ఈ బ్లాగును సెర్చ్ చేయండి

17, ఏప్రిల్ 2021, శనివారం

GK TEST-55 YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

Welcome To GK BITS IN TELUGU Blog

1. బెంగళూరుకు చెందిన శంకర క్యాన్సర్ ఆసుపత్రి సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో 'ప్రపంచస్థాయి క్యాన్సర్ కేర్ ఆసుపత్రి' (బగ్చి-శంకర క్యాన్సర్ కేర్ ఆసుపత్రి) ని ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు ? [ఈ ఆసుపత్రి నిర్మాణానికి 'శుభ్రత్ బగ్చి' , ఆయన భార్య 'సుస్మిత బగ్చి' లు రూ. 340 కోట్లను విరాళంగా ప్రకటించారు. 2024 నాటికి ఇది ప్రారంభం కానుంది]   
(ఎ) ముంబయి  
(బి) బెంగళూరు  
(సి) భువనేశ్వర్  
(డి) బికనీర్ 

2. తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి నెలకు ఎంత మొత్తం చొప్పున ఆర్ధిక సాయం చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ? 
(ఎ) రూ. 1,000 
(బి) రూ. 2,000  
(సి) రూ. 3,000  
(డి) రూ. 4,000 

3. 'అగస్టా జాతీయ ఛాంపియన్షిప్-2021' (AUGUSTA NATIONAL CHAMPIONSHIP-2021) లో విజేతగా నిలిచిన 29 ఏళ్ల గోల్ఫ్ క్రీడాకారుడు "హిడెకి మత్సుయామ' ది ఏ దేశం ? [ఆ దేశం తరపున తొలి పురుషుల మాస్టర్స్ ఛాంపియన్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఆసియాలో జన్మించి మాస్టర్స్ టైటిల్ నెగ్గిన మొదటి క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు]  
(ఎ) చైనా  
(బి) జార్జియా  
(సి) జపాన్ 
(డి) మలేషియా 



4. భారత 24వ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) గా "సుశీల్ చంద్ర" బాధ్యతలు స్వీకరించిన తేదీ ? [2019 ఫిబ్రవరి 14న 'సుశీల్ చంద్ర 'ఎన్నికల సంఘం' కమిషనర్' గా నియమితులయ్యారు. 'సీఈసీ' (CEC) గా 2022 మే 14 వరకు కొనసాగుతారు. ప్రస్తుతం 'రాజీవ్ కుమార్' ఎన్నికల కమిషనర్ గా కొనసాగుతారు] 
(ఎ) 2021 ఏప్రిల్ 10 
(బి) 2021 ఏప్రిల్ 11 
(సి) 2021 ఏప్రిల్ 12 
(డి) 2021 ఏప్రిల్ 13 

5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లకు అందిస్తున్న విశిష్ట సేవా పురస్కారాల ప్రధాన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' 2021 ఏప్రిల్ 12న కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఎక్కడ ప్రారంభించారు ? [వాలంటీర్లలో 2,18,000 మందికి 'సేవా మిత్ర' (నగదు : రూ. 10 వేలు), 4,000 మందికి 'సేవా రత్న' (నగదు : రూ. 20 వేలు), 875 మందికి 'సేవా వజ్ర' (నగదు : రూ. 30 వేలు) పురస్కారాలను ప్రకటించారు. నగదు పురస్కారంతో పాటు ధ్రువపత్రం, శాలువా, బ్యాడ్జి ఇచ్చి ప్రోత్సహిస్తారు] 
(ఎ) కానూరు   
(బి) యనమలకుదురు  
(సి) తాడిగడప  
(డి) పోరంకి 

6. 'సోవియట్ యూనియన్' వ్యోమగామి "యూరి గగారిన్" (YURI GAGARIN) అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మానవుడిగా చరిత్ర సృష్టించిన తేదీ ? ['వోస్తోక్-1' వ్యోమనౌకలో 108 నిమిషాల పాటు 'యూరి గగారిన్' యాత్ర సాగింది. ఈ క్రమంలో ఆయన ఒకసారి భూమిని చుట్టివచ్చారు. అతను అదే తేదీన 'సారాతోవ్' ప్రాంతంలో 'వోల్గా' నది పక్కన సురక్షితంగా భూమి మీదకు దిగారు. ఏడేళ్ల తర్వాత 1968 మార్చ్ 27న ఒక విమాన ప్రమాదంలో 'యూరి గగారిన్' చనిపోయారు]  
(ఎ) 1961 ఏప్రిల్ 12 
(బి) 1961 ఏప్రిల్ 13 
(సి) 1961 ఏప్రిల్ 14 
(డి) 1961 ఏప్రిల్ 15 



7. 1957 అక్టోబర్ 4న "స్పుత్నిక్" (SPUTNIK 1) రూపంలో ప్రపంచ తొలి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపిన దేశం ?  
(ఎ) అమెరికా 
(బి) రష్యా 
(సి) సోవియట్ యూనియన్ 
(డి) ఫ్రాన్స్ 

8. 'కొవిడ్-19' వ్యాధి నిరోధానికి మన దేశంలో 'స్పుత్నిక్ వి' టీకా (SPUTNIK V VACCINE) కు 'డీ సీ జీ ఐ' (DCGI) అత్యవసర వినియోగ అనుమతిని ఇచ్చిన తేదీ ? [దీంతో మనదేశంలో మూడో టీకా అనుమతి పొందినట్లు అయింది. 'స్పుత్నిక్ వి' టీకాను ఆవిష్కరించిన 'ఆర్ డీ ఐ ఎఫ్' (RDIF) (రష్యా) తో మనదేశానికి చెందిన 'డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్' గత ఏడాది సెప్టెంబర్ లో ఒప్పందం కుదుర్చుకుంది. జలుబు (COMMON COLD) రావడానికి కారణమయ్యే రెండు అడెనోవైరస్ (AD26, AD5) లను, సార్స్-కోవ్-2 వైరస్ స్పైక్ ప్రోటీన్ తో కలిపి 'స్పుత్నిక్ వి' టీకా (SPUTNIK V VACCINE) ను తయారు చేశారు]     
(ఎ) 2021 ఏప్రిల్ 11   
(బి) 2021 ఏప్రిల్ 12  
(సి) 2021 ఏప్రిల్ 13 
(డి) 2021 ఏప్రిల్ 14  

9. విజయవాడ డివిజన్ (నూజివీడు రైల్వే స్టేషన్) నుంచి దిల్లీకి మామిడి ఎగుమతులతో తొలి కిసాన్ రైలు ప్రారంభమైన తేదీ ? [రైల్వే శాఖ సరకు రవాణాపై 50 శాతం రాయితీ ఇస్తుండడంతో వ్యాపారులు, రైతులు ఈ రైళ్లవైపే మొగ్గు చూపుతున్నారు]
(ఎ) 2021 ఏప్రిల్ 8 
(బి) 2021 ఏప్రిల్ 9 
(సి) 2021 ఏప్రిల్ 10  
(డి) 2021 ఏప్రిల్ 11  



10. భారతదేశ వ్యాప్తంగా 'కొవిడ్-19' నియంత్రణలో భాగంగా "టీకా ఉత్సవ్" (COVID VACCINATION DRIVE) ను నిర్వహించిన తేదీలు ? 
(ఎ) 2021 ఏప్రిల్ 10 నుండి 2021 ఏప్రిల్ 13 వరకు  
(బి) 2021 ఏప్రిల్ 11 నుండి 2021 ఏప్రిల్ 14 వరకు 
(సి) 2021 ఏప్రిల్ 12 నుండి 2021 ఏప్రిల్ 15 వరకు 
(డి) 2021 ఏప్రిల్ 13 నుండి 2021 ఏప్రిల్ 16 వరకు              

కీ (KEY) (GK TEST-55 YEAR : 2021)
1) సి    2) బి    3) సి    4) డి    5) డి    6) ఎ    7) సి    8) బి    9) డి    10) బి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి