Welcome To GK BITS IN TELUGU Blog
జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం (ఎస్సీ మరియు ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక పారిశ్రామిక విధానం 2020-23)(JAGANANNA YSR BADUGU VIKASAM - Special Industrial Policy for SC and ST Entrepreneurs 2020-23)
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసే 'ఎస్సీ, ఎస్టీ' (SC & ST) లకు రూ. కోటి వరకు పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తెలిపారు. వారికోసం "జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం" (JAGANANNA YSR BADUGU VIKASAM) పేరిట ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని 2020 అక్టోబర్ 26న ప్రకటించారు.
- ఈ ప్రత్యేక పారిశ్రామిక విధానం 2020-23 వరకు అమల్లో ఉంటుంది.
మూల ధన రాయితీ (INVESTMENT SUBSIDY) :
- తయారీ యూనిట్లు ఏర్పాటు చేసే ఎవరికైనా 'స్థిర మూలధన పెట్టుబడి' (FCI) లో 45% .. గరిష్ఠంగా రూ. కోటి వరకు పెట్టుబడి రాయితీని ప్రభుత్వమే అందిస్తుంది. సేవా, రవాణా రంగాల యూనిట్లకు 45% .. గరిష్ఠంగా రూ. 75 లక్షల వరకు రాయితీ లభిస్తుంది.
- సూక్ష్మ, చిన్న పరిశ్రమల పెట్టుబడికి తీసుకున్న రుణంపై 3 నుంచి 9 శాతం వరకు వడ్డీ రాయితీ ఇస్తారు. ఇది అయిదేళ్ల వరకు వర్తిస్తుంది.
- సూక్ష్మ, చిన్న పరిశ్రమలు చెల్లించే 'ఎస్జీఎస్టీ' (SGST) పై పూర్తిగా, మధ్య తరహా పరిశ్రమలకు 75%, భారీ పరిశ్రమలకు 50% రాయితీ ఇస్తారు.
- మొదటిసారి పరిశ్రమ ఏర్పాటు చేసే వారికి యంత్రాల కొనుగోలులో 25% 'సీడ్ క్యాపిటల్ అసిస్టెన్స్' (SEED CAPITAL ASSISTANCE) కింద అందజేస్తారు.
ప్రోత్సాహకాలు (INCENTIVES) :
- తయారీ, రవాణా, కొన్ని ప్రత్యేక సేవా రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసే వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తుంది. పారిశ్రామిక వాడలు, భవిష్యత్తులో 'ఏపీఐఐసీ' (APIIC) ద్వారా జరిగే భూ కేటాయింపుల్లో 'ఎస్సీ' లకు 16.2%, 'ఎస్టీ' లకు 6% భూములను కేటాయిస్తారు.
- ఔత్సాహిక 'ఎస్సీ, ఎస్టీ' పారిశ్రామికవేత్తలకు ప్రాజెక్ట్ నివేదికల తయారీలో సహకారం అందించటానికి 'డీఐసీ', 'ఏపీఐఐసీ' జోనల్ కార్యాలయాల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తారు.
- పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడానికి పారిశ్రామిక వాడల్లో కేటాయించే భూముల ధరలో 25% చెల్లిస్తే చాలు. మిగిలిన 75% పరిశ్రమ వాణిజ్య ఉత్పత్తి మొదలైన తర్వాత ఎనిమిదేళ్లలో 8% వడ్డీతో చెల్లించే వెసులుబాటు కల్పిస్తారు.
- పారిశ్రామికవాడల్లో ఏర్పాటు చేసే సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు భూముల కొనుగోలు ధరలో 50% రాయితీ.. గరిష్ఠంగా రూ. 20 లక్షల వరకు అనుమతి ఇస్తారు. భూముల స్థితి మార్పునకు వెచ్చించే ఖర్చులో 25% రాయితీ .. గరిష్ఠంగా రూ. 10 లక్షల వరకు అనుమతి ఇస్తారు.
- వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి అయిదేళ్లపాటు విద్యుత్తు చార్జీల్లో యూనిట్ కు రూ. 1.50 వంతున రాయితీ ఇస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి