ఈ బ్లాగును సెర్చ్ చేయండి

2, ఏప్రిల్ 2021, శుక్రవారం

GK TEST-50 YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

Welcome To GK BITS IN TELUGU Blog

1. 2021 మార్చ్ 28 నాటి 'మన్ కీ బాత్' (MANN KI BAAT) కార్యక్రమంలో భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' మెచ్చుకున్న 'ప్రొఫెసర్ శ్రీనివాస్ పడకండ్ల' ఏ విశ్వవిద్యాలయంలో 'ఫైన్ ఆర్ట్స్' (FINE ARTS) విభాగాధిపతిగా పనిచేస్తున్నారు ? [వినూత్నంగా ఆలోచించి .. వ్యర్ధాల నుంచి అందమైన శిల్పాలను సృష్టిస్తున్న ఆయన కృషిని ప్రధాని ప్రశంసించారు]  
(ఎ) ఆంధ్ర విశ్వవిద్యాలయం 
(బి) నాగార్జున విశ్వవిద్యాలయం  
(సి) బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం  
(డి) జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం 

2. కర్నూలులోని 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం' (UYYALAWADA NARASIMHA REDDY AIRPORT) లో విమాన రాకపోకలు ప్రారంభమైన తేదీ ? ['ఇండిగో' (INDIGO) విమానం ఉదయం 9.05 గంటలకు బెంగళూరులో బయలుదేరి 10.10 గంటలకు ఇక్కడకు చేరుకుంది] 
(ఎ) 2021 మార్చ్ 26 
(బి) 2021 మార్చ్ 27  
(సి) 2021 మార్చ్ 28  
(డి) 2021 మార్చ్ 29 

3. 'యూకే ప్రభుత్వం బ్రిటిష్ కౌన్సిల్ అవార్డు-2021' (BRITISH COUNCIL AWARD 2021 by UK GOVT.) కు ఎంపికైన 'దాసరి హరిచందన' తెలంగాణలోని ఏ జిల్లాకు కలెక్టర్ గా పనిచేస్తున్నారు ? ['లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్' (LONDON SCHOOL OF ECONOMICS) లో 'పర్యావరణ అర్థశాస్త్రం' లో ఈమె పీజీ (PG) పూర్తిచేశారు. రెండు, మూడేళ్లకోసారి 'యూకే ప్రభుత్వం' ఆ దేశంలో చదివిన పూర్వ విద్యార్థులకు 'బ్రిటిష్ కౌన్సిల్ అవార్డు' ను ప్రకటిస్తుంది. మన దేశం నుంచి ఈ పురస్కారానికి ఎంపికైనది ఈమె ఒక్కరే] 
(ఎ) అదిలాబాద్   
(బి) భద్రాద్రి కొత్తగూడెం 
(సి) నారాయణపేట 
(డి) జోగులాంబ గద్వాల్ 



4. భారత్ తరపున 'వన్డే క్రికెట్' (ONE DAY CRICKET) లో 5 వేలకు పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన రెండో ఓపెనింగ్ జోడీగా 'రోహిత్ శర్మ-శిఖర్ ధావన్' నిలిచారు. వీళ్లకంటే ముందు ఇలాంటి ఘనతను సాధించిన జోడీ ? [ప్రపంచ వన్డే క్రికెట్లో ఈ ఘనత సాధించిన ఏడో జంటగా 'రోహిత్-ధావన్' రికార్డు నమోదు చేశారు] 
(ఎ) సచిన్ టెండూల్కర్ - వీరేంద్ర సెహ్వాగ్ 
(బి) సచిన్ టెండూల్కర్ - సౌరభ్ గంగూలీ 
(సి) సచిన్ టెండూల్కర్ - రాహుల్ ద్రవిడ్  
(డి) సౌరభ్ గంగూలీ - రాహుల్ ద్రవిడ్ 

5. అనంతపురం జిల్లా కోర్టు ఏర్పాటు చేసి వందేళ్లు పూర్తయిన సందర్భంగా 2021 మార్చ్ 27న నిర్వహించిన శతాబ్ది వేడుకల్లో 'న్యాయవాద వృత్తి అంటే టీ20, వన్డే క్రికెట్ మ్యాచ్ లాంటిది కాదని .. టెస్ట్ క్రికెట్ లా ఓపిక పడితేనే ఈ వృత్తిలో విజయం సాధించగలరు' అని యువ న్యాయవాదులకు సూచించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ? 
(ఎ) జస్టిస్ ఆర్. రఘునందన్ రావు   
(బి) జస్టిస్ హిమ కోహ్లీ  
(సి) జస్టిస్ సి. ప్రవీణ్ కుమార్  
(డి) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి 

6. బంగ్లాదేశ్ - భారత్ ల మధ్య కొత్త ప్రయాణికుల రైలు 'ఢాకా' నుంచి పశ్చిమ బెంగాల్ లోని 'న్యూ జల్పాయిగుడి' వరకు నడవనున్న "మిథాలీ ఎక్స్ ప్రెస్" (MITALI EXPRESS) ను ఇరు దేశాల ప్రధాన మంత్రులు 'షేక్ హసీనా, నరేంద్ర మోదీ' లు సంయుక్తంగా 'వీడియో కాన్ఫరెన్స్' ద్వారా ప్రారంభించిన తేదీ ? [ఇప్పటికే 'మైత్రీ ఎక్స్ ప్రెస్' (ఢాకా-కోల్ కతా) (MAITREE EXPRESS), 'బంధన్ ఎక్స్ ప్రెస్' (ఖుల్నా-కోల్ కతా) (BANDHAN EXPRESS) నడుస్తున్నాయి] 
(ఎ) 2021 మార్చ్ 26 
(బి) 2021 మార్చ్ 27 
(సి) 2021 మార్చ్ 28 
(డి) 2021 మార్చ్ 29 



7. అన్ని బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (RRB) లు , బ్యాంకింగేతర ఆర్ధిక కంపెనీ (NBFC) లు, ఇతరత్రా చెల్లింపుల గేట్ వే (PAYMENT GATEWAY) లు 2021 మార్చ్ 31 కల్లా 'ఏఎఫ్ఏ' (AFA) నిబంధనను పాటించాలని 'ఆర్బీఐ' (RBI) జారీ చేసిన ఆదేశాలకు సంబంధించిన  గడువును ఏ తేదీ వరకు పెంచింది ? [కొత్త నిబంధనల ప్రకారం .. రూ. 5000 దాటి జరిపే ఆటోమేటిక్ లావాదేవీలకు బ్యాంకులు, ఇతరత్రా సంస్థలు వినియోగదారుడికి 'ఓటీపీ' (OTP) పంపి వారి నుంచి అనుమతి లభిస్తేనే లావాదేవీ పూర్తవుతుంది]    
(ఎ) 2021 ఏప్రిల్ 30 
(బి) 2021 జూన్ 30 
(సి) 2021 సెప్టెంబర్ 30 
(డి) 2021 డిసెంబర్ 31 

8. ఆక్స్ ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన 'కొవిషీల్డ్' (COVISHIELD) టీకా వినియోగ గడువు (EXPIRY DATE) ను 'భారత ఔషధ నియంత్రణ సంస్థ' (DCGI) ఎన్ని నెలలకు పెంచింది ? [ప్రస్తుతం ఈ టీకా గడువు 6 నెలలు మాత్రమే]  
(ఎ) 7  
(బి) 8  
(సి) 9 
(డి) 10  

9. కేంద్ర ప్రభుత్వం 'ఆహారశుద్ధి పరిశ్రమ' (FOOD PROCESSING INDUSTRY) కు రూ. 10,900 కోట్లతో 'ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక' (PLI) పథకాన్ని ప్రకటించింది. ఏయే సంవత్సరాల మధ్య కాలంలో ఈ పథకాన్ని అమలు చేయాలని 2021 మార్చ్ 31న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది ? [దేశ సహజ వనరులను ఉపయోగించుకొని ప్రపంచ స్థాయి ఆహార తయారీ సంస్థలను సృష్టించడానికి, అంతర్జాతీయ మార్కెట్ లో భారతీయ ఆహార ఉత్పత్తి బ్రాండ్లను ప్రోత్సహించడానికి వీలుగా 'ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని' తీసుకొస్తున్నారు]
(ఎ) 2021-22 నుంచి 2024-25 
(బి) 2021-22 నుంచి 2025-26 
(సి) 2021-22 నుంచి 2026-27  
(డి) 2021-22 నుంచి 2027-28  



10. 'ప్రపంచ ఆర్ధిక వేదిక' (WEF) 156 దేశాల్లో అధ్యయనం చేసి రూపొందించిన "లింగ సమానత్వ నివేదిక-2021" (GLOBAL GENDER GAP REPORT-2021) ప్రకారం .. 'మహిళా సమానత్వ సూచీ' లో భారత్ స్థానం ? [2020లో 153 దేశాల జాబితాలో భారత్ 112వ స్థానం దక్కించుకుంది]  
(ఎ) 140 
(బి) 141 
(సి) 142 
(డి) 143              

కీ (KEY) (GK TEST-50 YEAR : 2021)
1) బి    2) సి    3) సి    4) బి    5) డి    6) బి    7) సి    8) సి    9) సి    10) ఎ  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి