Welcome To GK BITS IN TELUGU Blog
1. 'విదేశాల్లోని భారత పౌరులు' (OCI) గా నమోదు చేసుకోవడానికి సంబంధించి .. సరియైన సమాధానం ?
E & OE (Errors & Omissions Expected)
(ఎ) భారత సంతతికి చెందిన విదేశీయులు
(బి) భారత పౌరుల విదేశీ భాగస్వాములు
(సి) విదేశాల్లోని భారత పౌరుల విదేశీ భాగస్వాములు
(డి) పైవన్నీ
2. 'నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881' (NEGOTIABLE INSTRUMENTS ACT 1881) లోని సెక్షన్ 25 ప్రకారం .. 'జీవిత బీమా సంస్థ' (LIC) కి ప్రతి శనివారం సెలవు దినంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఏ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది ?
(ఎ) 2021 ఏప్రిల్ 12
(బి) 2021 ఏప్రిల్ 13
(సి) 2021 ఏప్రిల్ 14
(డి) 2021 ఏప్రిల్ 15
3. 'ఆధునిక భారతం అంబేద్కర్ చూపు', 'దళితుల చరిత్ర' గ్రంథాల రచయిత ?
(ఎ) డాక్టర్ కత్తి పద్మారావు
(బి) డాక్టర్ షేక్ మస్తాన్
(సి) డాక్టర్ చందు సుబ్బారావు
(డి) నేలపూడి స్టాలిన్ బాబు
4. కేంద్ర ప్రభుత్వం 2021 ఏప్రిల్ 17న విడుదల చేసిన 'పర్యావరణ ముప్పు సూచిక' లో పర్యావరణపరంగా ముప్పు వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో 'ఆంధ్రప్రదేశ్' రాష్ట్రం ఎన్నవ ర్యాంకులో నిలిచింది ? [ఈ సూచికలో 'ఆంధ్రప్రదేశ్' రాష్ట్రానికి 0.510 మార్కులు లభించాయి. అటవీ విస్తీర్ణం తక్కువ, నీటి ద్వారా సోకే జబ్బులు అధికం కావడం రాష్ట్రానికి ప్రతికూల అంశాలుగా నిలిచాయి]
(ఎ) 15
(బి) 16
(సి) 17
(డి) 18
5. 'నాసా' (NASA) నిర్వహించిన 27వ హ్యూమన్ ఎక్సప్లోరేషన్ రోవర్ ఛాలెంజ్ (NASA Human Exploration Rover Challenge) పోటీల్లో ఒడిశాకు చెందిన 'నవోన్మేష్ ప్రసార్ స్టూడెంట్స్ ఆస్ట్రానమీ టీమ్' (నాప్సాట్) హైస్కూల్ విభాగంలో ఎన్నో స్థానంలో నిలిచింది ? [ఈ పోటీల్లో వివిధ దేశాల నుంచి అండర్-19 విభాగంలో 20 బృందాలు పాల్గొన్నాయి]
(ఎ) 4
(బి) 3
(సి) 2
(డి) 1
6. ఏ రాష్ట్రంలోనూ భౌగోళిక సరిహద్దులు ఏ తేదీ వరకు మార్చేందుకు వీల్లేదని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ? [జనగణన పూర్తయ్యేవరకు ఈ నిర్బంధం ఉంటుందని, ప్రస్తుతం 'కొవిడ్' నేపథ్యంలో జనగణన ఎప్పుడుంటుందో నిర్ణయించలేనందున సరిహద్దు మార్పు గడువును పొడిగించారు. గతంలో ఈ నిర్బంధంపై విధించిన గడువు 2021 మార్చ్ 31తో ముగిసింది]
(ఎ) 2021 ఏప్రిల్ 30
(బి) 2021 మే 31
(సి) 2021 జూన్ 30
(డి) 2021 జూలై 31
7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పురపాలక, నగరపాలక సంస్థల్లో పాలకవర్గ మొదటి సమావేశం నిర్వహించిన ఎన్ని రోజుల్లోగా కోఆప్షన్ సభ్యుల (CO OPTION MEMBERS) ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కమిషనర్లకు ప్రభుత్వం సూచించింది ? [నగరపాలక సంస్థల్లో ఐదుగురు చొప్పున, పురపాలక, నగర పంచాయితీలలో ముగ్గురు చొప్పున సభ్యులను ఎన్నుకోవాలి. నగరపాలక సంస్థలో ఎన్నుకోవలసిన ఐదుగురిలో ఇద్దరు మైనారిటీలు, మరో ముగ్గురు పురపాలనపై అవగాహన కలిగిన మాజీ ప్రతినిధులు, విశ్రాంత అధికారులు, ఉద్యోగులై ఉండాలి. పురపాలక, నగర పంచాయతీల్లోని ముగ్గురిలో ఇద్దరు మైనారిటీలు, మరొకరు పురపాలనపై అవగాహన కలిగినవారై ఉండాలని పురపాలక శాఖ పేర్కొంది]
(ఎ) 30
(బి) 60
(సి) 90
(డి) 120
8. కోఆప్షన్ సభ్యుల స్థానాలకు దరఖాస్తు చేసుకునేవారు సంబంధిత నగరపాలక, పురపాలక, నగర పంచాయతీల్లో ఓటరుగా ఉండడంతోపాటు ఎన్ని సంవత్సరాలకు తక్కువ కాకుండా వయసును కలిగి ఉండాలి ?
(ఎ) 18
(బి) 21
(సి) 25
(డి) 30
9. హైదరాబాద్ సమీపంలోని 'పోచంపల్లి' గ్రామంలో "ఆచార్య వినోబాభావే" (ACHARYA VINOBA BHAVE) భూదాన ఉద్యమాన్ని (BHOODAN MOVEMENT) ప్రారంభించిన తేదీ ? [తన భూమిలోంచి 100 ఎకరాలను దానం చేయడానికి స్థానిక భూస్వామి 'వెదిరె రాంచంద్రారెడ్డి' ముందుకొచ్చారు. అప్పటికప్పుడు దానపత్రం రాసి వినోబాభావేకు అందించగా, భూమిలేని పేదలకు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఈ ఉద్యమం దేశవ్యాప్తమైంది]
(ఎ) 1951 ఏప్రిల్ 15
(బి) 1951 ఏప్రిల్ 16
(సి) 1951 ఏప్రిల్ 17
(డి) 1951 ఏప్రిల్ 18
10. 'ఎమిలియా రొమాగ్నా గ్రాండ్ ప్రిక్స్ 2021' (2021 F1 EMILIA ROMAGNA GRAND PRIX) టైటిల్ విజేత ?
(ఎ) లూయిస్ హామిల్టన్
(బి) డానియెల్ రికార్డో
(సి) లాండో నోరిస్
(డి) మాక్స్ వెర్ స్టాపెన్
కీ (KEY) (GK TEST-57 YEAR : 2021)
1) డి 2) డి 3) ఎ 4) సి 5) బి 6) సి 7) బి 8) బి 9) డి 10) డి E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి