Welcome To GK BITS IN TELUGU Blog
జగనన్న తోడు (JAGANANNA THODU)
- నిరుపేద చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారి ఆర్ధిక అవసరాలు తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం "జగనన్న తోడు" (JAGANANNA THODU) పథకాన్ని ప్రవేశపెట్టింది.
ప్రారంభం :
- 2020 నవంబర్ 25న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వీడియో సమావేశం ద్వారా "జగనన్న తోడు" (JAGANANNA THODU) పథకాన్ని ప్రారంభించారు.
అర్హులు :
- గ్రామాలు, పట్టణాల్లో సుమారు 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు లేదా అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేసే పేదవారు.
- రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడిపేవారు.
- రోడ్డు పక్కన, ఫుట్ పాత్ ల పైన, ప్రజా, ప్రైవేట్ స్థలాల్లో తోపుడు బండ్లపై కూరగాయలు, పండ్లు, ఆహార పదార్ధాలు, చేనేత, హస్తకళా వస్తువులు అమ్ముకుంటూ వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులు.
- తలమీద గంపలో వస్తువులు మోస్తూ అమ్ముకునేవారు.
- సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునే పేదవారు.
- సాంప్రదాయ వృత్తిదారులైన లేసు తయారీదారులు, కలంకారీ కళాకారులు, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మల తయారీదారులు, తోలు బొమ్మల తయారీదారులు, కుండలు, బొబ్బిలి వీణలు, ఇత్తడి సామగ్రి తయారీదారులు.
ప్రయోజనాలు :
- చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారి పెట్టుబడి అవసరాల కోసం రూ. 10 వేల వరకు బ్యాంకుల ద్వారా ప్రభుత్వమే వడ్డీ కడుతూ సున్నా వడ్డీ రుణాలు అందిస్తారు.
- లబ్ధిదారులు బ్యాంకులకు కట్టిన వడ్డీ మొత్తాన్ని ప్రతి త్రైమాసికానికి (మూడు నెలలకోసారి) నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా ప్రభుత్వమే చెల్లిస్తుంది.
- సంవత్సరం పాటు ఈ రుణాలు ఇవ్వడం జరుగుతుంది. రుణం తీరిన తర్వాత లబ్ధిదారులు మళ్లీ వడ్డీ లేని రుణం పొందవచ్చు.
- బ్యాంకర్లతో సమన్వయం కోసం చిరువ్యాపారులందరికీ స్మార్ట్ కార్డులను జారీ చేస్తారు.
పర్యవేక్షణ :
- "జగనన్న తోడు" (JAGANANNA THODU) పథకాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా www.gramawardsachivalayam.ap.gov.in పోర్టల్ ను ఏర్పాటు చేస్తారు.
టోల్ ఫ్రీ నంబర్ (TOLL-FREE NUMBER) :
- అర్హత ఉండి జాబితాలో పేరు లేనివారు 'సహాయం, ఫిర్యాదులు' కొరకు టోల్ ఫ్రీ నంబర్ "1902" కి కాల్ చేయొచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి