ఈ బ్లాగును సెర్చ్ చేయండి

1, ఏప్రిల్ 2021, గురువారం

GK TEST-49 YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

Welcome To GK BITS IN TELUGU Blog

1. కుటుంబంలో సంపాదించే వ్యక్తి (18-50 సంవత్సరాలు) 'సహజ మరణం' చెందితే "వైఎస్సార్ బీమా" (YSR BIMA) ద్వారా అందే బీమా ప్రయోజనం ?  
(ఎ) రూ. 2,00,000 
(బి) రూ. 5,00,000  
(సి) రూ. 3,00,000  
(డి) రూ. 1,50,000 

2. కుటుంబంలో సంపాదించే వ్యక్తి (18-70 సంవత్సరాలు) ప్రమాదం వల్ల 'పాక్షిక శాశ్వత అంగ వైకల్యం' చెందితే "వైఎస్సార్ బీమా" (YSR BIMA) ద్వారా అందే బీమా ప్రయోజనం ?  
(ఎ) రూ. 2,00,000 
(బి) రూ. 5,00,000  
(సి) రూ. 3,00,000  
(డి) రూ. 1,50,000 

3. కుటుంబంలో సంపాదించే వ్యక్తి (18-50 సంవత్సరాలు) ప్రమాదం వల్ల 'మరణం లేదా శాశ్వత అంగ వైకల్యం' చెందితే "వైఎస్సార్ బీమా" (YSR BIMA) ద్వారా అందే బీమా ప్రయోజనం ?  
(ఎ) రూ. 2,00,000 
(బి) రూ. 5,00,000  
(సి) రూ. 3,00,000  
(డి) రూ. 1,50,000 



4. కుటుంబంలో సంపాదించే వ్యక్తి (51-70 సంవత్సరాలు) ప్రమాదం వల్ల 'మరణం లేదా శాశ్వత అంగ వైకల్యం' చెందితే "వైఎస్సార్ బీమా" (YSR BIMA) ద్వారా అందే బీమా ప్రయోజనం ?  
(ఎ) రూ. 2,00,000 
(బి) రూ. 5,00,000  
(సి) రూ. 3,00,000  
(డి) రూ. 1,50,000 

5. 'నాడు-నేడు' పథకంలో భాగంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న 23,510 అంగన్వాడీ కేంద్రాలకు కొత్త భవనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. 'వంట గది, సామగ్రి నిల్వ గది, మరుగుదొడ్డి, ఆటస్థలం' తో కలిపి ఎంత విస్తీర్ణంలో కొత్త భవనాలు నిర్మించనుంది ? [కొత్త అంగన్వాడీ కేంద్ర నిర్మాణానికి రూ. 14 లక్షలు కేటాయించనుంది]  
(ఎ) 812 చదరపు అడుగులు   
(బి) 813 చదరపు అడుగులు  
(సి) 814 చదరపు అడుగులు  
(డి) 815 చదరపు అడుగులు 

6. 2021 ఏప్రిల్ 1 నుంచి జారీ అయ్యే విమానయాన టికెట్లపై 'ఏవియేషన్ సెక్యూరిటీ ఫీజు' (ASF) కింద దేశీయ ప్రయాణీకులపై ఎంత చొప్పున విధించనున్నారు ? [అంతర్జాతీయ ప్రయాణీకులపై 12 డాలర్ల చొప్పున 'ఏఎస్ఎఫ్' కింద విధించనున్నారు. అయితే రెండేళ్లలోపు చిన్నారులకు, డిప్లొమాటిక్ పాస్ పోర్టులున్నవారు .. తదితర ప్రత్యేక వర్గాలకు ఈ ఫీజు వర్తించదు]
(ఎ) రూ. 100 
(బి) రూ. 200 
(సి) రూ. 300 
(డి) రూ. 400 



7. గ్రామాల్లో 100% ఇళ్లకు కుళాయి నీరు అందించిన ప్రథమ రాష్ట్రం ? ['జల్ జీవన్ మిషన్' కార్యక్రమం కింద 2024 నాటికల్లా గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు పూర్తిగా కుళాయి నీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది] 
(ఎ) గోవా 
(బి) తెలంగాణ 
(సి) ఆంధ్రప్రదేశ్ 
(డి) కర్ణాటక 

8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021-22 ఆర్ధిక సంవత్సరం తొలి మూడు నెలల కాలానికి రూ. 70,983.11 కోట్లతో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన 'ఓట్ ఆన్ అకౌంట్' (VOTE-ON-ACCOUNT) కు సంబంధించిన ఆర్డినెన్సును గవర్నర్ 'బిశ్వభూషణ్ హరిచందన్' ఆమోదించిన తేదీ ?    
(ఎ) 2021 మార్చ్ 25  
(బి) 2021 మార్చ్ 26  
(సి) 2021 మార్చ్ 27 
(డి) 2021 మార్చ్ 28  

9. 2021 మార్చ్ 28న ఆంధ్రప్రదేశ్ రవాణా, సమాచార శాఖ మంత్రి 'పేర్ని నాని' హైదరాబాద్ లోని 'బీహెచ్ఈఎల్' ఆవరణలో ఏపీఎస్ఆర్టీసీ' (APSRTC) కి చెందిన ఏ డిపోను ప్రారంభించారు ? [హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే బస్సులను నిలపడంతోపాటు .. వాటికి మరమ్మతులు చేసుకునేందుకు ఈ ప్రాంగణం ఉపయోగపడుతుంది]
(ఎ) కాకినాడ 
(బి) రామచంద్రాపురం  
(సి) అమలాపురం  
(డి) తుని  



10. తక్కువ ఖర్చుతో పంటకు ఎరువులు అందించగలిగే వీలున్న "వేస్ట్ డీకంపోజర్" (WASTE DECOMPOSER) పొడిని 11 ఏళ్లపాటు పరిశోధించి 2015లో ఆవిష్కరించిన ఉత్తర్ ప్రదేశ్ లోని ఘజియాబాద్ 'జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం' (NCOF) డైరెక్టర్ ? [ఇది 'వరి, గోధుమ, పత్తి, కంది, ఆకుకూరలు, ఉద్యాన పంటలు' పండించే నేలలకు బహుళ పోషక ప్రయోజనకారిగా పనిచేస్తుంది. హైదరాబాద్ 'బషీర్ బాగ్' లోని బాబూఖాన్ ఎస్టేట్ 115వ గదిలోని రైతు సేవా కేంద్రంలో 'వేస్ట్ డీకంపోజర్' (WASTE DECOMPOSER) దొరుకుతుంది. 040-23235858 ఫోన్ నంబర్ పై వివరాలు తెలుసుకోవచ్చు]   
(ఎ) డాక్టర్ ప్రవీణ్ కుమార్  
(బి) డాక్టర్ రాకేశ్ మిశ్రా 
(సి) డాక్టర్ క్రిషన్ చంద్ర 
(డి) డాక్టర్ కె.హేమలత              

కీ (KEY) (GK TEST-49 YEAR : 2021)
1) ఎ    2) డి    3) బి    4) సి    5) సి    6) బి    7) ఎ    8) డి    9) బి    10) సి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి