1. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి 'జస్టిస్ అరుణ్ మిశ్ర' (JUSTICE ARUN MISHRA) జాతీయ మానవహక్కుల సంఘం (NHRC) కొత్త చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ ? [ఆయనతోపాటు ప్యానెల్ సభ్యులుగా జస్టిస్ ఎం.ఎం.కుమార్, రాజీవ్ జైన్ బాధ్యతలు చేపట్టారు. అయిదేళ్లపాటు లేదా 70 ఏళ్ల వయసు వచ్చేవరకు జస్టిస్ అరుణ్ మిశ్ర ఈ పదవిలో కొనసాగుతారు]
![]() |
| జస్టిస్ అరుణ్ మిశ్ర |
(ఎ) 2021 జూన్ 1
(బి) 2021 జూన్ 2
(సి) 2021 జూన్ 3
(డి) 2021 జూన్ 4
2. 'కరోనా' మహమ్మారిని తరిమికొట్టడంలో విజయం సాధించే గ్రామాలకు పారితోషికాన్ని అందించేందుకు "కరోనా ఫ్రీ విలేజ్" (CORONA FREE VILLAGE) పేరుతో పోటీని నిర్వహిస్తున్న రాష్ట్రం ? [ప్రథమ స్థానంలో నిలిచిన గ్రామానికి రూ. 50 లక్షలు, ద్వితీయ స్థానం పొందిన గ్రామానికి రూ. 25 లక్షలు, తృతీయ స్థానంలో నిలిచిన గ్రామానికి రూ. 15 లక్షల నగదు అందజేస్తారు. విజేతను నిర్ణయించడానికి 22 అంశాలు ప్రాతిపదికగా ఉంటాయి]
(ఎ) మహారాష్ట్ర
(బి) ఆంధ్రప్రదేశ్
(సి) కేరళ
(డి) మధ్యప్రదేశ్
3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు రూ. 8 వేల కోట్లతో కొత్తగా 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పాడేరు, పులివెందులలో ఇప్పటికే భవన నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. మిగిలిన 14 వైద్య కళాశాలల భవనాలకు ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా శంకుస్థాపన చేసి, శిలాఫలకం ఆవిష్కరించిన తేదీ ? [విజయనగరం, అనకాపల్లి, అమలాపురం, రాజమహేంద్రవరం, పాలకొల్లు, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల, పిడుగురాళ్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోని వైద్య కళాశాలలకు సీఎం ఈ తేదీన శంకుస్థాపన చేశారు]
(ఎ) 2021 మే 30
(బి) 2021 మే 31
(సి) 2021 జూన్ 1
(డి) 2021 జూన్ 2
4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'కొవిడ్' రోగులకు సేవలందిస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్ (FRONTLINE WORKER) మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వం అందించే సాయం ? [కేంద్ర సాయం పరిధిలోకి రానివారికి ఇది అందుతుంది. కాంట్రాక్టు, పొరుగుసేవల సిబ్బందీ దీనికి అర్హులే]
(ఎ) రూ. 5 లక్షలు
(బి) రూ. 10 లక్షలు
(సి) రూ. 15 లక్షలు
(డి) రూ. 20 లక్షలు
5. గత కొద్ది రోజులుగా ఏ రాష్ట్రంలో "ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్" (AFRICAN SWINE FEVER) తో భారీ సంఖ్యలో పందులు మృత్యువాత పడుతున్నాయి ? [2 నెలల వ్యవధిలో 4,800 పందులు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. సమాచార తేదీ : 2021 జూన్ 2]
(ఎ) మేఘాలయ
(బి) మణిపూర్
(సి) మిజోరం
(డి) త్రిపుర
6. 'జాతీయ ఆర్ధిక పరిశోధన మండలి' (NCAER) 2021 మే నెలలో విడుదల చేసిన "భూరికార్డులు, సేవల సూచీ-2021" (LAND RECORD AND SERVICES INDEX (N-LRSI) 2021) ప్రకారం .. మొదటి అయిదు స్థానాలలో ఉన్న రాష్ట్రాలు వరుసగా ... ? [ఈ సూచీలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో, తెలంగాణ 13వ స్థానంలో నిలిచాయి]
(ఎ) మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడు
(బి) పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒడిశా
(సి) మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు
(డి) ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర
7. "భూరికార్డులు ప్రజలకు ఏమేరకు అందుబాటులో ఉన్నాయి ? రికార్డులు పొందే ప్రక్రియ సులభంగా ఉందా ? రికార్డులు పొందడంలో ప్రజలకు ఎలాంటి సహాయం అందుతోంది ?" ఈ అంశాల ఆధారంగా 'జాతీయ ఆర్ధిక పరిశోధన మండలి' (NCAER) 2021 మే నెలలో విడుదల చేసిన 'సౌలభ్య సూచీ' (EASE OF ACCESS INDEX) లో మొదటి అయిదు స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు వరుసగా ... ? [ఈ సూచీలో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో, తెలంగాణ 15వ స్థానంలో ఉన్నాయి]
(ఎ) కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్, బిహార్
(బి) బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్
(సి) ఉత్తర్ ప్రదేశ్, బిహార్, ఒడిశా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్
(డి) ఒడిశా, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, బిహార్, ఉత్తర్ ప్రదేశ్
8. మానసిక ఆందోళనను కారణంగా చూపుతూ 'ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ 2021' (2021 FRENCH OPEN) నుంచి అర్థంతరంగా వైదొలగిన జపాన్ స్టార్ క్రీడాకారిణి ? [2018 యూఎస్ ఓపెన్ నుంచి కుంగుబాటుతో బాధపటుతున్నట్లు ఈ క్రీడాకారిణి తెలిపింది. 23 ఏళ్ల వయసున్న ఈమె ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న టెన్నిస్ క్రీడాకారిణి]
(ఎ) ఆష్లే బార్టీ
(బి) సెరెనా విలియమ్స్
(సి) నవోమి ఒసాకా
(డి) బెర్నార్దా పెరా
9. 'ఉపాధ్యాయ అర్హత పరీక్ష' (TET) ఉత్తీర్ణత ధ్రువపత్రం చెల్లుబాటును ఏడేళ్ల నుంచి జీవిత కాలానికి పొడిగించాలని నిర్ణయించినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి 'రమేష్ పోఖ్రియాల్' ప్రకటించిన తేదీ ? [ఉత్తీర్ణత సాధించిన నాటి నుంచి ఏడేళ్లపాటు టెట్ ఉత్తీర్ణత ధ్రువపత్రం చెల్లుబాటులో ఉంటుందని 2011 ఫిబ్రవరి 11న 'జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి' (NCTE) జారీ చేసిన ఆదేశాలను తాజాగా కేంద్ర ప్రభుత్వం పక్కనపెట్టింది]
(ఎ) 2021 జూన్ 1
(బి) 2021 జూన్ 2
(సి) 2021 జూన్ 3
(డి) 2021 జూన్ 4
10. 2021 జూన్ 3న 'నీతి ఆయోగ్' (NITI AAYOG) ప్రకటించిన "సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిక-2020" (SUSTAINABLE DEVELOPMENT GOALS INDEX-2020) లో ఎన్ని మార్కులతో గోవా, కర్ణాటక, ఉత్తరాఖండ్ లతో కలిసి ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది ? [75 మార్కులతో 'కేరళ' తొలిస్థానంలోనూ, 74 మార్కులతో హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు సంయుక్తంగా 2వ స్థానంలో నిలిచాయి. 52 మార్కులతో 'బిహార్' చిట్టచివరి స్థానానికి పరిమితమైంది. కేంద్రపాలిత ప్రాంతాల్లో 'చండీగఢ్' 79 మార్కులతో అగ్రస్థానంలో నిలిచింది]
(ఎ) 73
(బి) 72
(సి) 71
(డి) 70
కీ (KEY) (GK TEST-70 YEAR : 2021)
1) బి 2) ఎ 3) బి 4) ఎ 5) సి 6) ఎ 7) డి 8) సి 9) సి 10) బి E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి