ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఏప్రిల్ 2021, మంగళవారం

YSR KANTI VELUGU IN TELUGU

Welcome To GK BITS IN TELUGU Blog

డా. వైఎస్సార్ కంటి వెలుగు (YSR KANTI VELUGU)


  • "డా. వైఎస్సార్ కంటి వెలుగు" (YSR KANTI VELUGU) పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'ఆరు దశలలో' (SIX PHASES) రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కంటి వైద్య సేవలు అందిస్తారు.

మొదటి దశ (PHASE - I) :

  • 2019 అక్టోబర్ 10 నుండి 2019 అక్టోబర్ 16 వరకు 66 లక్షల మంది ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు పాఠశాలల వద్ద సుశిక్షితులైన 60 వేల మంది సిబ్బందితో ఉచిత కంటి పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు.

రెండవ దశ (PHASE - II) :

  • 2019 నవంబర్ 1 నుండి 2019 డిసెంబర్ 31 వరకు కంటి పరీక్ష నిపుణులతో కూడిన 500 టీమ్స్ తో 4.36 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 1.5 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు.

మూడో దశ (PHASE - III) :

  • 2020 ఫిబ్రవరి 18 నుండి 2020 జూలై 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా 56,88,420 మంది అవ్వా తాతలకు గ్రామ సచివాలయాలలో ఉచిత కంటి వైద్య సేవలు అందించారు. అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాలు, మందులు మరియు శస్త్ర చికిత్సలు అందించారు.

బడ్జెట్ :

  • "డా. వైఎస్సార్ కంటి వెలుగు" (YSR KANTI VELUGU) పథకం అమలుకు రూ. 560 కోట్ల వ్యయంతో రెండున్నర సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా కంటి వైద్య సేవలు అందిస్తారు.

లక్ష్యం :

  • నివారింపదగిన అంధత్వం 1 శాతం నుండి 0.3 శాతానికి తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం.  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి