Welcome To GK BITS IN TELUGU Blog
వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం (YSR ZERO INTEREST CROP LOANS SCHEME)
- 2020 నవంబర్ 17న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో "వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం" (YSR ZERO INTEREST CROP LOANS SCHEME) ను ప్రారంభించారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సకాలంలో పంట రుణాలు చెల్లించిన 14.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో, 2019 ఖరీఫ్ పంటకు సంబంధించి రూ. 510 కోట్ల వడ్డీ రాయితీని 2020 నవంబర్ 17న ప్రభుత్వం జమ చేసింది.
- పెట్టుబడి ఖర్చు తగ్గిస్తూ, రైతన్నలకు ఆర్ధిక వెసులుబాటు కలిగించడమే "వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం" (YSR ZERO INTEREST CROP LOANS SCHEME) యొక్క లక్ష్యం.
- రూ. లక్ష వరకు పంట రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన రైతులందరికీ "వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం" (YSR ZERO INTEREST CROP LOANS SCHEME) కింద పూర్తి వడ్డీ రాయితీ లభిస్తుంది.
- ఈ-క్రాప్ డేటా ఆధారంగా రైతులకు సకాలంలో పంట రుణాలు అందించి .. నిర్ణీత వ్యవధిలో రుణాలు తిరిగి చెల్లించేలా ప్రోత్సహిస్తారు.
- వడ్డీ లేని రుణాలు పొందడానికి 'రైతు భరోసా కేంద్రాలలో' (YSR RBKs) సంప్రదించవచ్చు.
టోల్ ఫ్రీ నంబర్ (TOLL-FREE NUMBER) :
- 'వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం' (YSR ZERO INTEREST CROP LOANS SCHEME) పథకానికి సంబంధించి .. 'సహాయం మరియు ఫిర్యాదులు' కొరకు టోల్ ఫ్రీ నంబర్ "155251" లో సంప్రదించవచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి