ఈ బ్లాగును సెర్చ్ చేయండి

11, నవంబర్ 2020, బుధవారం

GK TEST-78

1. పేస్ బుక్ (Facebook) కు చెందిన "వాట్సాప్" (Whatsapp) మనదేశంలో చెల్లింపు సేవలు పూర్తిస్థాయిలో ప్రారంభించిన తేదీ ? ('వాట్సాప్' 2018లో యూపీఐ (UPI) ఆధారిత చెల్లింపు సేవలను భారత్ లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది)  
(ఎ) 2020 నవంబర్ 6  
(బి) 2020 నవంబర్ 7  
(సి) 2020 నవంబర్ 8   
(డి) 2020 నవంబర్ 9

2. మకర రాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు ఏ నదికి పుష్కరాలు వస్తాయి ?
(ఎ) కృష్ణ
(బి) గోదావరి
(సి) తుంగభద్ర
(డి) గంగ

3. 'ఇండియన్ సూపర్ లీగ్' (ISL) ఏ ఆటకు సంబంధించినది ? (ఐఎస్ఎల్ (ISL) ఏడో సీజన్ 2020 నవంబర్ 20న 'గోవా' (GOA) లో ప్రారంభం కానుంది. మొత్తం 11 జట్లు తలపడనున్నాయి)
(ఎ) క్రికెట్
(బి) ఫుట్ బాల్
(సి) కబడ్డీ
(డి) హాకీ



4. 51వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI-2020) వేడుకల్లో భాగంగా .. 2019 'ఇండియన్ పనోరమ' విభాగంలో అవార్డు పొందిన తెలుగు చిత్రం ? (ఈ చిత్రం 'ఇండియన్ పనోరమ' లో ఎంపికైన ఏకైక తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించింది)
(ఎ) వినయ విధేయ రామ
(బి) ఎఫ్ 2
(సి) ఎన్ టి ఆర్ కథానాయకుడు
(డి) రహస్యం

5. "అమరావతి" (AMARAVATI) పేరుతో కొత్త రాజధాని నిర్మాణానికి భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' చేతులమీదుగా పునాదిరాయి పడిన తేదీ ?
(ఎ) 2015 ఆక్టోబర్ 21
(బి) 2015 ఆక్టోబర్ 22
(సి) 2015 ఆక్టోబర్ 23
(డి) 2015 ఆక్టోబర్ 24

6. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (NCTE ⇒ National Council for Teacher Education) తాజా నిర్ణయం ప్రకారం 'ఉపాధ్యాయ అర్హత పరీక్ష' (TET ⇒ Teacher Eligibility Test) స్కోర్ కాలపరిమితి ? (ఇక నుంచి 'టెట్' (TET) రాసి, ఉత్తీర్ణులయ్యే అభ్యర్థులకు ఇది వర్తిస్తుంది)
(ఎ) 7 సంవత్సరాలు
(బి) 14 సంవత్సరాలు
(సి) 21 సంవత్సరాలు
(డి) జీవితకాలం



7. 1914లో కుదిరిన సిమ్లా ఒప్పందం ప్రకారం 'మెక్ మహాన్ రేఖ' (McMahon Line) ను ఏయే దేశాల మధ్య సరిహద్దుగా గుర్తించారు ?
(ఎ) భారత్ - పాకిస్థాన్
(బి) భారత్ - చైనా
(సి) భారత్ - బంగ్లాదేశ్
(డి) భారత్ - టిబెట్

8. పోర్చుగీస్ గ్రాండ్ ప్రి (Portuguese Grand Prix - 2020) లో విజేతగా నిలవడం ద్వారా 'ఫార్ములా వన్' (F1 ⇒ Formula One) చరిత్రలో అత్యధికంగా 92 టైటిళ్లు సాధించిన డ్రైవర్ గా సరికొత్త రికార్డును నెలకొల్పిన "లూయిస్ హామిల్టన్" (Lewis Hamilton) ఏ దేశస్థుడు ? (మైఖేల్ షూమాకర్ (Michael Schumacher) పేరిట ఉన్న 91 టైటిళ్ల రికార్డును 'లూయిస్ హామిల్టన్' తుడిచిపెట్టాడు)
(ఎ) జర్మనీ
(బి) బ్రిటన్
(సి) ఫిన్లాండ్
(డి) స్పెయిన్

9. మనదేశంలో తొలి ప్రైవేట్ రైలు (Tejas Express) 'లఖ్ నవూ - దిల్లీ' మధ్య 2019 అక్టోబర్ 4న మరియు రెండో ప్రైవేట్ రైలు (Tejas Express) 'అహ్మదాబాద్ - ముంబయి' మధ్య 2020 జనవరి 17న పరుగులు పెట్టాయి. ఈ ప్రాజెక్ట్ ఏ సంస్థ నిర్వహణలో చేపట్టడం జరిగింది ? (రైల్వే శాఖ తదుపరి దశ కింద 151 ప్యాసెంజర్ రైళ్లను నడిపేందుకు ప్రైవేట్ సంస్థలకు ఆహ్వానం పలికింది. 2023 మార్చి నాటికి 12 రైళ్లు, 2024 మార్చి నాటికి 45 ప్రైవేట్ రైళ్లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా నిర్దేశించింది)
(ఎ) సీఏఎఫ్ (స్పెయిన్)
(బి) సీమెన్స్ ఏజీ (జర్మనీ)
(సి) అదానీ గ్రూప్ (ఇండియా)
(డి) ఐ ఆర్ సీ టీ సీ (ఇండియా)



10. హెచ్ డి ఎఫ్ సి (HDFC) బ్యాంక్ వ్యవస్థాపకుడు ?
(ఎ) కేతన్ పరేఖ్
(బి) దీపక్ పరేఖ్
(సి) సంజయ్ పరేఖ్
(డి) ఆశా పరేఖ్


కీ (GK TEST-78 DATE : 2020 NOVEMBER 11)
1) ఎ 2) సి 3) బి 4) బి 5) బి 6) డి 7) డి 8) బి 9) డి 10) బి

All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి