ఈ బ్లాగును సెర్చ్ చేయండి

7, ఏప్రిల్ 2021, బుధవారం

AP-AMUL PROJECT IN TELUGU

Welcome To GK BITS IN TELUGU Blog

ఏ.పి. - అమూల్ పాల వెల్లువ (AP-AMUL PROJECT)


  • 2020 డిసెంబర్ 2న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో "ఏ.పి. - పాల వెల్లువ" (AP-AMUL PROJECT) ప్రాజెక్ట్ ను ప్రారంభించారు.
  • "ఏ.పి. - పాల వెల్లువ" (AP-AMUL PROJECT) ప్రాజెక్ట్ లో భాగంగా 9,899 గ్రామాల్లో 'అమూల్' (AMUL) భాగస్వామ్యంతో మహిళా పాల రైతుల సహకార సంఘాలను ఏర్పాటు చేస్తారు.
  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో రూ. 6,551 కోట్ల వ్యయంతో ఆటోమేటెడ్ పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు.
  • మొదటి దశలో 'పైలట్ ప్రాజెక్ట్' కింద 'ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్ కడప' జిల్లాల్లోని 400 గ్రామాలలో 2020 డిసెంబర్ 2న "ఏ.పి. - పాల వెల్లువ" (AP-AMUL PROJECT) ప్రాజెక్ట్ ను మొదలు పెట్టారు.   
  • రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు.
  • 'అమూల్' (AMUL) భాగస్వామ్యంతో పాల సేకరణ ద్వారా పాడి రైతులకు పాల నాణ్యత, వెన్న శాతం ఆధారంగా .. ప్రతి లీటర్ పాలపై మిగిలిన ప్రైవేటు డెయిరీలతో పోల్చితే సగటున రూ. 5 నుండి రూ. 7 ల అదనపు ఆదాయం లభిస్తుంది.
  • ప్రతి పది రోజులకోసారి పాల బిల్లులు నేరుగా మహిళా పాడి రైతుల ఖాతాలలోకి చెల్లింపులు జరుగుతాయి. 
  • పాల ఉత్పత్తిదారులకు గిట్టుబాటు ధర కల్పించడం, వినియోగదారుడు ఖర్చు చేసే ప్రతి పైసాకు విలువ చేకూరే విధంగా నాణ్యమైన పాలు, పాల పదార్ధాలు అందుబాటులో ఉంచడమే "ఏ.పి. - పాల వెల్లువ" (AP-AMUL PROJECT) ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం.
  • 'వైఎస్సార్ చేయూత' (YSR CHEYUTHA) ద్వారా మూడు విడతల్లో రూ. 3,517.43 కోట్ల వ్యయంతో 4.69 లక్షల మంది 'ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ' మహిళలకు పాడి పశువులను పంపిణీ చేస్తారు.    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి