1. ఏ రాష్ట్ర హైకోర్ట్ ఏర్పడి 60 సంవత్సరాలైన సందర్భంగా .. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్మారక తపాలా బిళ్ళను భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' 2021 ఫిబ్రవరి 6న విడుదల చేశారు ?
E & OE (Errors & Omissions Expected)
(ఎ) గుజరాత్
(బి) కేరళ
(సి) కర్ణాటక
(డి) మధ్యప్రదేశ్
2. 'తరంజిత్ సింగ్ సంధూ' (Taranjit Singh Sandhu) భారతదేశ రాయబారిగా ఉన్న దేశం ?
(ఎ) చైనా
(బి) అమెరికా
(సి) పాకిస్థాన్
(డి) మయన్మార్
3. ఒక గ్రాండ్ స్లామ్ (ఆస్ట్రేలియన్ ఓపెన్) మహిళల విభాగంలో మెయిన్ డ్రా కు అర్హత సాధించిన అయిదో భారత టెన్నిస్ క్రీడాకారిణి ? [సానియా మీర్జా తర్వాత ఒక గ్రాండ్ స్లామ్ టోర్నీలో డబుల్స్ బరిలో దిగుతోంది కూడా ఈ అమ్మాయే]
(ఎ) నిరుపమా మన్కడ్
(బి) నిరుపమా వైద్యనాథన్
(సి) శిఖా ఒబెరాయ్
(డి) అంకిత రైనా
4. అరంగేట్ర టెస్టు నాలుగో ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ (210 నాటౌట్) సాధించిన తొలి ఆటగాడు ? [ఈ ఘనతతో 2021 ఫిబ్రవరి 7న ముగిసిన తొలి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై వెస్ట్ ఇండీస్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది]
(ఎ) జోషువా సిల్వా
(బి) కైల్ మేయర్స్
(సి) సిమ్రన్ హెట్మెయర్
(డి) కెమర్ రోచ్
5. 'ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం (MIAL) లో 74% వాటా కలిగిన సంస్థ ?
(ఎ) అదానీ ఎయిర్ పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్
(బి) ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
(సి) జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్
(డి) జీవీకే ఎయిర్ పోర్ట్ డెవలపర్స్
6. కర్ణాటకలోని మంగళూరు సమీపం 'ముల్కి' వద్ద 2021 ఫిబ్రవరి 6న నిర్వహించిన "ఐకళ కాంతాబారె బూదాబారె కంబళ" లో దున్నపోతుల వెంట వంద మీటర్ల దూరాన్ని 'బైందూరు విశ్వనాథ్' ఎన్ని సెకన్లలో చేరుకొని సరికొత్త రికార్డు సృష్టించారు ? [ఇప్పటి వరకు 'శ్రీనివాసగౌడ' అనే కంబళ వీరుడు సృష్టించిన 9.55 సెకన్లు రికార్డుగా ఉండేది]
(ఎ) 9.15 సెకన్లు
(బి) 9.25 సెకన్లు
(సి) 9.35 సెకన్లు
(డి) 9.45 సెకన్లు
7. 2021 ఫిబ్రవరి 7న ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లా 'జోషిమఠ్' సమీపంలో నందాదేవి హిమానీనదంలోని పెద్ద మంచు చరియలు విరిగి ఏ నదిలో పడడంతో హఠాత్తుగా భారీ వరదలు సంభవించాయి ?
(ఎ) రుషిగంగ
(బి) ధౌలీగంగ
(సి) అలకనంద
(డి) మందాకిని
8. 2021 ఫిబ్రవరి 7న చిత్తూరు జిల్లా 'మదనపల్లె' లోని "సత్సంగ్ ఫౌండేషన్" (SATSANG FOUNDATION) లో ఆశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు భారత యోగా విద్యా కేంద్రాన్ని ప్రారంభించినది ? [ఈ కార్యక్రమంలో 'పద్మభూషణ్' అవార్డు గ్రహీత, సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు "ముంతాజ్ అలీ" కూడా పాల్గొన్నారు]
(ఎ) అమిత్ షా
(బి) నరేంద్ర మోదీ
(సి) ఎం.వెంకయ్య నాయుడు
(డి) రామ్ నాథ్ కోవింద్
9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'ఉపాధి హామీ పథకం' (నరేగా) కూలీలకు చెల్లించే వేతనంతోపాటు అదనంగా చెల్లించే వేసవి భత్యం ?
(ఎ) ఫిబ్రవరి-10 శాతం, మార్చ్-15 శాతం, ఏప్రిల్, మే-20 శాతం, జూన్-10 శాతం
(బి) ఫిబ్రవరి-15 శాతం, మార్చ్-20 శాతం, ఏప్రిల్, మే-25 శాతం, జూన్-15 శాతం
(సి) ఫిబ్రవరి-20 శాతం, మార్చ్-25 శాతం, ఏప్రిల్, మే-30 శాతం, జూన్-20 శాతం
(డి) ఫిబ్రవరి-25 శాతం, మార్చ్-30 శాతం, ఏప్రిల్, మే-35 శాతం, జూన్-25 శాతం
10. కర్ణాటకలో ఎన్నవ జిల్లాగా "విజయనగర" (VIJAYANAGARA) ను 2021 ఫిబ్రవరి 8న ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ? [బళ్లారి జిల్లా నుంచి వేరు చేసి 'హోసపేటె' కేంద్రంగా "విజయనగర" జిల్లాను ఏర్పాటు చేశారు]
(ఎ) 31
(బి) 32
(సి) 33
(డి) 34
కీ (KEY) (GK TEST-13 DATE : 2021 FEBRUARY 9)
1) ఎ 2) బి 3) డి 4) బి 5) ఎ 6) ఎ 7) బి 8) డి 9) సి 10) ఎ E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి