1. దేశీయ అంకురాలను ప్రోత్సహించేందుకు ఇప్పటికే అందిస్తున్న పన్ను రాయితీలతోపాటు, పెట్టుబడులపై వచ్చిన మూలధన రాబడిపై పన్ను మినహాయింపును కేంద్ర ప్రభుత్వం ఏ తేదీ వరకు పొడిగించింది ?
E & OE (Errors & Omissions Expected)
(ఎ) 2022 మార్చ్ 31
(బి) 2023 మార్చ్ 31
(సి) 2024 మార్చ్ 31
(డి) 2025 మార్చ్ 31
2. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఒకే ఒక్క సాకుతో .. మూడు నెలల క్రితం భారీ మెజారిటీతో ఎన్నికైన ప్రజా ప్రభుత్వాన్ని (NLD) మయన్మార్ లోని సైన్యం కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకున్న తేదీ ? [ఏడాది పాటు అత్యయిక స్థితి కొనసాగుతుందని, ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తామని సైన్యం తెలిపింది]
(ఎ) 2021 జనవరి 30
(బి) 2021 జనవరి 31
(సి) 2021 ఫిబ్రవరి 1
(డి) 2021 ఫిబ్రవరి 2
3. బెంగాల్ ప్రజలు ఏ రకం చీరను అత్యంత పవిత్రంగా భావిస్తారు ? [లోక్ సభలో '2021-22 కేంద్ర బడ్జెట్' ప్రవేశపెట్టే సమయంలో ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' ఈ చీరనే కట్టుకున్నారు]
(ఎ) కోటా డోరియా
(బి) ఇకత్
(సి) కంజీవరం
(డి) లాల్ పాడ్ సఫేద్
4. 'కొవిడ్ ఉమెన్ వారియర్' (COVID WOMEN WARRIOR) గా కేంద్ర మంత్రి 'ప్రకాష్ జావడేకర్' చేతుల మీదుగా దిల్లీలో జాతీయ పురస్కారాన్ని అందుకున్న "బి.రాజకుమారి" (B.Rajakumari) ఏ జిల్లాకు 'ఎస్పీ' (SP) గా ఉన్నారు ?
(ఎ) శ్రీకాకుళం
(బి) విజయనగరం
(సి) విశాఖపట్నం
(డి) తూర్పుగోదావరి
5. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ ను కోల్పోవడం ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి విశాఖపట్నం అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కోరడంతో 15వ ఆర్ధిక సంఘం ఎంత మొత్తం గ్రాంట్ ను సిఫార్సు చేసింది ?
(ఎ) రూ. 1,000 కోట్లు
(బి) రూ. 1,200 కోట్లు
(సి) రూ. 1,400 కోట్లు
(డి) రూ. 1,600 కోట్లు
6. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10 ప్రాజెక్టులకు విదేశీ ఆర్ధిక సంస్థల నుంచి 2021-22 ఆర్ధిక సంవత్సరంలో ఎన్ని కోట్ల రుణాన్ని కేంద్రం బడ్జెట్ లో ప్రతిపాదించింది ?
(ఎ) రూ. 15,856 కోట్లు
(బి) రూ. 15,857 కోట్లు
(సి) రూ. 15,858 కోట్లు
(డి) రూ. 15,859 కోట్లు
7. 2021-22 రైల్వే బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెండు మార్గాల్లో సరకు రవాణా చేసే గూడ్స్ రైళ్ల కోసం 'ప్రత్యేక కారిడార్లు' (DFC) నిర్మించనున్నారు. అందులో తూర్పు-కోస్తా డీ ఎఫ్ సీ మార్గం ?
(ఎ) హౌరా - విజయవాడ
(బి) సీల్డా - విజయవాడ
(సి) అసన్ సోల్ - విజయవాడ
(డి) ఖరగ్ పుర్ - విజయవాడ
8. 2021-22 రైల్వే బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెండు మార్గాల్లో సరకు రవాణా చేసే గూడ్స్ రైళ్ల కోసం 'ప్రత్యేక కారిడార్లు' (DFC) నిర్మించనున్నారు. అందులో ఉత్తర-దక్షిణ డీ ఎఫ్ సీ మార్గం ?
(ఎ) ఇండోర్ - విజయవాడ
(బి) గ్వాలియర్ - విజయవాడ
(సి) ఇటార్సీ - విజయవాడ
(డి) భోపాల్ - విజయవాడ
9. తెలుగు రాష్ట్రాల నుంచి భారత ఫుట్ బాల్ టీమ్ (India Women's National Football Team) కి ఎంపికైన తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించినది ? [వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ (ASIA CUP) టోర్నీలో ఆడేందుకు ఈ క్రీడాకారిణి ఎంపికైంది]
(ఎ) వెన్నం జ్యోతి సురేఖ
(బి) గుగులోత్ సౌమ్య
(సి) దివ్య గుప్తా
(డి) దీపికా కుమారి
10. ప్రపంచంలో కేంద్ర బ్యాంకు ఆమోదంతో మొట్టమొదటి డిజిటల్ కరెన్సీ (FIRST DIGITAL CURRENCY IN THE WORLD) ని విడుదల చేసిన దేశం ?
(ఎ) అమెరికా
(బి) బహమాస్
(సి) క్యూబా
(డి) టర్కీ
కీ (KEY) (GK TEST-17 DATE : 2021 FEBRUARY 13)
1) ఎ 2) సి 3) డి 4) బి 5) సి 6) సి 7) డి 8) సి 9) బి 10) బి E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి