ఈ బ్లాగును సెర్చ్ చేయండి

7, ఏప్రిల్ 2021, బుధవారం

YSR FREE CROP INSURANCE SCHEME IN TELUGU

Welcome To GK BITS IN TELUGU Blog

వైఎస్సార్ ఉచిత పంటల బీమా (YSR FREE CROP INSURANCE)


  • ఆరుగాలం కష్టపడి, తీరా పంట చేతికొచ్చే సమయానికి అతివృష్టి, అనావృష్టి, వరదలు, కరువుకాటకాలు, చీడపీడలు, ఇతర ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట దిగుబడి నష్టాలతో కుదేలవుతున్న రైతులకు ధీమా కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం "వైఎస్సార్ ఉచిత పంటల బీమా" (YSR FREE CROP INSURANCE) పథకాన్ని ప్రవేశ పెట్టింది.
  • 2019 సీజన్లో పంట నష్టపోయిన 9.48 లక్షల మంది రైతులకు దాదాపు రూ. 1,252 కోట్ల బీమా పరిహారాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు 2020 డిసెంబర్ 15న ప్రభుత్వం జమ చేసింది.
  • రైతులపై పైసా కూడా ఆర్ధిక భారం లేకుండా, పూర్తి ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ, 'సాగు చేసి, ఈ-క్రాప్ లో నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్ని' పంటల బీమా పరిధిలో చేర్చి, "వైఎస్సార్ ఉచిత పంటల బీమా" (YSR FREE CROP INSURANCE) పథకం ద్వారా రైతుల తరపున బీమా సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
  • 'వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు' (YSR RBKs) ద్వారా గ్రామంలో సాగు చేసిన పంటల వివరాలు 'ఈ-క్రాప్' లో నమోదు చేసి బీమా సౌకర్యం కల్పించడంతో పాటు, ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయినపుడు నష్టాల వివరాలు అంచనా వేసి బీమా పరిహారం చెల్లించే ఏర్పాటు చేస్తారు.
  • రైతులు స్వయంగా పరిశీలించుకునేందుకు వీలుగా 'వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు' (YSR RBKs) లో ఈ-క్రాప్ వివరాలతో సహా లబ్ధిదారుల జాబితాలను ప్రదర్శిస్తారు.

టోల్ ఫ్రీ నంబర్ (TOLL-FREE NUMBER) :

  • సహాయం మరియు ఫిర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నంబర్ (TOLL-FREE NUMBER) "155251" ను సంప్రదించవచ్చు.     


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి