Welcome To GK BITS IN TELUGU Blog
1. మరో రెండుసార్లు అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు తనకు వీలు కల్పించే ఒక చట్టంపై రష్యా అధ్యక్షుడు 'వ్లాదిమిర్ పుతిన్' లాంఛనంగా సంతకం చేసిన తేదీ ? [68 ఏళ్ల పుతిన్ .. రెండు దశాబ్దాలకు పైగా రష్యాలో అధికారంలో ఉన్నారు. సోవియట్ పాలకుడు 'జోసెఫ్ స్టాలిన్' కన్నా ఎక్కువకాలం పాటు పదవిలో కొనసాగారు. ఆయన ప్రస్తుత ఆరేళ్ల పదవీ కాలం 2024లో ముగుస్తుంది]
E & OE (Errors & Omissions Expected)
(ఎ) 2021 ఏప్రిల్ 3
(బి) 2021 ఏప్రిల్ 4
(సి) 2021 ఏప్రిల్ 5
(డి) 2021 ఏప్రిల్ 6
2. 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ' (APSLSA) ప్రస్తుత కార్యనిర్వాహక చైర్మన్ ?
(ఎ) జస్టిస్ ఏ.కె.గోస్వామి
(బి) జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్
(సి) జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి
(డి) జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు
3. బీసీసీఐ (BCCI) 'అవినీతి నిరోధక శాఖ' (ACU) అధికారిగా 'అజయ్ సింగ్' స్థానంలో బాధ్యతలు స్వీకరించిన 'షాబిర్ హుస్సేన్ షెఖాదమ్ ఖాండ్వావాలా' ఏ రాష్ట్ర 'డీజీపీ' (DGP) గా పనిచేశారు ?
(ఎ) గుజరాత్
(బి) రాజస్థాన్
(సి) మహారాష్ట్ర
(డి) పశ్చిమ బెంగాల్
4. భారత సర్వోన్నత న్యాయస్థానం (SUPREME COURT OF INDIA) ఎన్నో ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి "జస్టిస్ నూతలపాటి వెంకట రమణ" (జస్టిస్ ఎన్.వి.రమణ) 2021 ఏప్రిల్ 24న బాధ్యతలు చేపట్టనున్నారు ? [ఆయన ఈ పదవిలో 2022 ఆగస్ట్ 26 వరకు ఉంటారు. 1966 జూన్ 30న భారత 9వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన 'జస్టిస్ కోకా సుబ్బారావు' .. ఆ పదవిని చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా నిలిచారు]
(ఎ) 46
(బి) 47
(సి) 48
(డి) 49
5. భారత ప్రధాన న్యాయమూర్తిగా అత్యధిక కాలం (16వ ప్రధాన న్యాయమూర్తి : 1978 ఫిబ్రవరి 22 నుండి 1985 జూలై 11 వరకు ⇒ 2,696 రోజులు) మరియు అత్యల్ప కాలం (22వ ప్రధాన న్యాయమూర్తి : 17 రోజులు) పనిచేసిన వ్యక్తులు వరుసగా .. ?
(ఎ) జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్, జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్
(బి) జస్టిస్ భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా, జస్టిస్ అమల్ కుమార్ సర్కార్
(సి) జస్టిస్ ఏ.ఎన్. రే, జస్టిస్ ఈ.ఎస్.వెంకటరామయ్య
(డి) జస్టిస్ కే.జి.బాలకృష్ణన్, జస్టిస్ ఎస్.రాజేంద్ర బాబు
6. 'ఫోర్బ్స్ 35వ వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితా-2021' (FORBES' 35TH ANNUAL WORLD'S BILLIONAIRES LIST-2021) ప్రకారం .. మొదటి 5 స్థానాలలో ఉన్న వ్యక్తులు వరుసగా ... ? [జెఫ్ బెజోస్ వరుసగా నాలుగో ఏడాదీ ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో నిలిచారు. 'ఆర్ ఐ ఎల్' (RIL) అధినేత 'ముకేశ్ అంబానీ' ఈ జాబితాలో 84.5 బిలియన్ డాలర్ల సంపదతో 10వ స్థానంలో నిలిచారు]
(ఎ) జెఫ్ బెజోస్, బెర్నార్డ్ ఆర్నాల్డ్, ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, మార్క్ జుకర్ బర్గ్
(బి) జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, బెర్నార్డ్ ఆర్నాల్డ్, మార్క్ జుకర్ బర్గ్, బిల్ గేట్స్
(సి) జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, బెర్నార్డ్ ఆర్నాల్డ్, మార్క్ జుకర్ బర్గ్, బిల్ గేట్స్
(డి) జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, బెర్నార్డ్ ఆర్నాల్డ్, బిల్ గేట్స్, మార్క్ జుకర్ బర్గ్
7. 2021 ఏప్రిల్ 6న ట్రేడింగ్ ముగిసేనాటికి రూ. 7.84 లక్షల కోట్లు (106.8 బిలియన్ డాలర్లు) గా నమోదై .. తద్వారా 100 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువున్న గ్రూపుగా 'టాటా గ్రూపు, రిలయన్స్ ఇండస్ట్రీస్' ల సరసన చేరి .. ఈ ఘనతను సాధించిన మూడో భారతీయ గ్రూపుగా రికార్డు సృష్టించినది ?
(ఎ) బిర్లా
(బి) అదానీ
(సి) హిందుజా
(డి) బజాజ్
8. ఏ తేదీ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు వారు పనిచేసే చోటే 'కొవిడ్-19' టీకా (COVID-19 VACCINE) అందించే కార్యక్రమాన్ని ప్రారంభించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి 'రాజేష్ భూషణ్' రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు ?
(ఎ) 2021 ఏప్రిల్ 10
(బి) 2021 ఏప్రిల్ 11
(సి) 2021 ఏప్రిల్ 12
(డి) 2021 ఏప్రిల్ 13
9. పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులతో "పరీక్షా పే చర్చా" (PARIKSHA PE CHARCHA 2021) పేరుతో వర్చువల్ విధానంలో భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' మాట్లాడిన తేదీ ? ['పరీక్షలే జీవిత పరమార్ధం కాదనీ, సుదీర్ఘ ప్రయాణంలో అవి చిన్న గమ్యాలు మాత్రమేనని' ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు]
(ఎ) 2021 ఏప్రిల్ 5
(బి) 2021 ఏప్రిల్ 6
(సి) 2021 ఏప్రిల్ 7
(డి) 2021 ఏప్రిల్ 8
10. 'ఆంధ్రప్రదేశ్ స్థిరాస్తి వ్యాపార నియంత్రణ, ప్రాధికార సంస్థ' (AP RERA) చైర్మన్, సభ్యులు, అప్పిలేట్ ట్రైబ్యునల్ లో సభ్యుల ఎంపిక కమిటీకి చైర్మన్ గా ఎవరిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021 ఏప్రిల్ 7న ఉత్తర్వులు జారీ చేసింది ? [ఈ కమిటీలో సభ్యులుగా 'పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి' ఉంటారు]
(ఎ) జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్
(బి) జస్టిస్ జోయ్ మల్య బాగ్చి
(సి) జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు
(డి) జస్టిస్ కన్నెగంటి లలితా కుమారి
కీ (KEY) (GK TEST-53 YEAR : 2021)
1) సి 2) సి 3) ఎ 4) సి 5) ఎ 6) డి 7) బి 8) బి 9) సి 10) బి E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి