ఈ బ్లాగును సెర్చ్ చేయండి

23, నవంబర్ 2020, సోమవారం

GK TEST-81

1. గుజరాత్ లోని 'హాజీరా' (సూరత్) నుంచి 'ఘోఘా' (భావనగర్ జిల్లా) వరకు బహుళ ప్రయోజనాలతో కూడిన "రో-పాక్స్" (RO-PAX) నౌక సేవలను భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' ప్రారంభించిన తేదీ ? (ఈ సందర్భంగా 'కేంద్ర నౌకాయాన శాఖ' ను విస్తరిస్తూ "నౌకాశ్రయాలు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ" గా మారుస్తున్నట్లు భారత ప్రధాని వెల్లడించారు) 
(ఎ) 2020 నవంబర్ 6 
(బి) 2020 నవంబర్ 7 
(సి) 2020 నవంబర్ 8
(డి) 2020 నవంబర్ 9

2. అమెరికా తొలి "సెకండ్ జెంటిల్ మేన్" (Second Gentleman) గా చరిత్రకెక్కనున్న న్యాయవాది ? (వచ్చే ఏడాది జనవరిలో ఉపాధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ "కమలా హారిస్" (KAMALA HARRIS) ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఆమె భర్తకు ఈ అధికార హోదా ఇవ్వనున్నారు)  
(ఎ) జరేడ్ కుష్నర్   
(బి) రోజర్ స్టోన్  
(సి) వివేక్ మూర్తి  
(డి) డగ్లస్ ఎం.హోఫ్  

3. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' ప్రకటన చేసిన తేదీ ? 
(ఎ) 2016 నవంబర్ 5  
(బి) 2016 నవంబర్ 6
(సి) 2016 నవంబర్ 7 
(డి) 2016 నవంబర్ 8 



4. 'పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ' (Polavaram Project Authority) ప్రస్తుత సీఈఓ (CEO) ?  
(ఎ) ఆదిత్యనాథ్ దాస్ 
(బి)ఎం. వెంకటేశ్వరరావు  
(సి) చంద్రశేఖర్ అయ్యర్ 
(డి) జగ్ మోహన్ గుప్తా  

5. అమెరికా 46వ అధ్యక్షుడిగా 2021 జనవరి 20న ప్రమాణస్వీకారం చేయనున్న "జో బైడెన్" (JOE BIDEN) స్వస్థలం 'విల్మింగ్టన్' ఏ రాష్ట్రంలో ఉంది ? 
(ఎ) డెలావర్   
(బి) నార్త్ కరోలినా  
(సి) ఓక్లహామా  
(డి) టెక్సాస్ 

6. భారత రాజ్యాంగంలోని అధికరణ 39-ఎ ప్రకారం ఆర్ధిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రజలందరికీ న్యాయ సాయం అందించాలి. రాజ్యాంగ లక్ష్య సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'న్యాయ సేవల చట్టం' అమల్లోకి వచ్చిన తేదీ ? (నాటి సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి 'ఏ.ఎస్.ఆనంద్' ఈ తేదీని "న్యాయ సేవల దినోత్సవం" (Legal Services Day) గా ప్రకటించారు) 
(ఎ) 1995 నవంబర్ 7 
(బి) 1995 నవంబర్ 8
(సి) 1995 నవంబర్ 9 
(డి) 1995 నవంబర్ 10 



7. లోక్ అదాలత్ (LOK ADALAT) లతో మంచి ఫలితాలు వస్తుండటంతో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ 'జాతీయ లోక్ అదాలత్' కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం ? (ప్రతి నెలా ఒక శనివారం దేశవ్యాప్తంగా లోక్ అదాలత్ (LOK ADALAT) లు నిర్వహిస్తున్నారు)   
(ఎ) 2015 
(బి) 2016 
(సి) 2017 
(డి) 2018 

8. అనారోగ్యంతో వైద్యపరంగా 'అన్ ఫిట్' (Unfit) అయిన డ్రైవర్లకు 'ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ' (APSRTC) యాజమాన్యం కల్పిస్తున్న అవకాశం ?  
(ఎ) కండక్టర్  
(బి) సీనియర్ అసిస్టెంట్  
(సి) శ్రామిక్ 
(డి) జూనియర్ అసిస్టెంట్  

9. మనదేశ పరిస్థితుల దృష్ట్యా లీటరు తాగునీటిలో ఎంత ఫ్లోరైడ్ (FLUORIDE) మాత్రమే ఉండాలని 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' (WHO ⇒ World Health Organization) సూచిస్తోంది ?
(ఎ) 1 మిల్లీగ్రాము నుంచి 1.5 మిల్లీగ్రాములు  
(బి) 1.5 మిల్లీగ్రాముల నుంచి 2.0 మిల్లీగ్రాములు
(సి) 2.0 మిల్లీగ్రాముల నుంచి 2.5 మిల్లీగ్రాములు  
(డి) 2.5 మిల్లీగ్రాముల నుంచి 3.0 మిల్లీగ్రాములు  



10. 1000 సింగిల్స్ మ్యాచ్ ల్లో నెగ్గిన నాలుగో ఆటగాడిగా రికార్డ్ సృష్టించిన టెన్నిస్ ప్లేయర్ ? (ఇప్పటివరకు "జిమ్మీ కానర్స్ (1274), రోజర్ ఫెదరర్ (1242), ఇవాన్ లెండిల్ (1068)" మాత్రమే పురుషుల టెన్నిస్ లో 1000 విజయాలు సాధించిన క్లబ్ లో ఉన్నారు) 
(ఎ) నొవాక్ జకోవిచ్ 
(బి) రఫెల్ నాదల్ 
(సి) పీట్ సంప్రాస్ 
(డి) లీటన్ హెవిట్              

కీ (GK TEST-81 DATE : 2020 NOVEMBER 23)
1) సి   2) డి   3) డి   4) సి   5) ఎ   6) సి   7) బి   8) సి   9) ఎ   10) బి  

All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి