ఈ బ్లాగును సెర్చ్ చేయండి

27, ఏప్రిల్ 2021, మంగళవారం

GK TEST-60 YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

Welcome To GK BITS IN TELUGU Blog

1. పంచాయతీరాజ్ దినోత్సవం (ఏప్రిల్ 24) సందర్భంగా జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2021 ఏడాదిలో ఎన్ని అవార్డులు లభించాయి ? ["దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ పంచాయత్ సశక్తీకరణ్ పురస్కార్ 2021" (మదింపు సంవత్సరం : 2019-20) [Deen Dayal Upadhyay Panchayat Sashaktikaran Puraskar 2021 (Appraisal Year 2019-20)] అవార్డులు జిల్లా స్థాయిలో 'గుంటూరు, కృష్ణా' ; మండల స్థాయిలో 'సదుం (చిత్తూరు జిల్లా), కాకినాడ గ్రామీణం (తూర్పుగోదావరి జిల్లా), విజయవాడ గ్రామీణం (కృష్ణా జిల్లా), పెనుగొండ (అనంతపురం జిల్లా)' ; పంచాయతీ స్థాయిలో 'రేణిమాకులపల్లి (చిత్తూరు జిల్లా), తాళ్లపాలెం, తడ కండ్రిగ (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా), కొండేపల్లి (ప్రకాశం జిల్లా), పెదలబుడు (విశాఖపట్నం జిల్లా), గుళ్లపల్లి (గుంటూరు జిల్లా), వర్కూర్ (కర్నూలు జిల్లా)' లకు అవార్డులు లభించాయి. జిల్లా స్థాయి అవార్డు కింద రూ. 50 వేలు, మండల స్థాయి అవార్డుకు రూ. 25 వేలు, పంచాయతీ స్థాయి అవార్డులకు రూ. 8 వేల నుంచి రూ. 10 వేల చొప్పున నగదు ప్రోత్సాహకాలను 'కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ' అందిస్తుంది]   

(ఎ) 17 
(బి) 18  
(సి) 19  
(డి) 20 

2. పంచాయతీరాజ్ దినోత్సవం (ఏప్రిల్ 24) సందర్భంగా జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2021 ఏడాదిలో లభించిన అవార్డులలో "గ్రామాభివృద్ధి ప్రణాళికల తయారీ" విభాగంలో ఎంపికైన పంచాయతీ ? 

(ఎ) గుళ్లపల్లి (గుంటూరు జిల్లా) 
(బి) వర్కూర్ (కర్నూలు జిల్లా)  
(సి) జి.రాగంపేట (తూర్పు గోదావరి జిల్లా)   
(డి) పెదలబుడు (విశాఖపట్నం జిల్లా) 

3. పంచాయతీరాజ్ దినోత్సవం (ఏప్రిల్ 24) సందర్భంగా జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2021 ఏడాదిలో లభించిన అవార్డులలో "ఈ-పంచాయతీ పురస్కారం" (e-panchayat Award) కేటగిరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ఎన్నో స్థానంలో నిలవడం ద్వారా అవార్డుకు ఎంపికైంది ? 

(ఎ) 1  
(బి) 2 
(సి) 3 
(డి) 4 



4. పంచాయతీరాజ్ దినోత్సవం (ఏప్రిల్ 24) సందర్భంగా జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2021 ఏడాదిలో లభించిన అవార్డులలో "చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామపంచాయతీ అవార్డు 2021" (Child-friendly Gram Panchayat Award-2021) కు ఎంపికైన పంచాయతీ ?    

(ఎ) పెనబర్తి (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) 
(బి) గుళ్లపల్లి (గుంటూరు జిల్లా) 
(సి) పెదలబుడు (విశాఖపట్నం జిల్లా) 
(డి) వర్కూరు (కర్నూలు జిల్లా) 

5. పంచాయతీరాజ్ దినోత్సవం (ఏప్రిల్ 24) సందర్భంగా జాతీయస్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2021 ఏడాదిలో లభించిన అవార్డులలో "నానాజీ దేశ్ ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ సభ పురస్కారం 2021" (Nanaji Deshmukh Rashtriya Gaurav Gram Sabha Puraskar 2021) ఏ పంచాయతీకి లభించినది ? 

(ఎ) అయ్యవారిపల్లి  (శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా)   
(బి) కొత్త వెల్లంటి (శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా)  
(సి) పాత వెల్లంటి (శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా)  
(డి) సీతారామపురం (శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా) 

6. పారిశుద్ధ్యం, ఇతర పరిస్థితుల మెరుగుకు ఉపకరిస్తుందంటూ .. బ్రిటిష్ ప్రభుత్వం 'చీరాల, పేరాల' పంచాయతీలను కలిపి 1920లో పురపాలక సంఘం (MUNICIPALITY) గా ప్రకటించి, పన్నులు భారీగా పెంచింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు 'దుగ్గిరాల గోపాలకృష్ణయ్య' గారి నేతృత్వంలో ఏ తేదీ నుంచి పుర బహిష్కరణ చేశారు ? [ఈ నిరసన "చీరాల-పేరాల ఉద్యమం" (CHIRALA-PERALA MOVEMENT) గా చరిత్రకెక్కింది] 

(ఎ) 1921 ఏప్రిల్ 23 
(బి) 1921 ఏప్రిల్ 24 
(సి) 1921 ఏప్రిల్ 25 
(డి) 1921 ఏప్రిల్ 26 



7. '29వ యుద్ వీర్ ఫౌండేషన్ స్మారక పురస్కారం' (29TH YUDHVIR FOUNDATION MEMORIAL AWARD) ను పొందిన డాక్టర్ ? [ప్రసూతి వైద్యం, మహిళా సాధికారతకు కృషి చేస్తున్నందుకు ఆమె ఈ అవార్డుకు ఎంపికయ్యారు. 2021 ఏప్రిల్ 30న జరిగే అంతర్జాల కార్యక్రమ వేదికగా ఉపరాష్ట్రపతి 'ఎం.వెంకయ్య నాయుడు' ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఇందులో భాగంగా ప్రశంసాపత్రం, రూ. లక్ష గౌరవ పారితోషికం అందజేస్తారు] 

(ఎ) డాక్టర్ మీనాక్షి రామచంద్రన్ 
(బి) డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్  
(సి) డాక్టర్ సునీత కుమారి 
(డి) డాక్టర్ ప్రభ అగర్వాల్ 

8. 'ఆర్చరీ ప్రపంచ కప్ ' తొలిదశ టోర్నీ (ARCHERY WORLD CUP STAGE 1) మహిళల రికర్వ్ విభాగంలో ఏ దేశ జట్టును ఓడించడం ద్వారా భారత్ 'స్వర్ణం' సాధించింది ? [ప్రపంచకప్ టోర్నీలో మహిళల రికర్వ్ విభాగంలో భారత జట్టుకు స్వర్ణం దక్కడం ఇది ఐదోసారి]    

(ఎ) మెక్సికో  
(బి) యూఎస్ఏ   
(సి) జర్మనీ 
(డి) కొలంబియా  

9. 'కొవిడ్-19' నివారణకు ఉద్దేశించిన "కొవిషీల్డ్" (COVISHIELD) టీకాను రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసు రూ. 400 ధరకు సరఫరా చేస్తామని టీకా తయారీదారు 'సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా' ప్రకటించింది. ఇదే టీకాను ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేసే ధర (ఒక్కో డోసుకు) ? 

(ఎ) రూ. 500   
(బి) రూ. 600  
(సి) రూ. 700  
(డి) రూ. 800  



10. 'కొవిడ్-19' నివారణకు ఉద్దేశించిన "కొవాగ్జిన్" (COVAXIN) టీకాను రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసు రూ. 600 ధరకు సరఫరా చేస్తామని టీకా తయారీదారు 'భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్' సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల 2021 ఏప్రిల్ 24న పేర్కొన్నారు. ఇదే టీకాను ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేసే ధర (ఒక్కో డోసుకు) ? [కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు ఈ ధరలు నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది. 'కొవాగ్జిన్' (COVAXIN) టీకాను భారత ప్రభుత్వానికి ఒక డోసుకు రూ. 150 ధరకు అందిస్తున్నారు]    

(ఎ) రూ. 1,000 
(బి) రూ. 1,200 
(సి) రూ. 1,500 
(డి) రూ. 1,800              

కీ (KEY) (GK TEST-60 YEAR : 2021)
1) ఎ    2) సి    3) బి    4) ఎ    5) సి    6) సి    7) బి    8) ఎ    9) బి    10) బి   

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి