్ హైదరాబాద్
(సి) ముంబయి ఇండియన్స్
(డి) రాజస్థాన్ రాయల్స్
3. భారతీయ యాప్ డెవలపర్లకు (Indian App Developers) పూర్తి స్వేచ్ఛనిచ్చే లక్ష్యంతో 'ఆండ్రాయిడ్ మినీ యాప్ స్టోర్' (Android Mini App Store) ను ప్రారంభించిన సంస్థ ?
(ఎ) ఫోన్ పే
(బి) టెలిగ్రామ్
(సి) మొబైల్ పే
(డి) పేటీఎం
4. 2020 అక్టోబర్ 8న మార్కెట్ విలువపరంగా ప్రపంచంలోనే అత్యంత విలువైన ఐటీ సేవల సంస్థగా అవతరించిన కంపెనీ ?
(ఎ) టీసీఎస్
(బి) యాక్సెంచర్
(సి) ఇన్ఫోసిస్
(డి) మైక్రోసాఫ్ట్
5. ప్రతి సంవత్సరం 'ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు' (WORLD SPACE WEEK CELEBRATIONS) జరిగే తేదీలు ? ("ఉపగ్రహాల జీవితకాలం పొడిగింపు" (Satellites Improve Life) అనే నినాదంతో ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవ సంస్థ శ్రీకారం చుట్టింది)
(ఎ) అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 7 వరకు
(బి) అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 8 వరకు
(సి) అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 9 వరకు
(డి) అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10 వరకు
6. ఫ్రెంచ్ ఓపెన్-2020 (2020 FRENCH OPEN) పురుషుల టెన్నిస్ సింగిల్స్ విజేత ?
(ఎ) నొవాక్ జకోవిచ్ (సెర్బియా)
(బి) రఫెల్ నాదల్ (స్పెయిన్)
(సి) డీగో ష్వార్జ్ మన్ (అర్జెంటీనా)
(డి) రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్)
7. ఫ్రెంచ్ ఓపెన్-2020 (2020 FRENCH OPEN) మహిళల టెన్నిస్ సింగిల్స్ విజేత ?
(ఎ) ఇగా స్వైటక్ (పోలెండ్)
(బి) నదియా పొదరోస్కా (అర్జెంటీనా)
(సి) సోఫియా కెనిన్ (అమెరికా)
(డి) పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)
8. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో సెమీస్ చేరిన తొలి క్వాలిఫైయర్ (QUALIFIER) గా చరిత్ర సృష్టించిన టెన్నిస్ క్రీడాకారిణి ?
(ఎ) ఇగా స్వైటక్ (పోలెండ్)
(బి) నదియా పొదరోస్కా (అర్జెంటీనా)
(సి) సోఫియా కెనిన్ (అమెరికా)
(డి) పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)
9. ఒకసారి అమెరికా అధ్యక్షుడిగా పదవీకాలం పూర్తయిన తరువాత రెండోసారి ఆ పదవికి పోటీచేసే ప్రయత్నంలో ఓడిపోయిన అధ్యక్షులలో 'డొనాల్డ్ ట్రంప్' (DONALD TRUMP) ఎన్నవ వ్యక్తి ? (ఇంతకముందు 1992లో 'జార్జ్ హెచ్.డబ్ల్యు.బుష్' (GEORGE H.W. BUSH) అధ్యక్ష పదవిలో ఉండగా రెండోసారి ఆ పదవికి పోటీచేసి 'బిల్ క్లింటన్' (BILL CLINTON) చేతిలో పరాజయం చవిచూశారు)
(ఎ) 10
(బి) 11
(సి) 12
(డి) 13
10. 'శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్' (SVBC) నూతన చైర్మన్ గా 2020 నవంబర్ 7న బాధ్యతలు స్వీకరించినది ?
(ఎ) డాక్టర్ వి.బి.సాయికృష్ణ యాచేంద్ర
(బి) డాక్టర్ సురేష్ చంద్ర శర్మ
(సి) సుధా కొంగర
(డి) ఎస్.వి.సుబ్బారెడ్డి
కీ (GK TEST-80 DATE : 2020 NOVEMBER 21)
1) బి 2) ఎ 3) డి 4) ఎ 5) డి 6) బి 7) ఎ 8) బి 9) బి 10) ఎ All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి