ఈ బ్లాగును సెర్చ్ చేయండి

24, ఏప్రిల్ 2021, శనివారం

GK TEST-58 YEAR : 2021 (GK AND CURRENT AFFAIRS BITS IN TELUGU)

Welcome To GK BITS IN TELUGU Blog

1. "అనుపమ పుంచిమంద"  (ANUPAMA PUNCHIMANDA) అనే మహిళ ప్రత్యేకత ? [40 ఏళ్ల అనుపమ బెంగళూరులో 'కరోనా' వ్యాధికి చికిత్స పొందుతూ 2021 ఏప్రిల్ 18న తుది శ్వాస విడిచింది] 
(ఎ) భారత్ నుంచి తొలి మహిళా అంతర్జాతీయ కబడ్డీ రిఫరీ 
(బి) భారత్ నుంచి తొలి మహిళా అంతర్జాతీయ వాలీబాల్ రిఫరీ  
(సి) భారత్ నుంచి తొలి మహిళా అంతర్జాతీయ క్రికెట్ రిఫరీ  
(డి) భారత్ నుంచి తొలి మహిళా అంతర్జాతీయ హాకీ రిఫరీ 

2. 'తాష్కెంట్' (ఉజ్బేకిస్థాన్) లో జరిగిన "ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్' (ASIAN WEIGHTLIFTING CHAMPIONSHIP) లో మహిళల 49 కేజీల విభాగంలో క్లీన్ అండ్ జెర్క్ లో 119 కేజీలు ఎత్తి 'జియాంగ్' (చైనా, 118 కేజీలు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును 2021 ఏప్రిల్ 17న బద్దలు కొట్టిన భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ ?  
(ఎ) జిలీ దలా బెహరా   
(బి) స్నేహ సోరెన్   
(సి) మీరాబాయి చాను   
(డి) రాఖీ హల్దిర్ 

3. లంచం తీసుకుంటూ 'ఏసీబీ' (ACB) కి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ కేసుల్లో ప్రభుత్వోద్యోగులపై ఎన్ని రోజుల్లోగా విచారణ పూర్తిచేసి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ? [నిర్దేశిత కాలపరిమితిలోగా వాటిని అమలు చేయటంలో విఫలమైతే .. ఆ జాప్యానికి సంబంధిత శాఖాధికారులు, ఏసీబీ అధికారుల్ని బాధ్యుల్ని చేసి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది]   
(ఎ) 30  
(బి) 50 
(సి) 100 
(డి) 120 



4. 2019-20 రబీలో రూ. లక్ష వరకు పంట రుణాలు తీసుకొని సకాలంలో తిరిగి చెల్లించిన 6,27,906 మంది రైతులకు వడ్డీ రాయితీ క్రింద రూ. 128.47 కోట్లు వారి బ్యాంక్ పొదుపు ఖాతాలకు నేరుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జమ చేసిన తేదీ ?  
(ఎ) 2021 ఏప్రిల్ 20 
(బి) 2021 ఏప్రిల్ 21 
(సి) 2021 ఏప్రిల్ 22 
(డి) 2021 ఏప్రిల్ 23 

5. 'ఐసీసీ' (ICC) అవినీతి వ్యతిరేక నియమావళిని ఉల్లంఘించినందుకు ఎనిమిదేళ్ల నిషేధానికి గురైన మాజీ క్రికెటర్ 'దిల్హర లొకుహెట్టిగె' ఏ దేశస్థుడు ? [అతడు సస్పెండ్ అయిన తేదీ (2019 ఏప్రిల్ 3) నుంచి నిషేధం అమల్లోకి వస్తుంది]   
(ఎ) జింబాబ్వే    
(బి) వెస్టిండీస్  
(సి) శ్రీలంక  
(డి) కెన్యా 

6. కేంద్ర హోం మంత్రిత్వశాఖ నుంచి 'సర్టిఫికెట్ ఆఫ్ ఎక్సెలెన్సీ' (Certificate of Excellency) పురస్కారాన్ని దక్కించుకున్న కర్నూలు జిల్లాకు చెందిన పోలీస్ స్టేషన్ ? [నేర నియంత్రణ, వేగవంతమైన దర్యాప్తు, ఎస్సీ, ఎస్టీలపై, మహిళలపై జరిగిన నేరాలకు సంబంధించి నమోదు చేసిన కేసులు తదితర అంశాల ఆధారంగా ఈ పోలీస్ స్టేషన్ ను పురస్కారానికి ఎంపిక చేశారు]  
(ఎ) పెద్దకడబూరు 
(బి) పాణ్యం  
(సి) రుద్రవరం 
(డి) పాములపాడు 



7. మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోవడానికి సంబంధించిన వెబ్ సైట్ (http://tafcop.dgtelecom.gov.in) ను రూపొందించి 2021 ఏప్రిల్ 19న ప్రారంభించిన టెలికాం విభాగం (DOT) ? [ఈ వెబ్ సైట్ లో మొబైల్ నంబరు .. దానికి వచ్చే ఓటీపీ (OTP) ని నమోదు చేయగానే మన పేరు మీద ఉన్న ఫోన్ నంబర్ల వివరాలన్నీ వస్తాయి. వాటిలో మనకు అవసరం లేనివి, మనకు తెలియకుండా మన పేరు మీద ఉన్న వాటిని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే .. టెలికాం శాఖ చర్యలు తీసుకుంటుంది]  
(ఎ) విజయవాడ 
(బి) విశాఖపట్నం 
(సి) తిరుపతి 
(డి) అనంతపురం 

8. ఏ తేదీ నుంచి 18 ఏళ్లు దాటిన వారందరికీ 'కరోనా టీకా' అందించే స్వేచ్ఛను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించింది ? [సగం వ్యాక్సిన్ నిల్వలను నేరుగా రాష్ట్రాలకు సరఫరా చేసే అధికారాన్ని వ్యాక్సిన్ తయారీదారులకు కేంద్ర ప్రభుత్వం కల్పించింది]  
(ఎ) 2021 మే 1  
(బి) 2021 మే 2  
(సి) 2021 మే 3 
(డి) 2021 మే 4  

9. అంగారకుడిపై జీవం ఆనవాళ్లను పసిగట్టే లక్ష్యంతో పంపిన 'పర్సెవరెన్స్' రోవర్ (PERSEVERANCE ROVER) లో భాగంగా 'నాసా' ప్రయోగించిన హెలికాప్టర్ "ఇన్ జెన్యుటీ" (INGENUITY) 39 సెకన్ల పాటు తొలిసారి గగనయానం చేసిన తేదీ ? [అంగారకుడిపై నియంత్రిత పద్ధతిలో, స్వీయ శక్తితో ఒక హెలికాప్టర్ గగనయానం చేయడం ఇదే తొలిసారి. 1.8 కిలోల బరువున్న ఈ హెలికాప్టర్ ను 'నాసా' 8.5 కోట్ల డాలర్ల వ్యయంతో నిర్మించారు. అరుణ గ్రహంపై 'ఇన్ జెన్యుటీ' 3 మీటర్ల ఎత్తు ఎగరడాన్ని .. 1903లో రైట్ సోదరులు తొలిసారి పుడమిపై ఆకాశయానం చేసిన చారిత్రక ఘట్టంతో నిపుణులు పోల్చారు]     
(ఎ) 2021 ఏప్రిల్ 16 
(బి) 2021 ఏప్రిల్ 17 
(సి) 2021 ఏప్రిల్ 18  
(డి) 2021 ఏప్రిల్ 19  



10. 'జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం' (MGNREGA) పనులకు హాజరయ్యే కూలీలకు 2020-21లో రూ. 237 గా ఉన్న కనీస వేతనాన్ని 2021-22లో ఎంతకు పెంచుతూ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఇటీవల నిర్ణయించింది ? [కేంద్ర ప్రభుత్వం పెంచిన కనీస వేతనం 2021 ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలులోకి వచ్చింది] 
(ఎ) రూ. 240 
(బి) రూ. 245 
(సి) రూ. 250 
(డి) రూ. 255              

కీ (KEY) (GK TEST-58 YEAR : 2021)
1) డి    2) సి    3) సి    4) ఎ    5) సి    6) ఎ    7) ఎ    8) ఎ    9) డి    10) బి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి