ఈ బ్లాగును సెర్చ్ చేయండి

11, జూన్ 2021, శుక్రవారం

2021 YEAR GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU TEST-71

1. సాగర గర్భంలో భారత నౌకాదళ పోరాట పటిమను మరింత శక్తిమంతం చేసేందుకు అధునాతన పరిజ్ఞానంతో 6 సంప్రదాయ జలాంతర్గాములను దేశీయంగా నిర్మించేందుకు ఉద్దేశించిన మెగా ప్రాజెక్ట్ (PROJECT 75 INDIA) ను 'రక్షణ కొనుగోళ్ల మండలి' (DAC) ఆమోదించిన తేదీ ? ['వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా' (STRATEGIC PARTNERSHIP MODEL) కింద చేపట్టిన మొదటి ప్రాజెక్ట్ ఇదే. ఈ ప్రాజెక్ట్ (P-75 (INDIA) పూర్తికావడానికి 12 ఏళ్లు పడుతుంది]
INS KALVARI
SUBMARINE

  
(ఎ) 2021 జూన్ 1 
(బి) 2021 జూన్ 2  
(సి) 2021 జూన్ 3  
(డి) 2021 జూన్ 4 

2. 2021 జూన్ 4న ముగిసిన ఆర్బీఐ (RBI) 'పరపతి విధాన కమిటీ' (MPC) సమావేశంలో .. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2021-22) వృద్ధి రేటు అంచనాలను 10.5% నుంచి ఎంత శాతానికి తగ్గించారు ? [ద్రవ్యోల్బణ అంచనాలను 5.1 శాతంగా ఉండొచ్చని తెలియజేశారు] 
(ఎ) 10% 
(బి) 9.5%  
(సి) 9%  
(డి) 8.5% 

3. 'ఏపీ అమూల్ ప్రాజెక్ట్' (AP AMUL PROJECT) లో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలోని 153 గ్రామాల్లో పాల సేకరణ కార్యక్రమాన్ని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి'వర్చువల్ విధానంలో ప్రారంభించిన తేదీ ? ['ఏపీ అమూల్ ప్రాజెక్ట్' (AP AMUL PROJECT) ను ఈ ఏడాది 2,600 గ్రామాలకు, రెండేళ్లు పూర్తయ్యేలోపు దశలవారీగా 9,899 గ్రామాలకు విస్తరించనున్నారు. ఇప్పటికే చిత్తూరు, ప్రకాశం, కడప, గుంటూరు జిల్లాల్లోని 722 గ్రామాల్లో ఈ ప్రాజెక్టు అమలవుతోంది.    
(ఎ) 2021 జూన్ 4  
(బి) 2021 జూన్ 5 
(సి) 2021 జూన్ 6 
(డి) 2021 జూన్ 7 

4. 'ఇథనాల్ మిశ్రమ మార్గసూచి 2020-2025' (ETHANOL BLENDING ROAD MAP 2020-25) ను భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' ఆవిష్కరించిన తేదీ ? [పెట్రోల్ లో 10 శాతం ఇథనాల్ ను 2022కి, 20 శాతం ఇథనాల్ ను కలిపి విక్రయించాలన్న లక్ష్యాన్ని 2030కి చేరుకోవాలని గతేడాది కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. అయితే పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ ను మిశ్రమం చేయాలన్న లక్ష్యాన్ని అయిదేళ్ల ముందుగానే అంటే 2025 కల్లా చేరుకుంటామని ప్రధాని అన్నారు] 
(ఎ) 2021 జూన్ 3 
(బి) 2021 జూన్ 4 
(సి) 2021 జూన్ 5 
(డి) 2021 జూన్ 6 

5. కేంద్ర విద్యా శాఖ తాజాగా విడుదల చేసిన 'పాఠశాల విద్య పనితీరు సూచిక 2019-20' (PERFORMANCE GRADING INDEX (PGI) 2019-20) ప్రకారం .. లెవెల్ 1లో ఒక్క రాష్ట్రమూ స్థానాన్ని దక్కించుకోలేదు. లెవెల్ 2లో గ్రేడ్ 1++ జాబితాలో 901-950 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచినవి ? [కేంద్ర విద్యా శాఖ .. పాఠశాల విద్యా నాణ్యతలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కనబరుస్తున్న పనితీరును పది లెవెల్స్ గా విభజించి వాటికి తొమ్మిది గ్రేడ్ లను ప్రకటించింది. లెవెల్-4లో 801-850 మార్కులతో గ్రేడ్-1 విభాగంలో ఆంధ్రప్రదేశ్, లెవెల్-5లో 751-800 మార్కులతో గ్రేడ్-2లో తెలంగాణ నిలిచాయి. పాఠశాల విద్యలో చేపట్టిన మార్పులను పరిగణనలోకి తీసుకుని 70 కొలమానాల ఆధారంగా పనితీరును అంచనా వేశారు]    
(ఎ) కేరళ, దిల్లీ, గుజరాత్, తమిళనాడు, చండీగఢ్    
(బి) కేరళ, చండీగఢ్, అండమాన్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, దిల్లీ   
(సి) లడఖ్, మేఘాలయ, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్ గఢ్  
(డి) పంజాబ్, చండీగఢ్, తమిళనాడు, కేరళ, అండమాన్ నికోబార్

6. కరోనా మూడో దశ ఉద్ధృతి చిన్న పిల్లలపై ఎక్కువగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో .. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన 'కొవాగ్జిన్' (COVAXIN) టీకా క్లినికల్ ట్రయల్స్ 18 ఏళ్లలోపు వారిపై ప్రారంభమైన తేదీ ? [మహారాష్ట్రలోని నాగ్ పుర్ లో మెడిట్రినా ఆసుపత్రిలో పిల్లల వైద్య నిపుణుడు 'డాక్టర్ వసంత్ ఖాలాత్కర్' పర్యవేక్షణలో క్లినికల్ పరీక్షలు మొదలయ్యాయి]    
(ఎ) 2021 జూన్ 4 
(బి) 2021 జూన్ 5 
(సి) 2021 జూన్ 6 
(డి) 2021 జూన్ 7 

7. ప్రపంచంలోకెల్లా తొలిసారిగా 'నానో యూరియా' (NANO UREA) ద్రావణాన్ని అభివృద్ధి చేసిన సంస్థ ? [ఒక్కో నానో యూరియా సీసా ధరను రూ. 240గా ఈ సంస్థ నిర్ణయించింది. సంప్రదాయ యూరియా బస్తాతో పోలిస్తే ఈ నానో యూరియా సీసా ధర 10 శాతం తక్కువగా ఉంటుంది]  
(ఎ) ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోపరేటివ్ 
(బి) నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ 
(సి) కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ 
(డి) రాష్ట్రీయ కెమికల్స్ & ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ 

8. క్రింది వాటిలో 'బిమ్ స్టెక్' (BIMSTEC) కూటమిలో లేని దేశం ? [సమాచార తేదీ : 2021 జూన్ 6]
BIMSTEC
బిమ్ స్టెక్ 

   

(ఎ) బంగ్లాదేశ్   
(బి) భూటాన్  
(సి) నేపాల్ 
(డి) చైనా  

9. భారతదేశంలో .. పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో స్థానంలో ఉంది ? [రోజుకు 4 కోట్ల 12 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటి విలువ ఏడాదికి దాదాపు రూ. 7 వేల కోట్లకు సమానం] (సమాచార తేదీ : 2021 జూన్ 4)
(ఎ) 1 
(బి) 2 
(సి) 3  
(డి) 4  

10. ఏ సంవత్సరం నాటికి ఆకలి సమస్యను అంతమొందించాలనేది 'ఐక్యరాజ్య సమితి' (UNO) సూచించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఒక భాగం ? [2021 జూన్ 7వ తేదీన మూడో ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని "నేటి సురక్షిత ఆహారమే రేపటి ఆరోగ్యం" అనే నినాదంతో నిర్వహించారు] 
(ఎ) 2025 
(బి) 2030 
(సి) 2035 
(డి) 2040              

కీ (KEY) (GK TEST-71 YEAR : 2021)
1) డి    2) బి    3) ఎ    4) సి    5) డి    6) సి    7) ఎ    8) డి    9) డి    10) బి   

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి