ఈ బ్లాగును సెర్చ్ చేయండి

14, నవంబర్ 2020, శనివారం

GK TEST-79

1. అత్యాధునిక సైనిక సాంకేతికత, వసతి కేంద్రాలతోపాటు అంతరిక్ష పరిజ్ఞాన సంబంధిత పటాలను పరస్పరం వినియోగించుకునేందుకు వీలు కల్పించే "బెకా" (BECA ⇒ Basic Exchange and Co-operation Agreement) ఒప్పందంపై సంతకాలు చేసిన దేశాలు ? 
(ఎ) భారత్ - అమెరికా 
(బి) భారత్ - రష్యా  
(సి) భారత్ - ఇజ్రాయెల్  
(డి) భారత్ - ఫ్రాన్స్ 

2. క్రింది వాటిలో జాతీయస్థాయి ఎన్నికల కమిషన్ లేని దేశం ?  
(ఎ) అమెరికా 
(బి) కెనడా  
(సి) మెక్సికో  
(డి) క్యూబా 

3. ఒక భారతీయ విమానయాన సంస్థ (Alliance Air) కు 'సీఈఓ' (CEO ⇒ Chief Executive Officer) గా నియమితులైన తొలి మహిళ ?  
(ఎ) అరుంధతి భట్టాచార్య  
(బి) హర్ సిమ్రత్ కౌర్ బాదల్ 
(సి) హర్ ప్రీత్ సింగ్ 
(డి) శివాంగీ సింగ్ 



4. "డాక్టర్ రామినేని ఫౌండేషన్ (USA) విశిష్ట పురస్కారం - 2020" కు ఎంపికైన 'నాబార్డ్' (NABARD ⇒ National Bank for Agriculture and Rural Development) చైర్మన్ ?   
(ఎ) డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి 
(బి) డాక్టర్ చింతల గోవిందరాజులు  
(సి) డాక్టర్ సురేష్ చంద్ర శర్మ 
(డి) డాక్టర్ హిరల్ తిపిర్నేని 

5. మారువేషాల్లో, వేషభాషలు మార్చుకుని, ఆడవారి గౌరవంతో ఆటలాడుకునే 'లవ్ జిహాదీలు' మారకపోతే "రామ్ నామ్ సత్య హై" (RAM NAM SATYA HAI) యాత్రలు మొదలపెట్టాల్సి ఉంటుందని హెచ్చరించిన ముఖ్యమంత్రి ? (అంత్యక్రియల సమయంలో హిందువులు 'రామ్ నామ్ సత్య హై' నినాదాలు చేస్తారు) 
(ఎ) కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు   
(బి) యోగి ఆదిత్యనాథ్  
(సి) మమతా బెనర్జీ  
(డి) ఉద్ధవ్ ఠాక్రే 

6. గుజరాత్ లోని నర్మదా జిల్లా 'కేవడియా' నుంచి అహ్మదాబాద్ లోని సబర్మతి తీరం వరకు వెళ్లే నీటి విమానాల (SEAPLANE) సేవల్ని భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' ప్రారంభించిన తేదీ ? (నీటి విమానాల సేవలు (Seaplane Services) మన దేశంలో ప్రారంభం కావడం ఇదే తొలిసారి)  
(ఎ) 2020 నవంబర్ 3 
(బి) 2020 నవంబర్ 2
(సి) 2020 నవంబర్ 1
(డి) 2020 అక్టోబర్ 31



7. భారత్ ను 'హిందూ పాకిస్థాన్' గా మార్చడమే 'భాజపా' (BJP) భావజాల సారాంశమని తను కొత్తగా రాసిన "బ్యాటిల్ ఆఫ్ బిలాంగింగ్" (Battle of Belonging) పుస్తకం ద్వారా అభిప్రాయపడిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ? ('గతంలో భారత భూభాగం విభజన జరిగితే ఇప్పుడు భారత ఆత్మ విభజన జరుగుతోంది' అని ఈ పుస్తకంలో వివరించారు) 
(ఎ) పి. చిదంబరం 
(బి) కపిల్ సిబల్ 
(సి) శశి థరూర్ 
(డి) మన్మోహన్ సింగ్ 

8. 'జార్జి ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్' (George Institute for Global Health) అధ్యయనం ప్రకారం 'శ్రీకాకుళం' జిల్లాలోని "ఉద్దానం" (UDDANAM) లో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారి శాతం ? (దేశవ్యాప్త సరాసరి 7% నుంచి 8% మధ్యలో ఉంది)   
(ఎ) 11%  
(బి) 21%  
(సి) 31% 
(డి) 41%  

9. 'అంతర్జాతీయ బాలికా దినోత్సవం' (అక్టోబర్ 11) నాడు బార్బీ బొమ్మల తయారీ సంస్థ "వన్ ఆఫ్ ఎ కైండ్" విభాగంలో ఒక క్రీడాకారిణి రూపంలోని బార్బీ బొమ్మని విడుదల చేసింది. మన దేశం నుంచి 'పారాస్పోర్ట్స్' (Parasports) విభాగంలో ఆ గౌరవాన్ని దక్కించుకున్న తొలి మహిళ ? (నవతరం నాయకత్వ లక్షణాలున్న మేటి మహిళగా, ఆసియాలోని ప్రభావిత వ్యక్తుల్లో ఒకరిగా గుర్తించిన 'టైమ్ మ్యాగజైన్' (TIME Magazine) అక్టోబర్'2020 ఆసియా ఎడిషన్ ని ఈమె ముఖచిత్రంతో ముద్రించింది) 
(ఎ) మానసి జోషి 
(బి) పరుల్ పర్మార్ 
(సి) దీపా మలిక్  
(డి) వైశాలి సలావ్ కర్   



10. తొలి బాండ్ నటుడిగా గుర్తింపు పొందిన "సీన్ కానరీ" (SEAN CONNERY) 2020 అక్టోబర్ 31న కన్నుమూశారు. కఠినమైన పోలీస్ అధికారిగా నటించిన ఏ చిత్రం ద్వారా 'సీన్ కానరీ' కి ఆస్కార్ అవార్డ్ (Oscar Award) లభించింది ? (బ్రిటిష్ నటుడైన 'సీన్ కానరీ' 1962లో వచ్చిన 'డాక్టర్ నో' మొదలుకొని వరుసగా ఏడు బాండ్ చిత్రాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు)  
(ఎ) ది హంట్ ఫర్ రెడ్ అక్టోబర్ 
(బి) మర్డర్ ఆన్ ది ఓరియంట్ ఎక్స్ ప్రెస్ 
(సి) ది రాక్ 
(డి) ది ఆన్ టచబుల్స్              

కీ (GK TEST-79 DATE : 2020 NOVEMBER 14)
1) ఎ   2) ఎ   3) సి   4) బి   5) బి   6) డి   7) సి   8) బి   9) ఎ   10) డి  

All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి