ఈ బ్లాగును సెర్చ్ చేయండి

4, ఫిబ్రవరి 2021, గురువారం

GK TEST-8 DATE : 2021 FEBRUARY 4

1. ఒడిశాలోని 'సంబల్ పుర్' లో నెలకొల్పిన "ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్" (IIM - Sambalpur) ప్రాంగణ భవనాల నిర్మాణ పనులకు 2021 జనవరి 2న భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. 'ఐఐఎం-సంబల్ పుర్' మహానదికి చేరువగా అద్దె భవనంలో ప్రారంభమైన సంవత్సరం ? [ప్రస్తుతం మనదేశంలో మొత్తం 20 ఐఐఎం లు ఉన్నాయి] 
(ఎ) 2014 
(బి) 2015  
(సి) 2016  
(డి) 2017 

2. డిజిటల్ ఆధారిత సమాచార సమాజాన్ని నిర్మించడానికి, జాతీయ ఇ-పరిపాలనా ప్రణాళికను భారీస్థాయిలో ఆవిష్కరించడానికి భారత ప్రభుత్వం "డిజిటల్ ఇండియా" (DIGITAL INDIA) కార్యక్రమాన్ని ప్రారంభించిన తేదీ ? [జాతీయ ఇ-పరిపాలన ప్రణాళికను 2006 మే 18న చేపట్టారు]  
(ఎ) 2015 జనవరి 26 
(బి) 2015 ఏప్రిల్ 1  
(సి) 2015 జూలై 1  
(డి) 2015 ఆగస్ట్ 15 

3. వికేంద్రీకృత ప్రణాళిక, రిపోర్టింగ్ లో పురోగతి, పని ఆధారిత అకౌంటింగ్ లో మెరుగైన పారదర్శకతను తీసుకురావడమే లక్ష్యంగా "ఇ-గ్రామస్వరాజ్" (eGramSwaraj) అనే ఏకీకృత పోర్టల్ ను భారత ప్రభుత్వం ప్రారంభించిన తేదీ ? ["గ్రామ పంచాయతీల సమాచారం, ప్రణాళిక, పనుల భౌతిక పురోగతి, ఆర్ధిక పురోగతి, ఆస్తుల నిర్వహణ, జియోట్యాగింగ్, ప్రజా ఆర్ధిక నిర్వహణ వ్యవస్థ" అనే అంశాలతో 'ఇ-గ్రామస్వరాజ్' నిర్మితమైంది] 
(ఎ) 2020 ఏప్రిల్ 21  
(బి) 2020 ఏప్రిల్ 22 
(సి) 2020 ఏప్రిల్ 23 
(డి) 2020 ఏప్రిల్ 24 



4. భూముల రిజిస్ట్రేషన్, వాటికి సంబంధించిన వివరాలను పొందుపరుస్తూ 'తెలంగాణ' రాష్ట్రంలో ప్రవేశపెట్టిన వెబ్ సైట్ ? 
(ఎ) ధరణి 
(బి) అవని 
(సి) పుడమి 
(డి) భూధార్ 

5. మనదేశంలో మొట్టమొదటి '5జీ ఆవిష్కరణల ప్రయోగశాల" (5G Innovation Lab) ను "ఒప్పో మొబైల్ టెలీ కమ్యూనికేషన్స్ కార్పోరేషన్ లిమిటెడ్" (OPPO) ఎక్కడ ఏర్పాటు చేసింది ? 
(ఎ) బెంగళూరు   
(బి) హైదరాబాద్  
(సి) నోయిడా  
(డి) చెన్నై 

6. 2020 మార్చ్ నెలలో 'మోడెర్నా' (MODERNA) సంస్థ తయారు చేసిన కొవిడ్-19 వ్యాక్సిన్ (mRNA-1273) ను వేయించుకోవడానికి ధైర్యంగా ముందుకొచ్చిన తొలి మహిళ ? [నిజానికి అప్పటికి వ్యాక్సిన్ గురించి ఏమాత్రం భరోసా లేదు]
(ఎ) ఎలిసా గ్రెనాటో  
(బి) మార్గరెట్ కీనన్ 
(సి) జెన్నిఫర్ హాలెర్ 
(డి) డాక్టర్ నిఖిలా జువ్వాది 



7. ప్రభుత్వరంగ సంస్థల విద్యుత్తు అవసరాల కోసం 'వయబిలిటీ గ్యాప్ ఫండింగ్' (VGF) విధానంలో దేశవ్యాప్తంగా ఎన్ని మెగావాట్ల సౌర విద్యుత్తు ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని 'కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ' (MNRE) భావిస్తోంది ? ['VGF' విధానంలో ఏర్పాటు చేసే ప్రాజెక్టులకు మెగావాట్ కు రూ. 90 లక్షల వరకు గ్రాంటు అందుతుంది]  
(ఎ) 10,000 MW 
(బి) 12,000 MW 
(సి) 14,000 MW 
(డి) 16,000 MW 

8. మనదేశంలో 'వస్తు, సేవల పన్ను' (GST) అమల్లోకి వచ్చిన తరవాత భారీ మొత్తం (రూ. 1,19,847 కోట్లు) లో 'జీఎస్టీ' వసూలు అయిన నెల ?  
(ఎ) 2020 అక్టోబర్  
(బి) 2020 నవంబర్  
(సి) 2020 డిసెంబర్ 
(డి) 2021 జనవరి  

9. విశాఖపట్నం కేంద్రంగా "దక్షిణ కోస్తా రైల్వే జోన్" (South Coast Railway Zone) ఏర్పాటుకు ప్రక్రియ మొదలైనట్లు కేంద్ర మంత్రి 'పీయూష్ గోయల్' అధికారికంగా ప్రకటించిన తేదీ ?
(ఎ) 2019 ఫిబ్రవరి 25 
(బి) 2019 ఫిబ్రవరి 26 
(సి) 2019 ఫిబ్రవరి 27  
(డి) 2019 ఫిబ్రవరి 28  



10. జాతీయ మహిళా కమిషన్ (NCW) ఏర్పాటైన తేదీ ? [జాతీయ మహిళా కమిషన్ ప్రస్తుత అధ్యక్షురాలు : "రేఖా శర్మ"] 
(ఎ) 1992 జనవరి 31 
(బి) 1992 ఫిబ్రవరి 1 
(సి) 1992 ఫిబ్రవరి 2 
(డి) 1992 ఫిబ్రవరి 3              

కీ (KEY) (GK TEST-8 DATE : 2021 FEBRUARY 4)
1) బి    2) సి    3) డి    4) ఎ    5) బి    6) సి    7) బి    8) డి    9) సి    10) ఎ  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి