వైఎస్సార్ జగనన్న శాశ్వత భూమి హక్కు - భూమి రక్ష
- వ్యవసాయ భూముల వివాదాలకు తెరదించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవిన్యూ శాఖ 'భూముల రీసర్వే' ప్రాజెక్టును చేపట్టింది. దీనికి "వైఎస్సార్ జగనన్న శాశ్వత భూమి హక్కు - భూమి రక్ష" అనే పేరును ఖరారు చేశారు.
- రికార్డుల్లో ఉన్న భూ విస్తీర్ణాన్ని ఈ వాస్తవ సర్వేతో సరిపోల్చి సరిదిద్దుతారు.
- "వైఎస్సార్ జగనన్న శాశ్వత భూమి హక్కు - భూమి రక్ష" రీ సర్వేకు పైలట్ ప్రాజెక్ట్ (Pilot Project) గా కృష్ణా జిల్లాలోని 'జగ్గయ్యపేట' మండలాన్ని ఎంపిక చేశారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని మండలాలకు 2021 జనవరి నుంచి 'వైఎస్సార్ జగనన్న శాశ్వత భూమి హక్కు - భూమి రక్ష' ప్రాజెక్ట్ ను అమలు చేయనున్నారు.
- 2023 జూన్ నాటికి సర్వే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
- 'వైఎస్సార్ జగనన్న శాశ్వత భూమి హక్కు - భూమి రక్ష' ప్రాజెక్ట్ లో భూములను "కార్స్" (CORS) మరియు "డ్రోన్" (DRONE) విధానాల్లో సర్వే చేస్తారు.
కార్స్ (CORS ⇒ Continuously Operating Reference Station) :
- ఈ విధానంలో 'రోవర్' (Rover) ను వాడతారు.
- 'కార్స్' (CORS) పరిజ్ఞానంతో ఉపగ్రహాలకు అనుసంధానించి 'డీజీపీఎస్' (DGPS ⇒ Difference Global Positioning System) ద్వారా సర్వే చేస్తారు.
- క్షేతస్థాయిలో 'రోవర్' (Rover) తో భూముల సరిహద్దులను గుర్తించి బేస్ స్టేషన్ (Base Station) లకు అనుసంధానం చేస్తారు.
డ్రోన్ (DRONE) :
- ఈ విధానంలో నిర్దేశిత భూమిని డ్రోన్ (DRONE) తో ఫొటో తీస్తారు. దానిలోని హద్దుల ఆధారంగా సమగ్ర సర్వే చేస్తారు.
ఇతర అంశాలు :
- భూముల రీ సర్వే (Re-Survey) ఫలితాలను కార్స్ స్టేషన్ ద్వారా 'సెంట్రల్ కమాండ్ స్టేషన్' (Central Command Station) కి పంపి అక్కడ కొత్త "ఎఫ్ ఎం బి" (FMB ⇒ Field Measurement Book) రూపొందిస్తారు.
- సబ్ డివిజన్ల (Sub Divisions) స్థాయిలో కూడా రీ సర్వే పూర్తి చేసి నూతన 'ఆర్ ఎస్ ఆర్' (RSR ⇒ Re Survey Register) రూపొందిస్తారు.
- ఈ సర్వేలో వంద శాతం కచ్చితత్వం ఉంటుంది.
- రాష్ట్రంలో సుమారు 90 లక్షల మంది రైతులు ఉన్నారు. 2 కోట్లకు పైగా భూకమతాలు ఉన్నాయి. వీటితోపాటు పురపాలికల పరిధిలోని స్థలాలనూ రీ-సర్వే చేయనున్నారు.
- రీ-సర్వేలో గుర్తించిన వాటికి సర్వే రాళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.
- రైతుల పొలాల మధ్య ఏర్పాటు చేసే సర్వే రాళ్లు 60 సెం.మీ. ఎత్తు, 15 సెం.మీ. వెడల్పుతో ఉంటాయి. వీటికి బీ-కేటగిరీ రాళ్లను వాడతారు.
- గ్రామాల సరిహద్దుల మధ్య (కనీసం మూడు గ్రామాలు) ఏర్పాటు చేసే రాళ్లు 90 సెం.మీ. ఎత్తు, 23 సెం.మీ. వెడల్పుతో ఉంటాయి. వీటికి ఏ-కేటగిరీ రాళ్లను వినియోగిస్తారు.
- సర్వే రాళ్లపై ప్రభుత్వ పథకం పేరు, బాణం గుర్తులు ఉంటాయి.
- సర్వే రాళ్లు కొనుగోలు, రవాణా, కూలీ, ఇతర అవసరాలకు సుమారు రూ. 600 కోట్లు ఖర్చు అవుతుంది.
- మొత్తమ్మీద భూముల రీ సర్వేకు రూ. 987.46 కోట్లు ఖర్చు అవుతుందని సర్వే శాఖ అంచనా.
- ఏ సర్వే కోసం రాష్ట్రవ్యాప్తంగా 4,500 బృందాలు పనిచేయనున్నాయి.
- మొత్తం 15 వేల మంది సర్వేయర్లు రీ-సర్వేలో పాల్గొననున్నారు.
- ఒక్కో మండలంలో సర్వే నిర్వహణకు 4 నెలలు పడుతుంది.
- సర్వే సమయంలో వచ్చే భూవివాదాల పరిష్కారానికి ప్రత్యేక మొబైల్ కోర్టులు (Special Mobile Courts) ఏర్పాటు చేయనున్నారు.
- సర్వే చేసిన ప్రతి భూమికి యూనిక్ నంబర్ (Unique Number) ఇస్తారు. ఈ నంబర్ ద్వారా పట్టాదారులు తమ భూవివరాలు పూర్తిగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి