ఈ బ్లాగును సెర్చ్ చేయండి

11, ఫిబ్రవరి 2021, గురువారం

GK TEST-15 DATE : 2021 FEBRUARY 11

1. బ్రాడ్ గేజ్ (BROAD GUAGE) రైలు మార్గాల్లో 100% విద్యుదీకరణ ఏ సంవత్సరానికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ? 
(ఎ) 2022 
(బి) 2023  
(సి) 2024  
(డి) 2025 

2. రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటవుతూ వచ్చిన 'సైనిక్ స్కూళ్ల (SAINIK SCHOOLS)' ను ఇకమీదట 'ఎన్ జీ ఓ' (NGO) లు, ప్రైవేట్ పాఠశాలలు, రాష్ట్రాల భాగస్వామ్యంతో కలిసి దేశంలో ఎన్ని చోట్ల ఏర్పాటు చేయనున్నారు ? 
(ఎ) 70 
(బి) 80  
(సి) 90  
(డి) 100 

3. దేశంలో మొత్తం పన్నుల్లో రాష్ట్రాల వాటా ఏ ఆర్ధిక సంవత్సరం వరకు ప్రస్తుతమున్న 42% గానే కొనసాగించాలని 'ఎన్.కె.సింగ్' నేతృత్వంలోని 15వ ఆర్ధిక సంఘం (15TH FINANCE COMMISSION) సిఫార్సు చేసింది ?  
(ఎ) 2022-23  
(బి) 2023-24 
(సి) 2024-25 
(డి) 2025-26 



4. '2021-22 కేంద్ర బడ్జెట్' (Union Budget 2021-22) లో "ఆరోగ్యం, యోగక్షేమాలకు' ఏకంగా రూ. 2.23 లక్షల కోట్లు కేటాయించారు. గత బడ్జెట్ తో పోలిస్తే ఈ మొత్తం ఎంత అధికం ? [మొత్తం కేటాయింపుల్లో 'ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ' కు రూ. 71,268 కోట్లు, కొవిడ్ టీకాల కోసం రూ. 35 వేల కోట్లు కేటాయించారు]  
(ఎ) 135% 
(బి) 136% 
(సి) 137% 
(డి) 138% 

5. '2021-22 కేంద్ర బడ్జెట్' (Union Budget 2021-22) లో ప్రకటించిన "ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన" (PM ATMANIRBHAR SWASTH BHARAT YOJANA) ప్రత్యేక పథకం కోసం ఆరేళ్ల కాలానికిగాను ఎంత మొత్తం కేటాయించారు ? ['జాతీయ ఆరోగ్య మిషన్' కు అదనంగా ఈ పథకం అమలు కానుంది] 
(ఎ) రూ. 54,180 కోట్లు   
(బి) రూ. 64,180 కోట్లు  
(సి) రూ. 74,180 కోట్లు  
(డి) రూ. 84,180 కోట్లు 

6. వచ్చే ఆర్ధిక సంవత్సరం (2021-22) లో ప్రభుత్వం ఎంత మొత్తంలో అప్పు చేయనున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' తెలిపారు ? 
(ఎ) రూ. 12.05 లక్షల కోట్లు 
(బి) రూ. 13.05 లక్షల కోట్లు 
(సి) రూ. 14.05 లక్షల కోట్లు 
(డి) రూ. 15.05 లక్షల కోట్లు 



7. '2021-22 కేంద్ర బడ్జెట్' (Union Budget 2021-22) లో "వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ" కు చేసిన కేటాయింపులు ? [ఇందులో దాదాపు సగం నిధులను .. కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'పీఎం-కిసాన్' పథకానికి ప్రత్యేకించారు] 
(ఎ) రూ. 1,11,531 కోట్లు 
(బి) రూ. 1,21,531 కోట్లు 
(సి) రూ. 1,31,531 కోట్లు 
(డి) రూ. 1,41,531 కోట్లు 

8. ఆర్ధిక ఇబ్బందులతో కునారిల్లుతున్న విద్యుత్ పంపిణీ సంస్థలకు నూతన జవసత్వాలు అందించడమే లక్ష్యంగా రానున్న ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం వెచ్చించనున్న మొత్తం ?  
(ఎ) రూ. 3.05 లక్షల కోట్లు  
(బి) రూ. 4.05 లక్షల కోట్లు  
(సి) రూ. 2.05 లక్షల కోట్లు 
(డి) రూ. 1.05 లక్షల కోట్లు  

9. 2021 ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధిక మంత్రి 'నిర్మలా సీతారామన్' ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ విలువ ?
(ఎ) రూ. 1 లక్ష కోట్లు 
(బి) రూ. 1.10 లక్షల కోట్లు 
(సి) రూ. 1.20 లక్షల కోట్లు  
(డి) రూ. 1.30 లక్షల కోట్లు  



10. వచ్చే ఆర్ధిక సంవత్సరం (2021-22) లో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం సమీకరించాలనుకుంటున్న మొత్తం ? 
(ఎ) రూ. 1.45 లక్షల కోట్లు  
(బి) రూ. 1.55 లక్షల కోట్లు 
(సి) రూ. 1.65 లక్షల కోట్లు 
(డి) రూ. 1.75 లక్షల కోట్లు              

కీ (KEY) (GK TEST-15 DATE : 2021 FEBRUARY 11)
1) బి    2) డి    3) డి    4) సి    5) బి    6) ఎ    7) సి    8) ఎ    9) బి    10) డి  

E & OE (Errors & Omissions Expected)
All the best by www.gkbitsintelugu.blogspot.com 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి