ఈ బ్లాగును సెర్చ్ చేయండి

21, ఏప్రిల్ 2021, బుధవారం

GK TEST-56 YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

Welcome To GK BITS IN TELUGU Blog

1. రుతుపవన వర్షపాతానికి సంబంధించి 'దీర్ఘకాలిక సగటు' (LPA) 96 శాతం నుంచి 104 శాతం మధ్య ఉంటే దాన్ని ఏమని లెక్కిస్తారు ? [ఈ ఏడాది దేశంలో రుతుపవన కాలమైన జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య 'దీర్ఘకాలిక సగటు' (LPA) వర్షపాతం 103 శాతం (5% అటు, ఇటుగా) ఉంటుందని ప్రైవేటు వాతావరణ పరిశోధన సంస్థ 'స్కైమెట్' (SKYMET) తెలిపింది]  
(ఎ) సాధారణం 
(బి) అధికం  
(సి) అత్యధికం  
(డి) అల్పం 

2. సూయజ్ కాలువ (SUEZ CANAL) లో అడ్డంగా ఇరుక్కుపోయి నౌకా వాణిజ్యానికి భారీ నష్టాన్ని కలిగించిన కంటైనర్ రవాణా నౌక "ఎవర్ గివెన్" (EVER GIVEN) కు ఏ దేశ న్యాయస్థానం 100 కోట్ల డాలర్ల (సుమారు రూ. 7,500 కోట్లు) భారీ జరిమానా విధించింది ? [దీనిని చెల్లించేందుకు యాజమాన్యం ఇష్టపడకపోవడంతో నౌకను ప్రభుత్వం జప్తు చేసుకుంది. 2021 మార్చ్ 23న ఈ నౌక .. కాలువలో ఇరుక్కుపోయి ఆరు రోజుల తర్వాత కదిలింది] 
(ఎ) గ్రీస్ 
(బి) జోర్డాన్  
(సి) టర్కీ  
(డి) ఈజిప్ట్ 

3. బంగారు ఆభరణాలు, కళాఖండాలకు ఏ తేదీ నుంచి హాల్ మార్కింగ్ (HALLMARKED) నిబంధనలు తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది ? [ఆ తేదీ నుంచి విక్రయదారులు 14, 18, 22 క్యారెట్ల బంగారు ఆభరణాలే విక్రయించాల్సి ఉంటుంది. ఆలోగా ఆభరణాల విక్రయదారులు 'బీఐఎస్' (BIS) దగ్గర నమోదు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం సూచించింది]  
(ఎ) 2021 మే 1  
(బి) 2021 జూన్ 1 
(సి) 2021 జూలై 1 
(డి) 2021 ఆగస్ట్ 1 



4. భారత్ కు చెందిన 'అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్' (APSEZ) ను తమ సస్టైనబిలిటీ సూచీ నుంచి 2021 ఏప్రిల్ 15 నుంచి తొలగించినట్లు తెలిపిన ప్రముఖ సూచీ ? [ఈ కంపెనీ వ్యాపారాలకు మియన్మార్ మిలిటరీతో సంబంధం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది]    
(ఎ) మూడీస్ 
(బి) ఫిచ్ 
(సి) ఎస్ & పీ 
(డి) నాస్ డాక్ 

5. పతనం అంచున ఉన్న 'సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి వ్యాపార సంస్థ' (MSME) లు 'ప్రి-ప్యాక్' పరిష్కార పథకం కింద ప్రభుత్వం నోటిఫై చేసిన నియమాలకు అనుగుణంగా ఎంత రుసుము చెల్లించి కొత్త దివాలా పరిష్కార పథకాన్ని ఎంచుకోవచ్చు ? [సాధారణ దివాలా స్మృతి కింద కంపెనీలు రూ. 25,000 చెల్లించాల్సి ఉండగా, దాన్ని 'ఎంఎస్ఎంఈ' లకు ప్రభుత్వం తగ్గించింది]    
(ఎ) రూ. 5,000   
(బి) రూ. 10,000  
(సి) రూ. 15,000  
(డి) రూ. 20,000 

6. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'భారత్ లో విద్యుత్తు వాహనాల తయారీ, త్వరితగత స్వీకారం' (FAME) పథకం రెండో దశ అమలులోకి వచ్చిన తేదీ ? [కేంద్ర ప్రభుత్వం 2011లో 'ఫేమ్' పథకానికి రూపకల్పన చేసి, మొదటి దశలో 2.8 లక్షల వాహనాలకు రూ. 359 కోట్ల ప్రోత్సాహకాలు అందించింది. రెండో దశలో రూ. 10 వేల కోట్లను కేటాయించారు]    
(ఎ) 2019 జనవరి 1 
(బి) 2019 ఏప్రిల్ 1 
(సి) 2019 జూలై 1 
(డి) 2019 అక్టోబర్ 1



7. 'ఐసీసీ' (ICC) అవినీతి నిరోధక నిబంధనల్లో అయిదింటిని ఉల్లంఘించినందుకు బౌలింగ్ దిగ్గజం "హీత్ స్ట్రీక్" (HEATH STREAK) పై 'ఐసీసీ' ఎనిమిదేళ్ల నిషేధం విధిస్తున్నట్లు 2021 ఏప్రిల్ 14న ప్రకటించింది. 'హీత్ స్ట్రీక్' ది ఏ దేశం ?  
(ఎ) ఇంగ్లాండ్ 
(బి) దక్షిణాఫ్రికా 
(సి) జింబాబ్వే 
(డి) ఆస్ట్రేలియా 

8. ఐసీసీ 2021 ఏప్రిల్ 14న ప్రకటించిన వన్డే బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లో ..  సుమారు మూడున్నరేళ్లపాటు (1258 రోజులు) అగ్రస్థానంలో కొనసాగిన 'విరాట్ కోహ్లీ' ని పాకిస్థాన్ కెప్టెన్ "బాబర్ అజామ్" వెనక్కి నెట్టి అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకున్న ఎన్నో పాకిస్థాన్ బ్యాట్స్ మన్ గా 'బాబర్ అజామ్' రికార్డు సృష్టించాడు ?      
(ఎ) 1  
(బి) 2  
(సి) 3 
(డి) 4  

9. తొలి అంతర్జాతీయ వన్డేకు 50 ఏళ్లవుతున్న నేపథ్యంలో 1971 నుంచి 2021 మధ్య దశాబ్దానికి ఒక్కరు చొప్పున ఐదుగురు అత్యుత్తమ ఆటగాళ్లను 'విజ్డెన్' (WISDEN) ఎంపిక చేసింది. దీనికి సంబంధించి సరియైన జతను గుర్తించండి ?

అత్యుత్తమ ఆటగాడుదశాబ్దం
(A) కపిల్ దేవ్(a) 1970-1980
(B) ముత్తయ్య మురళీధరన్(b) 1980-1990
(C) విరాట్ కోహ్లి (c) 1990-2000
(D) వివ్ రిచర్డ్స్(d) 2000-2010
(E) సచిన్ టెండూల్కర్(e) 2010-2020

(ఎ) (A) ⇒ (a), (B) ⇒ (b), (C) ⇒ (e), (D) ⇒ (d), (E) ⇒ (c) 
(బి) (A) ⇒ (b), (B) ⇒ (d), (C) ⇒ (e), (D) ⇒ (a), (E) ⇒ (c)
(సి) (A) ⇒ (a), (B) ⇒ (b), (C) ⇒ (e), (D) ⇒ (c), (E) ⇒ (d)
(డి) (A) ⇒ (b), (B) ⇒ (e), (C) ⇒ (d), (D) ⇒ (a), (E) ⇒ (c)  



10. 'విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2021' (Wisden Cricketer of the year-2021) అవార్డుకు ఎంపికైన ఇంగ్లాండ్ ఆల్రౌండర్ ? [వరుసగా రెండో ఏడాది అతను ఈ అవార్డుకు ఎంపికయ్యాడు]   
(ఎ) ఇయాన్ మోర్గాన్ 
(బి) మొయిన్ అలీ 
(సి) బెన్ స్టోక్స్  
(డి) జొనాథన్ బెయిర్ స్టో               

కీ (KEY) (GK TEST-56 YEAR : 2021)
1) ఎ    2) డి    3) బి    4) సి    5) సి    6) బి    7) సి    8) డి    9) బి    10) సి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి