ఈ బ్లాగును సెర్చ్ చేయండి

5, ఏప్రిల్ 2021, సోమవారం

GK TEST-52 YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

Welcome To GK BITS IN TELUGU Blog

1. కాలుష్య ఉద్గారాల కట్టడికి సంబంధించి 'కేంద్ర పర్యావరణ శాఖ' నిర్దేశించిన నూతన ప్రమాణాలను అందుకునేందుకు 'జాతీయ రాజధాని ప్రాంతానికి (NCR) 10 కి.మీ.ల పరిధిలో, 10 లక్షల జనాభా దాటిన నగరాల్లో 'థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలు' (TPP) ఏ తేదీ నాటికి లక్ష్యాలను చేరుకోవాల్సి ఉంటుంది ?  
(ఎ) 2022 డిసెంబర్ 31 
(బి) 2023 డిసెంబర్ 31  
(సి) 2024 డిసెంబర్ 31  
(డి) 2025 డిసెంబర్ 31 

2. ఐదేళ్ల కాలంలో జాతీయ వాయు నాణ్యత ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైన 'నాన్-ఎటైన్ మెంట్' నగరాలు, తీవ్రంగా కాలుష్య సమస్యను ఎదుర్కొంటున్న ప్రాంతాలకు 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న 'టీపీపీ' (TPP) లు కాలుష్య ఉద్గారాల కట్టడికి సంబంధించి 'కేంద్ర పర్యావరణ శాఖ' నిర్దేశించిన నూతన ప్రమాణాలను ఏ తేదీలోగా అందుకోవాల్సి ఉంటుంది ? [దేశంలో 'నాన్-ఎటైన్ మెంట్' నగరాలు 124 ఉన్నాయి. 2025 డిసెంబర్ 31లోగా మూసేసే కర్మాగారాలు ఈ నిబంధనలను అమలు చేయాల్సిన అవసరం లేదు]    
(ఎ) 2022 డిసెంబర్ 31 
(బి) 2023 డిసెంబర్ 31  
(సి) 2024 డిసెంబర్ 31  
(డి) 2025 డిసెంబర్ 31 

3. తెలుగు భాషకు దూరమవుతున్న నేటి యువత కోసం తెలుగు భాషలో రాయబడిన "భారతీయం నాడు-నేడు" అనే పుస్తక రచయిత ? [2021 ఏప్రిల్ 2న విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి 'జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్' ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు]  
(ఎ) గొర్లె చక్రపాణి  
(బి) గొర్లె సూర్యనారాయణ 
(సి) దామెర వెంకట సూర్యారావు 
(డి) రాళ్లపల్లి వేంకటరమణమూర్తి  



4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో తొలి సమావేశాలు మొదలైన తేదీ ? 
(ఎ) 2021 ఏప్రిల్ 1 
(బి) 2021 ఏప్రిల్ 2 
(సి) 2021 ఏప్రిల్ 3 
(డి) 2021 ఏప్రిల్ 4 

5. ప్రస్తుతం గడువు ముగియటానికి నెల ముందు, లేదా గడువు తీరిన నెల తరువాత మాత్రమే అపరాధ రుసుం లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ (DRIVING LICENSE) ను  పునరుద్ధరించుకునే వెసులుబాటు ఉంది. ఆ గడువును తాజాగా 'కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ' ఎన్నాళ్లకు పెంచింది ? [వాణిజ్య వాహనాల పర్మిట్ ల పునరుద్ధరణకు ప్రస్తుతం ఉన్న 30 రోజుల గడువును 60 రోజులకు పెంచింది]  
(ఎ) 2 నెలలు    
(బి) 3 నెలలు  
(సి) 6 నెలలు  
(డి) 12 నెలలు 

6. 'అరుదైన వ్యాధుల జాతీయ విధానం-2021' (NATIONAL POLICY FOR RARE DISEASES-2021) ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి 'హర్షవర్ధన్' దిల్లీలో ఆవిష్కరించిన తేదీ ? [ఈ వ్యాధుల చికిత్సకయ్యే అధిక వ్యయాలను తగ్గించడం, దేశంలోనే పరిశోధనలు జరిపి, మందులు తయారు చేయడం ఈ విధానం ప్రధాన ఉద్దేశ్యాలు. వ్యాధిగ్రస్థులకు 'రాష్ట్రీయ ఆరోగ్య నిధి' కింద రూ. 20 లక్షల వరకు సహాయం అందిస్తారు. ఇది పేదలకే పరిమితం కాకుండా 'పీఎం జన్ ఆరోగ్య యోజన' కింద నమోదయిన వారందరికీ (40% జనాభాకు) వర్తిస్తుంది]
(ఎ) 2021 ఏప్రిల్ 1 
(బి) 2021 ఏప్రిల్ 2 
(సి) 2021 ఏప్రిల్ 3 
(డి) 2021 ఏప్రిల్ 4 



7. 'జాతీయ బేస్ బాల్ ఛాంపియన్షిప్' (34TH SENIOR NATIONAL BASEBALL CHAMPIONSHIP) పురుషుల విభాగంలో విజేత అయిన జట్టు ? [కర్నూలు జిల్లా నంద్యాలలో 2021 ఏప్రిల్ 3న ఈ టోర్నీ ముగిసింది] 
(ఎ) తెలంగాణ 
(బి) దిల్లీ  
(సి) మహారాష్ట్ర 
(డి) కేరళ 

8. 'జాతీయ బేస్ బాల్ ఛాంపియన్షిప్' (34TH SENIOR NATIONAL BASEBALL CHAMPIONSHIP) మహిళల విభాగంలో విజేత అయిన జట్టు ? [కర్నూలు జిల్లా నంద్యాలలో 2021 ఏప్రిల్ 3న ఈ టోర్నీ ముగిసింది] 
(ఎ) తెలంగాణ 
(బి) దిల్లీ  
(సి) మహారాష్ట్ర 
(డి) కేరళ  

9. 1930 మార్చ్ 12న సబర్మతి ఆశ్రమంలో 'ఉప్పు సత్యాగ్రహ యాత్ర' (SALT SATYAGRAHA AND DANDI MARCH) ను ప్రారంభించిన మహాత్మా గాంధీ .. ఏ తేదీన అరేబియా సముద్ర తీరంలోని 'దండి' లో పిడికెడు ఉప్పును చేతిలోకి తీసుకుని .. బ్రిటిష్ చట్టాలను ఉల్లంఘిస్తున్నట్లు సగర్వంగా ప్రకటించారు ? 
(ఎ) 1930 ఏప్రిల్ 6 
(బి) 1930 ఏప్రిల్ 7 
(సి) 1930 ఏప్రిల్ 8  
(డి) 1930 ఏప్రిల్ 9  



10. వన్డే క్రికెట్లో (ONE DAY CRICKET) వరుసగా 22వ వన్డే గెలిచి .. రికీ పాంటింగ్ (21 విజయాలు, 2003) సారధ్యంలోని ఆస్ట్రేలియా జట్టు పేరిట ఉన్న రికార్డును అధిగమించి .. ఆస్ట్రేలియా మహిళల జట్టు ప్రపంచ రికార్డు నెలకొల్పిన తేదీ ? [న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో ఈ రికార్డును నెలకొల్పడం జరిగింది. 2017 అక్టోబర్ నుంచి ఆస్ట్రేలియా (AUSTRALIA) వన్డే మ్యాచ్ ఓడిపోలేదు]   
(ఎ) 2021 ఏప్రిల్ 1 
(బి) 2021 ఏప్రిల్ 2 
(సి) 2021 ఏప్రిల్ 3 
(డి) 2021 ఏప్రిల్ 4              

కీ (KEY) (GK TEST-52 YEAR : 2021)
1) ఎ    2) బి    3) బి    4) సి    5) డి    6) సి    7) ఎ    8) డి    9) ఎ    10) డి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి