Welcome To GK BITS IN TELUGU Blog
వైఎస్సార్ మత్స్యకార భరోసా (YSR MATSYAKARA BHAROSA)
- 2020 మే 6న "వైఎస్సార్ మత్స్యకార భరోసా" (YSR MATSYAKARA BHAROSA) పథకం ద్వారా లక్షకు పైగా మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ సమయంలో రూ. 10 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించారు.
- సముద్రంపై చేపల వేట నిషేధ కాలంలో అర్హత గల మత్స్యకార కుటుంబాలకు ఆర్ధిక సాయం రూ. 4 వేల నుండి రూ. 10 వేలకు పెంచి భృతి చెల్లించడం జరిగింది. (మర పడవలతో పాటు తెప్పలకు కూడా భృతి చెల్లించారు)
- వేట చేస్తూ మరణించిన మత్స్యకారుని కుటుంబానికి చెల్లించే నష్ట పరిహారం రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచారు. ఈ పథకం కింద 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గల మత్స్యకారులు అర్హులు.
- డీజిల్ ఆయిల్ పై లీటరుకు సబ్సిడీని రూ. 6.03 పైసల నుండి రూ. 9.00 లకు పెంచారు. మత్స్యశాఖకు చెందిన 6 బంకులతోపాటు ప్రభుత్వం గుర్తించిన 68 ప్రైవేటు బంకులలో ఆయిల్ పోయించుకునే సమయంలోనే రేటు తగ్గించి పోస్తారు.
ఇతర అంశాలు :
- ఆక్వా రైతుల శ్రేయస్సుకై యూనిట్ కరెంటు కేవలం రూ. 1.50 పైసలకే సరఫరా చేస్తారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా రూ. 50.30 కోట్లతో 35 ఆక్వా ల్యాబ్స్ ను ఏర్పాటు చేసి నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులను అందిస్తారు.
- అవసరమైనమేరకు 'రైతు భరోసా కేంద్రం' (RBK) లలో 'ఫిషరీస్ అసిస్టెంట్స్' (FISHERIES ASSISTANTS) ను నియమిస్తారు.
- గుజరాత్ లో చేపల వేటకు వెళ్లి చిక్కుకుపోయిన దాదాపు 4,300 మత్స్యకారులకు స్వరాష్ట్రానికి తిరిగి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి రూ. 2,000 ఆర్ధిక సాయం అందించారు.
- 2012వ సంవత్సరంలో GSPC (ONGC) త్రవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 14,927 మంది మత్స్యకారులకు రూ. 47,250 ల చొప్పున మొత్తం రూ. 70.53 కోట్ల నష్ట పరిహారం చెల్లించారు.
- పొరపాటున పాకిస్థాన్ తీర జలాల్లో ప్రవేశించి 2018 నవంబర్ లో అరెస్ట్ చేయబడిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 20 మంది మత్స్యకారులను స్వదేశానికి తీసుకు వచ్చిన తర్వాత .. వారి జీవనోపాధి కోసం 'ముఖ్యమంత్రి సహాయ నిధి' నుంచి ఒక్కొక్కరికి రూ. 5 లక్షల ఆర్ధిక సాయాన్ని అందించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి