ఈ బ్లాగును సెర్చ్ చేయండి

12, ఏప్రిల్ 2021, సోమవారం

GK TEST-54 YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

Welcome To GK BITS IN TELUGU Blog

1. చమురు తవ్వకాల్లో వినియోగించే డ్రిల్లింగ్ రిగ్గులను పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన తొలి ప్రైవేటు రంగ సంస్థ ? [గుజరాత్ రాష్ట్రంలోని కలోల్ చమురు క్షేత్రంలో తవ్వకాల కోసం మొదటి డ్రిల్లింగ్ రిగ్గును 'ఓఎన్జీసీ' (ONGC) కి ఈ సంస్థ అందించింది] 
(ఎ) రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 
(బి) ఎల్ అండ్ టీ  
(సి) టాటా మోటార్స్ లిమిటెడ్  
(డి) మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 

2. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో (2021-22) జరిగిన మొదటి ద్రవ్యపరపతి విధాన సమీక్షా సమావేశం (ఈ నెల 5-7) (MONETARY POLICY COMMITTEE MEETING) లో 2021-22 ఆర్ధిక సంవత్సరానికి 'జీడీపీ' (GDP) వృద్ధిని ఎంత శాతంగా 'ఆర్బీఐ' (RBI) అంచనా వేసింది ? ['రేపో' రేటు 4%, 'రివర్స్ రేపో' రేటు 3.35% గా కొనసాగుతాయని 'ఆర్బీఐ' ప్రకటించింది]  
(ఎ) 10% 
(బి) 10.5%   
(సి) 11%  
(డి) 11.5% 

3. మత్స్య వనరుల పరిరక్షణలో భాగంగా ఏయే తేదీల మధ్య బంగాళాఖాతంలో చేపల వేటను నిషేధిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక, మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 'పూనం మాలకొండయ్య' ఉత్తర్వులు జారీ చేశారు ? [మెకనైజ్డ్, మోటారైజ్డ్ పడవల ద్వారా వేటపై 61 రోజులపాటు నిషేధం అమల్లో ఉంటుంది. యంత్రాల్లేని సంప్రదాయ పడవలకు మినహాయింపు ఇచ్చారు] 
(ఎ) 2021 ఏప్రిల్ 15 నుంచి 2021 జూన్ 14 వరకు  
(బి) 2021 ఏప్రిల్ 16 నుంచి 2021 జూన్ 15 వరకు 
(సి) 2021 ఏప్రిల్ 17 నుంచి 2021 జూన్ 16 వరకు 
(డి) 2021 ఏప్రిల్ 18 నుంచి 2021 జూన్ 17 వరకు 



4. కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన 'విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా-2020' (WOMEN AND MEN IN INDIA-2020) నివేదిక ప్రకారం .. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు ? [1951లో ప్రతి 1000 మంది పురుషులకు 986 మంది మహిళలు ఉన్నారు]  
(ఎ) 991 
(బి) 992 
(సి) 993 
(డి) 994 

5. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 భర్త "ప్రిన్స్ ఫిలిప్" (PRINCE PHILIP) కన్నుమూసిన తేదీ ? [2021 జూన్ 10న ఆయన శత జన్మదిన వేడుకలు జరుపుకోవాల్సి ఉంది] 
(ఎ) 2021 ఏప్రిల్ 6   
(బి) 2021 ఏప్రిల్ 7  
(సి) 2021 ఏప్రిల్ 8  
(డి) 2021 ఏప్రిల్ 9 

6. 'సెయిలింగ్' (SAILING) క్రీడకు సంబంధించి .. ఒలింపిక్స్ (OLYMPICS) లో పాల్గొనే తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డ్ సృష్టించిన "నేత్ర కుమనన్" స్వరాష్ట్రం ? ['ఒమన్' లో జరుగుతున్న ఆసియా క్వాలిఫయర్స్ లోని 'లేజర్ రేడియల్ క్లాస్ ఈవెంట్' (LASER RADIAL CLASS EVENT) లో పోటీపడిన 'నేత్ర' 21 పాయింట్లతో టాప్ లో నిలిచి తుది ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ఒలింపిక్స్ కు అర్హత సాధించి చరిత్ర సృష్టించింది]   
(ఎ) కేరళ 
(బి) తమిళనాడు 
(సి) పుదుచ్చేరి 
(డి) కర్ణాటక 



7. హైదరాబాద్ లోని 'సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ లేబొరేటరీ' (CDTL) లో కేంద్ర ప్రభుత్వ డ్రగ్ అనలిస్ట్ గా నియమితులైన హైదరాబాద్ కు చెందిన వ్యక్తి ? [దేశంలో 16 రకాల ఔషధాలను మినహా అన్ని రకాలను విశ్లేషించి ధృవీకరించే అధికారం ఇతనికి ఉంది]  
(ఎ) డాక్టర్ పి. రఘురాం  
(బి) డాక్టర్ రఘురామ్ రెడ్డి అడిడాల  
(సి) డాక్టర్ కూటికుప్పల సూర్యారావు 
(డి) డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి 

8. రాష్ట్ర గవర్నర్ కార్యదర్శి మినహా ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన మిగతా అఖిల భారత సర్వీస్ అధికారులందరి 'వార్షిక పనితీరు మదింపు నివేదిక' (PAR) ల్ని ఆమోదించే అధికారాన్ని ముఖ్యమంత్రికే దఖలుపరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన తేదీ ?  
(ఎ) 2021 ఏప్రిల్ 8  
(బి) 2021 ఏప్రిల్ 9  
(సి) 2021 ఏప్రిల్ 10 
(డి) 2021 ఏప్రిల్ 11  

9. టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన అతి పిన్న వయస్సు భారత మహిళా రెజ్లర్ (INDIA'S YOUNGEST FEMALE WRESTLER TO QUALIFY FOR TOKYO OLYMPICS) గా రికార్డు నమోదు చేసినది ?
(ఎ) వినేశ్ ఫొగాట్   
(బి) అన్షు మలిక్ 
(సి) సోనమ్ మలిక్   
(డి) సాక్షి మలిక్   



10. ప్రపంచంలోని అతిపెద్ద ఇ-కామర్స్ సంస్థ, 'జాక్ మా' నేతృత్వంలోని 'అలీబాబా' గ్రూపునకు (ALIBABA GROUP) 18.23 బిలియన్ యువాన్ (2.8 బిలియన్ డాలర్లు) ల జరిమానాను ఏ దేశ నియంత్రణ సంస్థలు విధించాయి ? [గుత్తాధిపత్యం కోసం 'అలీబాబా' 2015 నుంచి పోటీ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిందని తేల్చి ఈ నిర్ణయం తీసుకున్నాయి]   
(ఎ) అమెరికా 
(బి) రష్యా 
(సి) భారత్ 
(డి) చైనా              

కీ (KEY) (GK TEST-54 YEAR : 2021)
1) డి    2) బి    3) ఎ    4) సి    5) డి    6) బి    7) బి    8) సి    9) సి    10) డి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి