ఈ బ్లాగును సెర్చ్ చేయండి

25, ఏప్రిల్ 2021, ఆదివారం

GK TEST-59 YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

Welcome To GK BITS IN TELUGU Blog

1. ఐటీ పరిశ్రమ సంఘం 'నాస్ కామ్' (NASSCOM) 2021-22 సంవత్సరానికి చైర్ పర్సన్ గా నియమితులైన అసెంచర్ ఇండియా సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ? [నాస్ కామ్ 30 ఏళ్ల చరిత్రలో చైర్ పర్సన్ గా ఒక మహిళ బాధ్యతలు చేపట్టడం ఇదే మొదటిసారి. 2021-22 సంవత్సరానికి వైస్ చైర్ పర్సన్ గా 'టీసీఎస్' (TCS) ప్రెసిడెంట్, హెడ్ (బిజినెస్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్) 'కృష్ణన్ రామానుజమ్' నియమితులయ్యారు]      
(ఎ) రోష్నీ నాడార్ 
(బి) రేఖ మేనన్   
(సి) దేవయాని ఘోష్  
(డి) ఇంద్రప్రీత్ సాహ్నీ 

2. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ మేనేజ్మెంట్ పరిశోధనా వర్సిటీలు, బిజినెస్ స్కూల్స్, సంస్థలకు ర్యాంకింగ్ ఇచ్చే 'ది ఎస్ సీ ఎం జర్నల్ లిస్ట్' (The SCM Journal List) ర్యాంకింగ్స్ లో మనదేశానికి సంబంధించిన ఆపరేషన్స్ మేనేజ్మెంట్ పరిశోధనల విశ్వవిద్యాలయాలు, బిజినెస్ స్కూల్స్ లలో 'ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్' (ISB) ఏ స్థానంలో నిలిచింది ? [ప్రపంచస్థాయి 100 సంస్థల్లో 'ఐ ఎస్ బీ' (ISB) 64వ రాంక్ లో నిలిచింది. గత ఐదేళ్ల (2015-20) కాలంలో ప్రముఖ పరిశోధన జర్నల్స్ లో సప్లై చైన్ మేనేజ్మెంట్ కు సంబంధించిన పరిశోధన పేపర్ల ప్రచురణలను పరిగణనలోకి తీసుకుని 'ది ఎస్ సీ ఎం జర్నల్ లిస్ట్' (The SCM Journal List) ర్యాంకులను ప్రకటిస్తుంది]    
(ఎ) 1 
(బి) 2  
(సి) 3  
(డి) 4 

3. కొత్తగా అప్పు కోసం దరఖాస్తు చేసుకునేవారిపై బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు ఒక అవగాహనకు వచ్చేందుకు వీలుగా క్రెడిట్ విజన్ న్యూ టు క్రెడిట్ (NTC) స్కోరు అందుబాటులోకి తెస్తున్నట్లు 'ట్రాన్స్ యూనియన్ సిబిల్' (TransUnion CIBIL) వెల్లడించింది. ఈ స్కోరు ఏ శ్రేణిలో ఉంటుంది ? [ఈ స్కోరు అత్యధిక విలువ ఉంటే తక్కువ రిస్క్ ఉన్నట్లు , స్వల్ప స్కోరు ఉంటే .. రుణగ్రహీత చెల్లింపు జరపలేకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడిస్తుంది. ఈ స్కోరు క్రెడిట్ సంస్థలు, బ్యాంకులు ఉపయోగించుకునేందుకు వీలుంటుంది] 
(ఎ) 1-100  
(బి) 101-200 
(సి) 201-300 
(డి) 301-500 



4. 'కొవాగ్జిన్' టీకా (COVAXIN VACCINE) మూడో దశ క్లినికల్ పరీక్షల రెండో మధ్యంతర పరిశీలన ఫలితాల ప్రకారం .. ఈ టీకా 'తేలికపాటి, మధ్యస్థాయి, తీవ్రమైన కొవిడ్-19 వ్యాధి' పై ఎంత శాతం ప్రభావశీలత కనబరచినట్లు 'భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్' (BHARAT BIOTECH INTERNATIONAL) 2021 ఏప్రిల్ 21న పేర్కొంది ?  
(ఎ) 75% 
(బి) 76%  
(సి) 77% 
(డి) 78% 

5. తిరుమల వేంకటాచలాన్నే ఆంజనేయుడి జన్మస్థలం అంజనాద్రిగా 'తితిదే' (TTD) అధికారికంగా ప్రకటించిన తేదీ ? [చారిత్రక, వాంగ్మయ, భౌగోళిక, శాసనపరమైన ఆధారాలతో ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు పండిత పరిషత్ చైర్మన్, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి 'మురళీధర శర్మ' స్పష్టం చేశారు]  
(ఎ) 2021 ఏప్రిల్ 20   
(బి) 2021 ఏప్రిల్ 21  
(సి) 2021 ఏప్రిల్ 22  
(డి) 2021 ఏప్రిల్ 23 

6. 'వాతావరణ విపత్తును నివారించడం ఎలా ?' (HOW TO AVOID A CLIMATE DISASTER) అనే పుస్తకాన్ని రచించినది ? [మానవాళి అనాలోచిత కార్యక్రమాలతో వాతావరణం ధ్వంసం అయిందని, వీటి దుష్ప్రభావాలతోనే 'కరోనా' వైరస్ వ్యాప్తి చెంది మరణాలు సంభవిస్తున్నాయని ఈ పుస్తంలో రచయిత పేర్కొన్నారు]
(ఎ) బిల్ గేట్స్ 
(బి) వారెన్ బఫెట్ 
(సి) గ్రెటా థన్ బర్గ్ 
(డి) జెఫ్ బెజోస్ 



7. 2021 ఏప్రిల్ 10 నుంచి 2021 ఏప్రిల్ 24 వరకు పోలాండ్ లో జరిగిన 'ప్రపంచ యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్' (2021 AIBA YOUTH WORLD BOXING CHAMPIONSHIP) లో అగ్రస్థానంలో నిలిచిన భారత్ సాధించిన పతకాల వివరాలు ?   
(ఎ) 6 స్వర్ణాలు, 5 కాంస్యాలు 
(బి) 7 స్వర్ణాలు, 4 కాంస్యాలు 
(సి) 8 స్వర్ణాలు, 3 కాంస్యాలు 
(డి) 9 స్వర్ణాలు, 2 కాంస్యాలు 

8. ఇంజినీరింగ్, వృత్తి విద్యా కళాశాలల విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పించేందుకుగానూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 42 కోర్సుల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు ఏ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం 2021 ఏప్రిల్ 23న వర్చువల్ విధానంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ? [దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1.60 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ కోర్సులు చేసే ప్రతి విద్యార్థికీ సంస్థ 100 డాలర్ల బహుమతిని, కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ ను ఇస్తుంది]  
(ఎ) గూగుల్  
(బి) టీసీఎస్   
(సి) మైక్రోసాఫ్ట్ 
(డి) ఇన్ఫోసిస్  

9. భారతదేశ 48వ ప్రధాన న్యాయమూర్తిగా (48TH CHIEF JUSTICE OF INDIA) 2021 ఏప్రిల్ 24న రాష్ట్రపతి భవన్ లోని 'అశోకా హాలు' లో ప్రమాణ స్వీకారం చేసిన తెలుగు వ్యక్తి "జస్టిస్ నూతలపాటి వెంకటరమణ" .. సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా అతనికి ఉన్న అనుభవ కాలం ? [ఇతను కృష్ణా జిల్లా, వీరులపాడు మండలం, 'పొన్నవరం' గ్రామంలో 1957 ఆగస్ట్ 27న జన్మించారు. జస్టిస్ కోకా సుబ్బారావు అనంతరం 55 ఏళ్ల తర్వాత న్యాయవ్యవస్థలో అత్యున్నత బాధ్యతలు చేపట్టిన తెలుగు వ్యక్తిగా కీర్తి గడించారు]
(ఎ) 5 సంవత్సరాల 66 రోజులు  
(బి) 6 సంవత్సరాల 66 రోజులు 
(సి) 7 సంవత్సరాల 66 రోజులు  
(డి) 8 సంవత్సరాల 66 రోజులు  



10. "కష్టకాలం దృఢమైన వ్యక్తులను తయారు చేస్తుంది. అలాంటి దృఢమైన వ్యక్తులు మంచి కాలాన్ని సృష్టించగలుగుతారు" అని మానవ పరిణామ క్రమాన్ని చెప్పిన రచయిత 'మైఖేల్ హాఫ్' ఏ దేశస్థుడు ?  
(ఎ) స్పెయిన్ 
(బి) పోర్చుగల్ 
(సి) ఫ్రాన్స్ 
(డి) అల్జీరియా              

కీ (KEY) (GK TEST-59 YEAR : 2021)
1) బి    2) ఎ    3) బి    4) డి    5) బి    6) ఎ    7) సి    8) సి    9) సి    10) ఎ  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి