Welcome To GK BITS IN TELUGU Blog
జగనన్న జీవ క్రాంతి (JAGANANNA JEEVA KRANTHI)
- 2020 డిసెంబర్ 10న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో "జగనన్న జీవ క్రాంతి" (JAGANANNA JEEVA KRANTHI) పథకాన్ని ప్రారంభించారు.
- మహిళలకు మెరుగైన జీవనోపాధి తద్వారా సుస్థిర ఆదాయం లక్ష్యంగా .. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ. 1,869 కోట్ల వ్యయంతో 2,49,151 గొర్రెలు / మేకల యూనిట్ల పంపిణీకి ప్రభుత్వం 2020 డిసెంబర్ 10న శ్రీకారం చుట్టింది.
- ఒక్కొక్క యూనిట్ లో 5-6 నెలల వయస్సు గల 14 గొర్రె పిల్లలు / మేక పిల్లలతో పాటు ఒక యవ్వనపు పొట్టేలు / మేకపోతు ను పంపిణీ చేస్తారు.
- "జగనన్న జీవ క్రాంతి" (JAGANANNA JEEVA KRANTHI) పథకంలో మహిళలకు గొర్రెలు / మేకల కొనుగోలుతో పాటు, రవాణా, ఇన్సూరెన్స్ ఖర్చులకు గాను 'వైఎస్సార్ చేయూత' (YSR CHEYUTHA) క్రింద యూనిట్ కు రూ. 75 వేలు ఆర్ధిక సాయం ఉచితంగా అందజేస్తారు.
- గొర్రెలు / మేకల కొనుగోలులో మహిళలదే తుది నిర్ణయం.
- "జగనన్న జీవ క్రాంతి" (JAGANANNA JEEVA KRANTHI) పథకం కింద గొర్రెలు / మేకల పెంపకం కొరకు 'సెర్ప్' (SERP) కు ఆప్షన్ ఇచ్చిన మహిళలకు, స్థానిక జాతులలో నచ్చిన గొర్రెలు / మేకలను, నచ్చిన ప్రాంతం నుండి కొనుగోలు చేసుకొనే వెసులుబాటు ఉంటుంది.
- సరైన గొర్రెలు / మేకలను ఎంపిక చేసుకొని సరైన ధరకు కొనుగోలు చేసే విషయంలో మహిళలకు .. ఇద్దరు పశు వైద్యులు, సెర్ప్, బ్యాంకు ప్రతినిధులు, సంబంధిత లబ్దిదారునితో కూడిన 'మండల స్థాయి కొనుగోలు కమిటీలు' లబ్ధిదారులకు మార్గ నిర్దేశం చేస్తాయి.
- మహిళలు పెంచిన గొర్రెలు / మేకలను అమ్ముకోడానికి మార్కెటింగ్ సౌకర్యాలు పెంచి తద్వారా మంచి లాభాలు పొందే విధంగా 'అల్లానా ఫుడ్స్' తో ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నది.
| మొదటి విడత (మార్చ్ 2021 వరకు) | రెండవ విడత (2021 ఏప్రిల్ నుండి 2021 ఆగస్ట్ వరకు) | మూడవ విడత (2021 సెప్టెంబర్ నుండి 2021 డిసెంబర్ వరకు) |
|---|---|---|
| 20,000 యూనిట్లు | 1,30,000 యూనిట్లు | 99,151 యూనిట్లు |
'వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు' (YSR RBKs) ద్వారా .. :
- నట్టల నివారణ, వ్యాధి నిరోధక టీకాలు, బాహ్య పరాన్నజీవుల నిర్మూలన, పశు ఆరోగ్య సంరక్షణ కార్డులను జారీ చేస్తారు.
- పశుసంవర్ధక సహాయకులు, పారా స్టాఫ్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ల ద్వారా వైద్య సేవలు అందిస్తారు.
- సమతుల్య దాణా, ఖనిజ లవణ మిశ్రమం సరఫరా చేస్తారు.
- "వైఎస్సార్ సన్న జీవాల నష్ట పరిహార పథకం" ను అమలు చేస్తారు.
- 'పశు కిసాన్ క్రెడిట్ కార్డు' లను జారీ చేస్తారు.
- గొర్రెలు / మేకల పెంపకందారులకు ఆధునిక పోషణ మరియు యాజమాన్య పద్ధతులపై 'పశు విజ్ఞాన బడి' ద్వారా శిక్షణ ఇస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి