ఈ బ్లాగును సెర్చ్ చేయండి

6, ఏప్రిల్ 2021, మంగళవారం

ABHAYAM APP - ANDHRA PRADESH GOVT. IN TELUGU

Welcome To GK BITS IN TELUGU Blog

"అభయం" యాప్ (ABHAYAM APP)


  • 2020 నవంబర్ 23న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 'వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి' తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో "అభయం" (ABHAYAM) ప్రాజెక్ట్ ను ప్రారంభించారు.
  • ఆటోలు, టాక్సీల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలు, పిల్లల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "అభయం" (ABHAYAM) ప్రాజెక్ట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికోసం రూపొందించిన 'అభయం' యాప్ (ABHAYAM APP) ద్వారా గానీ, ఆటోలో ఏర్పాటు చేసే 'ఐఓటీ' (IOT) పరికరంపై ఉండే బటన్ నొక్కడం ద్వారా గానీ రక్షణ పొందవచ్చు.
  • "అభయం" (ABHAYAM) ప్రాజెక్ట్ ను రూ. 138.49 కోట్లతో అమలు చేయనున్నారు.
  • 2020 నవంబర్ 23న విశాఖపట్నంలోని 1,000 ఆటోలకు 'ఐఓటీ' (IOT) పరికరాలను అమర్చారు. త్వరలో తిరుపతిలోను, ఆ తర్వాత రాష్ట్రంలోని మిగతా పట్టణాలలో "అభయం" (ABHAYAM) సేవల్ని అందుబాటులోకి తెస్తారు.
  • 2021 ఫిబ్రవరి 1 నాటికి 5,000 వాహనాలకు, 2021 జూలై 1 నాటికి 50,000 వాహనాలకు, 2021 నవంబర్ కు ఒక లక్ష వాహనాలకు 'అభయం' యాప్ (ABHAYAM APP) తో లింక్ అయిన వాహన ట్రాకింగ్ పరికరాల్ని అమరుస్తారు.
  • 'అభయం' యాప్ (ABHAYAM APP) ద్వారా వాహనంలో 'క్యూఆర్ కోడ్' ను స్మార్ట్ ఫోన్ లో స్కాన్ చేసుకుంటే .. వాహనం ఎటు వెళుతోంది, దారి తప్పి వెళుతోందా అన్నది వెంటనే ట్రాక్ అవుతుంది. స్మార్ట్ ఫోన్ లేని ప్రయాణికులు ఆటో ప్రయాణంలో లేదా క్యాబ్ ప్రయాణంలో తమకు ఆపద కలుగుతోందని భావించినట్లయితే .. 'అభయం' డివైస్ మీద ఉండే ప్యానిక్ బటన్ (PANIC BUTTON) ను నొక్కితే .. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వెంటనే వారి రక్షణకు చర్యలు తీసుకునే వీలుంటుంది.
  • 'అభయం' యాప్ (ABHAYAM APP) ను ఆండ్రాయిడ్ ఫోన్ కు అయితే 'గూగుల్ ప్లే స్టోర్' (GOOGLE PLAY STORE) నుంచి లేదా ఐ ఫోన్ కు అయితే 'యాప్ స్టోర్' (APP STORE) నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి