Welcome To GK BITS IN TELUGU Blog
వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (YSR RYTHU BHAROSA KENDRAS)
- 2020 మే 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో "వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు" (YSR RYTHU BHAROSA KENDRAS) ను ప్రారంభించారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10,641 'వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు' (YSR RYTHU BHAROSA KENDRAS) ను ఏర్పాటు చేస్తారు.
వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (YSR RYTHU BHAROSA KENDRAS) ద్వారా కలిగే ప్రయోజనాలు :
- నకిలీలకు అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వంచే ధృవీకరించబడిన, కల్తీ లేని నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందిస్తారు.
- భూసార పరీక్షలు, వ్యవసాయానికి అవసరమైన సలహాలు, సూచనలు అందిస్తారు.
- గ్రామ స్థాయిలోనే వ్యవసాయ ధరలు, మార్కెట్ల వివరాలు, వాతావరణ సూచనలు తెలియజేస్తారు.
- ఈ-పంట నమోదుతో పంట రుణాలు, బీమా రిజిస్ట్రేషన్ .. వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
- రైతులకు కనీస గిట్టుబాటు ధరలు లభించని పక్షంలో, ఈ కేంద్రాల (YSR RBKs) ద్వారా కనీస గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి