ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, ఏప్రిల్ 2021, శనివారం

GK TEST-51 YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

Welcome To GK BITS IN TELUGU Blog

1. 'ప్రపంచ ఆర్ధిక వేదిక' (WEF) 156 దేశాల్లో అధ్యయనం చేసి రూపొందించిన "లింగ సమానత్వ నివేదిక-2021" (GLOBAL GENDER GAP REPORT-2021) ప్రకారం .. 'స్త్రీ, పురుష సమానత్వం' లో "ఐస్ ల్యాండ్" (ICELAND) అగ్రస్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో నిలవడం 'ఐస్ ల్యాండ్' కు వరుసగా ఇది ఎన్నోసారి ? [తర్వాతి స్థానాల్లో 'ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, రువాండా, స్వీడన్, ఐర్లాండ్, స్విట్జర్లాండ్' లు ఉన్నాయి]  
(ఎ) 11 
(బి) 12  
(సి) 13  
(డి) 14 

2. 2019వ సంవత్సరానికి తమిళ సినీ సూపర్ స్టార్ "రజనీకాంత్" ను వరించిన 'దాదాసాహెబ్ ఫాల్కే' అవార్డు (DADA SAHEB PHALKE AWARD) మొత్తమ్మీద ఎన్నోది ? [ఈ అవార్డు ప్రదానం 2021 మే 3న జరుగుతుంది. రజనీకాంత్ అసలు పేరు 'శివాజీరావ్ గైక్వాడ్']    
(ఎ) 51 
(బి) 52  
(సి) 53  
(డి) 54 

3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ రూపొందించిన 'సచివాలయ వాక్సినేషన్ డ్రైవ్' యాప్ ను ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' ఆవిష్కరించిన తేదీ ? [ఈ రోజున ముఖ్యమంత్రి జగన్ దంపతులకు కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసును గుంటూరులోని 140వ వార్డు (భారత్ పేట) పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ జయసాయి పుష్యమి అందించారు]  
(ఎ) 2021 మార్చ్ 30  
(బి) 2021 మార్చ్ 31 
(సి) 2021 ఏప్రిల్ 1 
(డి) 2021 ఏప్రిల్ 2 



4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ. 167 కోట్లతో 'బహువార్షిక పశుగ్రాసాల అభివృద్ధి పథకాన్ని' 2021 ఏప్రిల్ 1న శ్రీకాకుళం జిల్లాలోని 'పలాస-కాశీబుగ్గ' లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించినది ? [ఈ పథకం కింద 20వేల ఎకరాల్లో 140 లక్షల టన్నుల పశుగ్రాసం ఉత్పత్తి చేస్తారు] 
(ఎ) డాక్టర్ పూనం మాలకొండయ్య 
(బి) డాక్టర్ సీదిరి అప్పలరాజు 
(సి) డాక్టర్ అమరేంద్ర 
(డి) డాక్టర్ ఈశ్వరరావు 

5. విజయవాడలోని 'ఏపీటీఎస్' (APTS) కార్యాలయంలో "ఆంగ్లోదయం" (ANGLODAYAM) కార్యక్రమాన్ని 2021 ఏప్రిల్ 1న ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి ? [రాష్ట్రంలోని 158 గిరిజన, 52 సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 'రీడ్ టు మీ' (ReadToMe) ప్రాజెక్ట్ కింద 'ఆంగ్లోదయం' ను అమలు చేస్తారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు డిజిటల్ మీడియంలోకి ప్రవేశించడానికి 'ఆంగ్లోదయం' ఉపయుక్తంగా ఉంటుంది] 
(ఎ) మేకతోటి సుచరిత   
(బి) మేకపాటి గౌతమ్ రెడ్డి  
(సి) బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  
(డి) డాక్టర్ సీదిరి అప్పలరాజు 

6. విదేశీ నిపుణులకు, ముఖ్యంగా 'హెచ్-1బీ' వీసాల (H-1B VISA) జారీకి పరిమితులు విధిస్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' జారీ చేసిన నిషేధాజ్ఞలు ఏ తేదీతో ముగిశాయి ? [వీటిని పొడిగించేందుకు ప్రస్తుత అధ్యక్షుడు 'జో బైడెన్' ఆసక్తి చూపలేదు. దీంతో భారతీయ 'ఐటీ' (IT) నిపుణులకు భారీగా లబ్ది చేకూరనుంది] 
(ఎ) 2021 మార్చ్ 30 
(బి) 2021 మార్చ్ 31 
(సి) 2021 ఏప్రిల్ 1 
(డి) 2021 ఏప్రిల్ 2 



7. 'నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్' (NSE) తన నిఫ్టీ-50పై డెరివేటివ్ కాంట్రాక్ట్ ల మార్కెట్ లాట్ పరిమాణాన్ని ప్రస్తుతం ఉన్న 75 నుంచి ఎంతకు తగ్గించింది ? [ప్రస్తుతం ట్రేడర్లు ఒక లాట్ పై ట్రేడింగ్ చేయడానికి దాదాపుగా రూ. 1,73,000 అవసరమవుతున్నాయి. ప్రస్తుత నిఫ్టీ ధరలను లెక్కలోకి తీసుకుంటే 2021 జూలై నుంచి ఈ మార్జిన్ దాదాపు రూ. 1,16,000 కు తగ్గొచ్చు] 
(ఎ) 70 
(బి) 60 
(సి) 50 
(డి) 40 

8. 2021 ఏప్రిల్ 1న వెలువడిన ఉత్తర్వులు ప్రకారం .. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5 కార్యదర్శులకు సాధారణ సెలవు మంజూరు అధికారం ఎవరికి కల్పించారు ? ['ఐచ్ఛిక సెలవు, ప్రత్యేక సాధారణ సెలవు, ప్రసూతి, పితృత్వ, ఎర్న్డ్, సగం జీతం, అసాధారణ, విద్యా, సరెండర్, ప్రత్యేక దివ్యాంగ సెలవు' ల మంజూరు అధికారాన్ని 'ఎంపీడీవో' (MPDO) లు, 'డీడీవో' (DDO) లకు కల్పించారు]     
(ఎ) సర్పంచ్  
(బి) ఉప సర్పంచ్  
(సి) వీఆర్ఓ 
(డి) పంచాయతీ కార్యదర్శి  

9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో 'షియర్ వాల్' సాంకేతికత (SHEAR WALL TECHNOLOGY) తో జీ+3 అపార్ట్మెంట్ (G+3 APARTMENT) తరహాలో నిర్మించిన 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 1,43,600 ఇళ్లను 'ఒక్క రూపాయి' కే (ONE RUPEE ONLY) లబ్ధిదారులకు అందించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన తేదీ ? [365 చదరపు అడుగుల ఇంటికి రూ. 50 వేలు, 430 చదరపు అడుగుల ఇంటికి రూ. లక్ష తమ వాటాగా లబ్ధిదారులు చెల్లించాల్సి ఉండగా ఇందులో 50 శాతం రాయితీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇప్పటివరకు 'టిడ్కో కాలనీలు' గా (TIDCO COLONIES) ఉన్న పథకం పేరును 'ప్రధానమంత్రి ఆవాస్ యోజన-వైఎస్సార్ జగనన్న నగర్' గా మార్పు చేస్తున్నారు]  
(ఎ) 2021 మార్చ్ 21 
(బి) 2021 మార్చ్ 22 
(సి) 2021 మార్చ్ 23  
(డి) 2021 మార్చ్ 24  



10. తాగునీటి సరఫరా ప్రాంతాల సమీపంలో .. ఎన్ని మీటర్ల వరకు బోర్లు, బావుల తవ్వకానికి అనుమతించకూడదని 2021 మార్చ్ 23న జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది ? [ఆయకట్టేతర ప్రాంతాల్లో 100-150 మీటర్ల దూరం పాటించాలని సూచించింది. బావులకైతే 50-75 మీటర్ల దూరం ఉండాలంది. ఆయకట్టు ప్రాంతాల్లో బోర్ల మధ్య నీటి ప్రవాహ వేగానికి అనుగుణంగా 50-100 మీటర్ల దూరం పాటించాలి. బావుల మధ్య దూరం 30-50 మీటర్లు ఉండాలి. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కఠిన రాతినేలల్లో .. నేల పరిస్థితులకు అనుగుణంగా 200 మీటర్ల వరకు, కృష్ణా, గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 150 మీటర్ల లోతు వరకూ బోర్లు వేసుకోవచ్చు]  
(ఎ) 100  
(బి) 150 
(సి) 200 
(డి) 250              

కీ (KEY) (GK TEST-51 YEAR : 2021)
1) బి    2) ఎ    3) సి    4) బి    5) బి    6) బి    7) సి    8) ఎ    9) సి    10) డి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి